మీర్జాపూర్ సిరీస్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్ని సీజన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా సూపర్ హిట్ అయిన ఈ సిరీస్‌లను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మీర్జాపూర్: ది మూవీ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. ఈ చిత్రం రిలీజైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.78 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ. 68.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లోనే రూ. 56.75 నెట్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు. అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, షీబా చద్దా, రాజేష్ తైలాంగ్, శ్రియా పిల్‌గావ్‌కర్, హర్షిత శేఖర్ గౌర్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ మూవీ సెప్టెంబర్ 4, 2026న సినిమా థియేటర్లలో విడుదలైంది.


