అలాంటి వాటితో జాగ్రత్త.. కల్కి మేకర్స్ వార్నింగ్..! | Kalki Makers Warning To audience about Fake audition calls | Sakshi
Sakshi News home page

Kalki Movie: బీ కేర్‌పుల్.. కల్కి మేకర్స్ వార్నింగ్..!

Sep 3 2026 7:47 PM | Updated on Sep 3 2026 8:14 PM

Kalki Makers Warning To audience about Fake audition calls

కల్కి మూవీ మేకర్స్ ప్రేక్షకులను విజ్ఞప్తి చేశారు. ఎవరైనా మా పేరుతో నకిలీ కాస్టింగ్ కాల్స్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తెలియజేస్తూ పోస్ట్ చేసింది.

మా తరఫున ఆడిషన్స్ కానీ.. కాస్టింగ్ కానీ నిర్వహించడానికి ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీ, కంపెనీ లేదా వ్యక్తులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వైజయంతి మూవీస్ స్పష్టం చేసింది. మా ప్రతినిధులమని చెప్పుకుంటూ ఎవరైనా సంప్రదిస్తే నమ్మవద్దని కోరింది. తమ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మాణ సంస్థ కోరింది.

​ఎవరైనా సరే తమ వ్యక్తిగత వివరాలు, ఆడిషన్ మెటీరియల్ పంచుకోవద్దని స్పష్టం చేసింది. ఎవరికీ కూడా ఎలాంటి చెల్లింపులు చేయవద్దని హెచ్చరించింది. తమ సంస్థ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. కల్కి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏదైనా అధికారిక సమాచారం కోసం కేవలం వైజయంతి మూవీస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను మాత్రమే అనుసరించాలని స్పష్టం చేసింది. కాగా.. కల్కి మూవీకి సీక్వెల్‌గా కల్కి-2 కూడా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement