బిగ్‌బాస్‌ 10: అగ్ని పరీక్ష నుంచి ఆరుగురు.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లే! | Bigg Boss 10 Telugu Contestants Full List Viral on Social Media | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 10: ఝాన్సీ కన్ఫామ్‌.. ఈ సారి హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా?

Sep 5 2026 5:03 PM | Updated on Sep 5 2026 5:17 PM

Bigg Boss 10 Telugu Contestants Full List Viral on Social Media

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్‌ 10) గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.ఈ సారి దాదాపు 20 మంది వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సీజన్‌లో సామాన్యుల కోటా నుంచి కూడా భారీగానే వెళ్లనున్నారు. దీని కోసం ఇప్పటికే ‘అగ్ని పరీక్ష’ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో నుంచి ఐదు లేదా ఆరుగురిని హౌస్‌లోకి పంపనున్నారు. అయితే ఆ జాబితాలో ఎవరెవరకు ఉంటారా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే రైతు బిడ్డ ఝాన్సీ కన్ఫామ్‌ అయింది.

తాజాగా అగ్నిపరీక్ష గ్రాండ్ ఫినాలేలో మేకర్స్ 'టికెట్ టు బిగ్‌బాస్' ప్రకటించారు. ఈ టికెట్ గెలిచిన వారికి నేరుగా బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. ఈ పోటీలో ఝాన్సీ విజయం సాధించింది. దీంతో బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే తొలి కంటెస్టెంట్‌గా ఝాన్సీ నిలిచింది. దీంతో సెప్టెంబర్ 6న జరగనున్న బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో ఝాన్సీ హౌస్‌లోకి అడుగుపెట్టనుంది. మిగిలిన వారిలో ఇప్పటికే తనదైన ఆటతీరుతో మూడు గ్రీన్స్‌ సాధించిన మిథిలేష్‌ని కూడా హౌస్‌లోకి పంపనున్నారు. వీరితో పాటు చరణ్‌, రాజకుమారి, రోహిత్‌, అమన్‌ కచ్చితంగా బిగ్‌బాస్‌ 10లో పాల్గోనే అవకాశం ఉంది. ఆరుగురి కంటే ఎక్కువ పంపిస్తే..శ్రష్టి, షాలినీ వంటి వారు కూడా ఈ సీజన్‌లో పాల్గోనే అవకాశం ఉంది. అగ్ని పరీక్ష నుంచి హౌస్‌లోకి వెళ్లేది ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

కంటెస్టెంట్స్‌ వీళ్లే..  
ఇక సెలెబ్రెటీ కోటాలో ఈ సారి పది మంది వరకు హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. వారిలో జబర్దస్త్‌ కమెడియన్స్‌ ఆటో రాంప్రసాద్‌, నరేశ్‌, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్‌ ఫేమ్‌ దేబ్జానీ మోదక్,  'గుప్పెడంత మనసు' సీరియల్‌ ఫేం ముఖేష్‌ గౌడ, యాంకర్‌ వర్షిణి,  ముఖేష్‌,  చైత్ర రాయ్‌, నటులు టెంపర్‌ వంశీ, కృష్ణుడు, ఎక్స్‌ప్రెస్‌ హరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో నుంచి ఎవరు  హౌస్‌లోకి వెళ్లేది ఎవరనేది దానిపై రేపు(సెప్టెంబర్‌ 6) స్పష్టత రానుంది. సీజన్‌ 10కి కూడా కింగ్‌ నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement