నాని హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్ అభిమానులను అలరించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే మరో సాంగ్ విడుదల చేశారు.
తాజాగా రిలీజైన మాస్ సాంగ్ ఏషనాగుల ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాట గురించే టాక్ వినిపిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే యూట్యూబ్ వేదికగా 50+ మిలియన్ వ్యూస్ దాటిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
#Yeshanagula sets an unprecedented record 🔥🔥
Becomes the FASTEST TELUGU SONG TO HIT 50 MILLION+ VIEWS in under 5 days 💥💥#TheParadise second single is TRENDING #1 on YouTube Global Charts ❤🔥
▶️ https://t.co/yqhCQaF2Jd
GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.
Natural Star… pic.twitter.com/uVMACvbSOC— SLV Cinemas (@SLVCinemasOffl) September 3, 2026


