ఇలాంటి సినిమా చేయడం సాధ్యమా అని ఆశ్చర్యపోయా | Suriya Speech Karthi Sardar 2 Movie Audio Launch | Sakshi
Sakshi News home page

Suriya Karthi: సర్దార్‌ 2 అలాంటి సినిమానే: కార్తీ

Sep 2 2026 9:55 AM | Updated on Sep 2 2026 10:33 AM

Suriya Speech Karthi Sardar 2 Movie Audio Launch

కార్తీ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'సర్దార్‌ 2'. 2022లో తొలి భాగం విడుదలై హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ తీశారు. ఈసారి మాళవిక మోహన్, ఆషిక రంగనాథన్ తదితర హీరోయిన్లు కొత్తగా నటించారు. రజిషా విజయన్‌ మరోసారి కార్తీతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎస్‌జే సూర్య విలన్. వచ్చే శుక్రవారం పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సోమవారం చెన్నైలో ఆడియో లాంచ్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'పళ్లబురుసు')

ఈ చిత్ర టీజర్‌ చూసి ఇలా తమిళంలో చేయడం సాధ్యమా? అరే ఇది మిత్రన్‌ సినిమానా? అని ఆశ్చర్యపోయాను. అందరూ కార్తీని సర్ధార్‌ అని పిలుస్తున్నారు. కార్తీ నాకంటే మంచి మూవీస్ చేస్తున్నాడు. దాన్ని నేను ఆస్వాదిస్తూ , ఆశ్చర్యంగాను, సంతోషంగానూ చూస్తున్నాను. మరో విషయం ఏంటంటే నేను చెన్నైలోనే ఉంటున్నాను. అప్పడప్పుడు ముంబైకి వెళ్లి వస్తున్నాను అని సూర్య తాను గురించి జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చాడు.

నటుడు కార్తీ మాట్లాడుతూ .. నేను విదేశాల్లో చదువుకున్నాను. అక్కడ కూడా మన చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాను కొందరు ఎగతాళి చేస్తారు. కొందరు అభినందిస్తారు. వారు అభినందించే విధంగా మూవీస్ చేయాలని నేను భావిస్తాను. సర్ధార్‌ 2 చిత్రం అలాంటిదే అని అన్నాడు.

(ఇదీ చదవండి: ఐటమ్‌ సాంగ్‌లో ట్రెండింగ్ హీరోయిన్ కాయదు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement