జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. టీజర్ రిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
‘జానకీరామ్.. కంగారు పడి ఏవో వాగ్దానాలు చేయకు . సినిమా హిట్ అవ్వకపోతే అమీర్‌పేట్ సెంటర్లో బట్టలిప్పుతా.. లాంటి డైలాగ్‌లు చెప్పకు. కథలో బలం ఉన్నప్పుడు ప్రేక్షకులే ఆదరిస్తారు’ అని చెప్పి నవ్వులు పూయించారు. కాగా కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది మన అందరి కథ అంటూ..
కాగా హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘ప్రొడక్షన్ నెం 39‘ ( వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది మన అందరి కథ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆ గ్లింప్స్ చూస్తుంటే ఓ సగటు యువకుడి కథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు, ఉద్యోగం, పెళ్లి కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సూర్యదేవర హారిక నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందు, రవి సంగీతమందించనున్నారు.
ఇదీ చదవండి: కీర్తి సురేశ్, నాని డ్యాన్స్ వైరల్.. ఈసారి క్రాస్ ఓవర్ వీడియో
సినిమా హిట్టయితే అమీర్ పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా… వద్దు
ఖంగారు పడి వాగ్దానాలు చేయకు.
- @sreevishnuoffl to his director Janaki pic.twitter.com/yCzVFzBvOV— Rajesh Manne (@rajeshmanne1) September 5, 2026


