ఆ ప్రేక్షకులంతా ఏమైపోయారనిపించింది– కార్తీ  | Karthi Speech At Sardar2 Press Conference | Sakshi
Sakshi News home page

ఆ ప్రేక్షకులంతా ఏమైపోయారనిపించింది– కార్తీ 

Sep 6 2026 3:50 AM | Updated on Sep 6 2026 3:50 AM

Karthi Speech At Sardar2 Press Conference

‘‘స్పై బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే చాలా చిత్రాలు మన దేశం బయట జరిగే ఆపరేషన్స్‌ నేపథ్యంలో ఉంటాయి. కానీ ‘సర్దార్‌ 2’ మన దేశం లోపల మన కోసం గూఢచారులు చేసే సాహసాల నేపథ్యంలో ఉంటుంది’’ అని కార్తీ చెప్పారు. కార్తీ హీరోగా నటించిన సినిమా ‘సర్దార్‌ 2’. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 10న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో కార్తీ చెప్పిన విశేషాలు.

→ ‘సర్దార్‌’లో వాటర్‌ కాన్సెప్ట్‌కి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. మన జీవితాల్లోని ఓ ముఖ్యమైన అంశాన్ని ‘సర్దార్‌ 2’లో ప్రస్తావించాం. ఆ అంశాన్ని తెరపై చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమాలో చాలా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్నాయి. నాకు యాక్షన్‌ అంటే ఇష్టం. డ్యాన్స్‌ అంటే భయం (సరదాగా..). ‘సర్దార్‌ 2’లో తండ్రీకొడుకులు ఓ మిషన్‌ కోసం కలిసి పని చేస్తారు. తండ్రీకొడుకుగా నటించాను. ఇలా ఒకేసారి రెండు పాత్రలు చేయడం సవాల్‌గా అనిపించింది. అలాగే ఓపికతో మేకప్‌ వేసుకోవాల్సి వచ్చేంది.

→ నాగార్జున అన్నయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సర్దార్‌’ చిత్రం తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ ద్వారా రిలీజ్‌ అయింది. ‘సర్దార్‌ 2’ కూడా ఆ సంస్థ ద్వారానే రిలీజ్‌ కావడం హ్యాపీగా ఉంది.

→ ‘సత్యం సుందరం’ సినిమా థియేటర్స్‌లో సరిగ్గా ఆడలేదు. చాలా బాధగా అనిపించింది. కానీ ఓటీటీలో మంచి స్పందన లభించింది. అయితే ఒకప్పుడు ‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’ వంటి చిత్రాలను ప్రేక్షకులు బ్లాక్‌ బస్టర్స్‌ చేశారు. ఆ ప్రేక్షకులంతా ఇప్పుడు ఏమైపోయారని నాకు బాధగా అనిపించింది. 

→ తమిళనాడులో రాజకీయాల పరంగా జనరేషనల్‌ షిఫ్ట్‌ జరిగిందని అనుకుంటున్నాను. నేటి తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా యాక్టర్స్‌గా మేం మారుతున్నాం. అలానే పొలిటీషియన్స్‌ నెక్ట్స్‌ జనరేషన్‌కు అడాప్ట్‌ అవ్వాలి. ఇక సినిమాలు వద్దని విజయ్‌గారు నిర్ణయించుకుని, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వెళ్లారు. అలాంటి అంకితభావంతో ఎవరు వచ్చినా వారికి ప్రత్యేకమైన జర్నీ ఉంటుంది. అయితే మా అన్నయ్య (హీరో సూర్య) చెప్తుంది ఏంటంటే... ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయాలు మాత్రమే మార్గం కాదు. మా అగరం ఫౌండేషన్‌ నుంచి దాదాపు 8 వేలమంది స్టూడెంట్స్‌ చదువుకుంటున్నారు.  

→ తెలుగులో కళ్యాణ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాను. ‘హిట్‌ 4’కి చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ‘మార్షల్‌’ సినిమా చేస్తున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement