బూతు సినిమాలకు లేని ఇబ్బంది ఈ సినిమాలకు ఎందుకు? | Directors Speech In Sri Vishnu Comrade Kalyan Movie Teaser Event | Sakshi
Sakshi News home page

బూతు సినిమాలకు లేని ఇబ్బంది ఈ సినిమాలకు ఎందుకు?

Sep 5 2026 8:32 PM | Updated on Sep 5 2026 9:07 PM

Directors Speech In Sri Vishnu Comrade Kalyan Movie Teaser Event

జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా వచ్చిన ప్రముఖ దర్శకులు  వీఎన్‌ ఆదిత్య, ఆర్. నారాయణమూర్తి సెన్సర్‌ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎక్కువ మంది చదివింది: పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్‌ గెస్ట్‌లుగా వచ్చారు: అల్లరి నరేశ్‌
సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు
‘సెన్సార్‌ విషయంలో సినిమాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఓటీటీలలో ఎలాంటి సెన్సార్‌ లేకుండానే కంటెంట్‌ వస్తోంది. మరి తెరపై వచ్చే సినిమాలకు సెన్సార్‌ ఆంక్షలు ఎందుకు?. సినిమాల విషయంలో రాజకీయాలు మానుకోవాలి. ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు పెద్దలు కఠినమైన ఆంక్షలు పెట్టకుండా సినిమా వాళ్ల కష్టాలు కూడా అర్థం చేసుకోవాలి. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్‌ అయ్యారు. కానీ ఏ రాజకీయ నేత సినిమాల్లోకి వచ్చి సూపర్‌స్టార్‌ కాలేదు. ప్రతి తెలుగు సినిమా సెన్సార్‌ ఇబ్బందుల్లో పడుతోంది’ అని దర్శకుడు వీఎన్‌ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
షాక్‌ అయ్యా
‘కామ్రేడ్‌ అనే పదం సెన్సార్‌ వాళ్లు వద్దంటే షాక్‌ అయ్యా. అసలు ఈ పదం అర్థం తెలుసా ఎవరికైనా? కా​మ్రేడ్‌ అంటే ఒక 
అ‍మ్మ. ఒకే భావజాలంతో ఒకే లక్ష్యంతో.. ఓకే జీవనశైలితో ప్రజల కోసం వారి జీవితాలను వదిలేస్తారో వాళ్లే కామ్రేడ్స్‌. కామ్రేడ్‌ అని పిలుచుకోవడం మన అదృష్టం. అందువల్ల ఈ పదంపై సెన్సార్‌ వాళ్లు ఇబ్బందులు పెట్టవద్దు. కొన్ని సినిమాల్లో బూతులు ఉన్నా వదిలేస్తున్నారు. మరికొన్ని సినిమాలు మంచిగా ఉన్నా ఇబ్బందులు పెడుతున్నారు’ అని ఆర్‌. నారాయణమూర్తి అన్నారు.  

ఇదీ చదవండి: తగ్గని ‘ఇరుముడి’ ఫీవర్‌.. ట్రాక్టర్లతో పోటెత్తిన ప్రేక్షకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement