breaking news
Mirzapur The Movie
-
మీర్జాపూర్ ది మూవీ షూటింగ్ జ్ఞాపకాల్లో శ్రియ పిల్గాంకర్.. ఫోటోలు
-
తెలుగులో ఫ్లాఫ్.. అక్కడ మాత్రం హిట్.. అందుకేనా?
సినీ ప్రేక్షకుల గుండెల్లో సూపర్ హిట్‌గా నిలిచిపోయిన సిరీస్ మీర్జాపూర్. ఈ సిరీస్ మూడు సీజన్లు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. బాలీవుడ్లో తెరకెక్కించినప్పటికీ ఇతర భాషల్లో సత్తా చాటింది. దీంతో ఈ వెబ్ సిరీస్‌లను మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మీర్జాపూర్ ది మూవీ పేరుతో రిలీజ్ చేశారు.అయితే వెబ్ సిరీస్‌కు లభించినంత ఆదరణ ఈ సినిమాకు లభిస్తుందని మేకర్స్ భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పంకజ్ త్రిపాఠి, దివ్యెందు శర్మ, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. తెలుగులో అయితే ఈ సినిమాకు ఆదరణ కరువైంది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో తెలుగులో కొద్దిపాటి వసూళ్లకే పరిమితమైంది.హిందీలో మాత్రం..దక్షిణాది భాషల్లో లభించని ఆదరణ బాలీవుడ్లో మాత్రం దక్కుతోంది. హిందీ మార్కెట్లో ఈ మూవీకి రూ.150 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. హనుమాన్ అంశ్ లాంటి మూవీ పోటీ ఉన్నప్పటికీ మీర్జాపూర్ మాత్రం కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. హిందీలో వసూళ్లు ఫర్వాలేదనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే రూ.200 కోట్ల వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఫీట్ అందుకుంటుందేమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే సరిపోదు: మిర్జాపుర్ నటి
సినీ ఇండస్ట్రీలో ప్రతిభ, టాలెంట్ ఉన్నంత మాత్రాన అవకాశాలు దక్కుతాయని చెప్పలేమని నటి రసికా దుగ్గల్ అన్నారు. ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సినిమా రంగంలో అవకాశాలు ఎలా వస్తాయనే విషయంపై ఓ ఇంటర్వ్యులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇదీ చదవండి: భార్యను రెడీ చేయించేందుకు అమితాబ్‌కీ తప్పని తిప్పలు!ఆ నటీనటులకు కూడా..‘జీవితంలో కొన్నిసార్లు ప్రతిభ కంటే వ్యాపారపరమైన అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో కళాత్మక ప్రతిభ కూడా అవవసరమవుతుంది. ఒక నటుడి పని పెరుగుతున్న కొద్దీ.. అతడిపై ప్రేక్షకులు, దర్శకనిర్మాతల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. నటుడు తమ ప్రాజెక్టుకు సరిపోతాడని భావించినప్పుడే కాస్టింగ్ జరుగుతుంది. పని పెరుగుతున్నప్పుడు.. ఆ ప్రాజెక్టుకు సరిపోతారని వారు భావించినప్పుడు మాత్రమే ఎంపిక చేస్తారు. అలా అనిపించకపోతే అవకాశం ఇవ్వరు. మంచి గుర్తింపు వచ్చిన నటీనటులకు కూడా అవకాశాలు చేజారడం బాధ కలిగిస్తుంది’ అని రసికా చెప్పింది.‘మిర్జాపూర్’తో గుర్తింపురసికా దుగ్గల్ ‘మిర్జాపూర్’ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్రియా పిల్గావోంకర్, కుల్‌భూషణ్ ఖర్బందా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదీ చదవండి: ‘కల్చర్ అనేది వేసుకునే దుస్తుల్లో లేదు’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. -
దారులు ఏవైనా.. వసూళ్లు మాత్రం అదుర్స్.. ఎంతంటే?
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రెండు సినిమాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకటి ఇప్పటికే ఓటీటీలో భారీ ఆదరణ పొందిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ‘మిర్జాపూర్: ది మూవీ’ కాగా.. మరొకటి పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి క్రమంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘హనుమాన్ అంశ్’. ఈ రెండు సినిమాలు విజయవంతమైనప్పటికీ వాటి బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. మూడు రోజుల్లోనే రూ.90 కోట్లకు..గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవికిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాక్నిల్క్ గణాంకాల ప్రకారం తొలి రోజే ఈ చిత్రం సుమారు రూ.25.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే భారత్‌లో రూ.93.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.నెమ్మదిగా మొదలై.. భారీ వసూళ్లు‘హనుమాన్ అంశ్’ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస ప్రధాన చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. తొలివారం కేవలం రూ.1.08 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో వారంలోనూ రూ.0.40 కోట్లకే పరిమితమైంది. అయితే మూడో వారం నుంచి సినిమా వసూళ్లు జోరు అందుకున్నాయి.ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్మూడో వారంలో రూ.10.40 కోట్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాతి వారాల్లోనూ జోరు కొనసాగించింది. 29వ రోజుకు భారత్‌లో రూ.82.88 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఐదో శనివారం ఏకంగా రూ.16.50 కోట్లు, 31వ రోజు రూ.22.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 31 రోజుల్లోనే రూ.122.13 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుంది. 32వ రోజు నాటికి ఈ మొత్తం సుమారు రూ.122.53 కోట్లకు చేరినట్లు సాక్నిల్క్ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ( వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్)ప్రేక్షకుల ఆదరణతో..‘మిర్జాపూర్: ది మూవీ’ ఫ్రాంచైజీ క్రేజ్‌తో విడుదలైన వెంటనే భారీ ఓపెనింగ్ సాధించింది. మరోవైపు ‘హనుమాన్ అంశ్’ మొదట్లో తక్కువ వసూళ్లు సాధించినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా మంచి వసూళ్లు సాధించింది. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయానికి ఒక్కో సినిమాది ఒక్కో దారి అని ఈ రెండు చిత్రాలు నిరూపిస్తున్నాయి. -
తెరపైనా అదరగొడుతున్న ‘మిర్జాపూర్’.. కలెక్షన్లు ఎంతంటే.?
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవి కిషన్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మిర్జాపూర్:ది మూవీ’. ఓటీటీలో ‘మిర్జాపూర్’ వెబ్‌సిరీస్‌కు మంచి ఆదరణ రావడంతో అదే పేరుతో మరో కొత్త కథతో తెరపైకీ తీసుకొచ్చారు. ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలి రోజు నుంచే మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. ఆదివారం మరింత జోరు చూపించింది. మూడో రోజు ఏకంగా రూ. 36 కోట్ల నెట్ వసూళ్లూ సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువమంది చదివింది: ‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులురూ.100 కోట్లకు చేరువలో..గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం రూ.25.75 కోట్లతో బోణీ కొట్టింది. శనివారం అదే జోరులో కలెక్షన్లు మరింత పెరిగి రూ. 32 కోట్లకు చేరాయి. ఆదివారం వచ్చే సరికి ఈ చిత్రం రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్లు సుమారు రూ. 93.75 కోట్లకు చేరాయి. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేందుకు దాదాపు రూ.6 కోట్ల దూరంలోనే ఉంది.ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..?ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లుఈ చిత్రం.. ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. సాక్నిల్క్(గణాంకాల నివేదిక) ప్రకారం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.132.35 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇందులో దాదాపు రూ.20 కోట్లు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చినట్లు సమాచారం. -
మీర్జాపూర్ సిరీస్ మాత్రమే కాదు.. సినిమా కూడా..!
మీర్జాపూర్ సిరీస్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్ని సీజన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా సూపర్ హిట్ అయిన ఈ సిరీస్‌లను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మీర్జాపూర్: ది మూవీ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. ఈ చిత్రం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.78 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ. 68.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ. 56.75 నెట్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్, శ్రియా పిల్గావ్కర్, హర్షిత శేఖర్ గౌర్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ మూవీ సెప్టెంబర్ 4, 2026న సినిమా థియేటర్లలో విడుదలైంది. -
అమెజాన్ ఉద్యోగులకు సర్ప్రైజ్.. మీర్జాపూర్ తారల సందడి
మీర్జాపూర్ – ది మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అమెజాన్ క్యాంపస్‌లో ఉద్యోగులకు ఊహించని సర్ప్రైజ్ లభించింది. కంపెనీ వార్షిక ‘ఆల్ ఇండియా మీటింగ్’ (AIM) సందర్భంగా ‘మీర్జాపూర్’ ఫ్రాంచైజీకి చెందిన నటీనటులను ప్రత్యేకంగా క్యాంపస్‌కు తీసుకొచ్చి లైవ్ అపియరెన్స్ ఇప్పించింది. దీంతో ఆఫీస్ వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది.‘మీర్జాపూర్ నటీనటులు హైదరాబాద్‌లోని అమెజాన్ కార్యాలయంలోకి అడుగుపెట్టగానే.. ఉద్యోగులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఊహించని విధంగా తమ అభిమాన తారలు కళ్లముందు ప్రత్యక్షం కావడంతో ఆఫీస్ మొత్తం సందడిగా మారిపోయింది. ఒక సాధారణ వార్షిక సమావేశంగా ప్రారంభమైన ఏఐఎం, వీరి రాకతో ఒక పాప్-కల్చర్ దృశ్యం కనిపించింది.ఈ వార్త త్వరగానే సోషల్ మీడియాలో వైరలైంది. ఉద్యోగులు లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ మరియు ఎక్స్లలో ఫోటోలు, వీడియోలు, తెరవెనుక క్లిప్‌లతో నింపేశారు. పని ప్రదేశంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఎలా ఉండాలనే దానిపై పునరాలోచన చేస్తున్న పెద్ద సంస్థల యజమానులలో పెరుగుతున్న ధోరణిని ఈ చర్య ప్రతిబింబిస్తోంది. పోటీతత్వంతో కూడిన ప్రతిభావంతుల మార్కెట్లో, విధేయతను.. సంస్థలో భాగమనే భావనను పెంపొందించడంలో సాధారణ ప్రోత్సాహకాల కంటే ఆశ్చర్యపరిచే, ఆనందపరిచే అనుభవాలను అందించింది. -
‘మిర్జాపూర్ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
సినిమాగా మీర్జాపూర్ సిరీస్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ఓటీటీలో ఆడియన్స్ క్రేజ్ దక్కించుకున్న సూపర్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పుడు ఇగే వెబ్ సిరీస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు తమ ఐకానిక్ రోల్స్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక జితేంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చి 'బబ్లూ పండిట్' పాత్రను పోషించడం కథలో అతిపెద్ద ట్విస్ట్‌గా మారబోతోంది. వీరితో పాటు భోజ్‌పురి స్టార్ రవి కిషన్ ఒక పవర్ఫుల్ రోల్లో మెరవనున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ చూస్తుంటే హిట్ ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా వెబ్ సిరీస్‌లకు ప్రీక్వెల్‌గా సినిమా ఉంటుందని గతంలోనే టీమ్ తెలిపింది. సిరీస్ మూడు పార్ట్‌లలో చనిపోయినవారంతా తెరపై కనిపిస్తారని వెల్లడించింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
సినిమాగా ‘మీర్జాపూర్’.. టీజర్ అదిరింది!
ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమాగా రాబోతుంది. ‘మీర్జాపూర్ ది మూవీ’ పేరుతో సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. సిరీస్‌లకు ప్రీక్వెల్‌గా సినిమా ఉంటుందని గతంలోనే టీమ్ తెలిపింది. సిరీస్ మూడు పార్ట్‌లలో చనిపోయినవారంతా తెరపై కనిపిస్తారని వెల్లడించింది. టీజర్లోనూ వారందరిని చూపించారు. కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు తమ ఐకానిక్ రోల్స్‌తో రీఎంట్రీ ఇచ్చారు. ఇక జితేంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చి 'బబ్లూ పండిట్' పాత్రను పోషించడం కథలో అతిపెద్ద ట్విస్ట్‌గా మారబోతోంది. వీరితో పాటు భోజ్‌పురి స్టార్ రవి కిషన్ ఒక పవర్ఫుల్ రోల్లో మెరవనున్నారు. పూర్వాంచల్ వీధుల నుండి రాజస్తాన్ ఎడారుల వరకు.. ఈసారి మీర్జాపూర్ సామ్రాజ్యం మరింత విస్తరించబోతోంది. రక్తం మరిగే యాక్షన్ సీన్స్, గూస్బంప్స్ డైలాగ్స్‌తో వెండితెర దద్దరిల్లడం ఖాయం అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారుఅమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా, పునీత్ కృష్ణ కథను అందించారు.


