విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెగసీ’. సాయికిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ హీరోయిన్. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబరు 4న ‘లెగసీ’ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం. తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంగా విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది’’ అని చిత్రబృందం ప్రకటించింది.


