నవ్వులు పూయిస్తున్న శ్రీవిష్ణు ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ | Sri Vishnu Comrade Kalyan Movie Official Teaser Released | Sakshi
Sakshi News home page

నవ్వులు పూయిస్తున్న శ్రీవిష్ణు ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌

Sep 5 2026 6:59 PM | Updated on Sep 5 2026 7:30 PM

Sri Vishnu Comrade Kalyan Movie Official Teaser Released

జానకిరాం మారెల్ల దర్శకకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు టీజర్‌ విడుదలైంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే స్పష్టమవుతోంది.

సీరియస్‌గా సాగే నక్సలైట్ నేపథ్యంలోనూ శ్రీవిష్ణు తనదైన శైలిలో నవ్విస్తూ, పూర్తి వినోదాత్మకంగా ఈ టీజర్ ఉంది. రాష్ట్ర హోంమంత్రిని ఎత్తుకెళ్లే సన్నివేశం హైలైట్‌గా కనిపిస్తోంది.  రాధిక శరత్‌కుమార్, ఉపేంద్ర లమాయే, షైన్ టామ్ చాకో, మహిమా నంబియార్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement