మీర్జాపూర్ – ది మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అమెజాన్ క్యాంపస్‌లో ఉద్యోగులకు ఊహించని సర్‌ప్రైజ్ లభించింది. కంపెనీ వార్షిక ‘ఆల్ ఇండియా మీటింగ్’ (AIM) సందర్భంగా ‘మీర్జాపూర్’ ఫ్రాంచైజీకి చెందిన నటీనటులను ప్రత్యేకంగా క్యాంపస్‌కు తీసుకొచ్చి లైవ్ అపియరెన్స్ ఇప్పించింది. దీంతో ఆఫీస్ వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది.
‘మీర్జాపూర్ నటీనటులు హైదరాబాద్‌లోని అమెజాన్ కార్యాలయంలోకి అడుగుపెట్టగానే.. ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఊహించని విధంగా తమ అభిమాన తారలు కళ్లముందు ప్రత్యక్షం కావడంతో ఆఫీస్ మొత్తం సందడిగా మారిపోయింది. ఒక సాధారణ వార్షిక సమావేశంగా ప్రారంభమైన ఏఐఎం, వీరి రాకతో ఒక పాప్-కల్చర్ దృశ్యం కనిపించింది.

ఈ వార్త త్వరగానే సోషల్ మీడియాలో వైరలైంది. ఉద్యోగులు లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఎక్స్‌లలో ఫోటోలు, వీడియోలు, తెరవెనుక క్లిప్‌లతో నింపేశారు. పని ప్రదేశంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఎలా ఉండాలనే దానిపై పునరాలోచన చేస్తున్న పెద్ద సంస్థల యజమానులలో పెరుగుతున్న ధోరణిని ఈ చర్య ప్రతిబింబిస్తోంది. పోటీతత్వంతో కూడిన ప్రతిభావంతుల మార్కెట్‌లో, విధేయతను.. సంస్థలో భాగమనే భావనను పెంపొందించడంలో సాధారణ ప్రోత్సాహకాల కంటే ఆశ్చర్యపరిచే, ఆనందపరిచే అనుభవాలను అందించింది.


