కార్తీ యాక్షన్‌ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది | Karthi Sardar 2 Official Telugu Trailer | Sakshi
Sakshi News home page

Sardar 2 Official Telugu Trailer: కార్తీ సర్దార్-2.. యాక్షన్‌ ట్రైలర్ చూశారా?

Aug 31 2026 9:11 PM | Updated on Aug 31 2026 9:11 PM

Karthi Sardar 2 Official Telugu Trailer

కోలీవుడ్ హీరో కార్తి నటించిన సీక్వెల్ సర్దార్-2. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన సర్దార్‌కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.  తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి ట్రైలర్ విడుదల చేశారు. 

ఈ ట్రైలర్ చూస్తుంటే ఓ మిషన్ చుట్టూ కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ ట్రైలర్‌లో ఫుల్ యాక్షన్‌ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. విలన్‌గా ఎస్‌జే సూర్య కనిపించడం ఈ చిత్రానికి మరింత ప్లస్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం.. సెప్టెంబర్‌ 10న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ మూవీలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతమందించారు. 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement