అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టేనా? | Rumors That Anushka Shetty saying goodbye to films | Sakshi
Sakshi News home page

అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Sep 5 2026 11:21 PM | Updated on Sep 6 2026 12:02 AM

Rumors That Anushka Shetty saying goodbye to films

దశాబ్దానికి పైగా టాలీవుడ్‌లో తన నటన, సౌందర్యంతో లేడీ సూపర్ స్టార్‌గా ఏకచక్రాధిపత్యం వహించింది నటి అనుష్క శెట్టి. ఆమె కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉండటం అనుష్క అభిమానుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. 'బాహుబలి'తో అనుష్క పాన్‌ ఇండియా స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది. 

అనుష్క శెట్టి సినిమాలకు దూరమవుతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె చివరి చిత్రం ఘాటీ విడుదలై ఇప్పటికే 365 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మరో తెలుగు సినిమాను అనుష్క ప్రకటించలేదు. క్రేజ్ ఉన్నప్పటికీ వరుస సినిమాలు చేయకుండా.. నచ్చిన కథ, పాత్ర కోసం మాత్రమే ఎదురుచూడటం అనుష్క స్టైల్. అయితే ఇంత సుదీర్ఘ గ్యాప్ రావడంతో ఆమె ఇక సినిమాలు చేయరనే ప్రచారం మొదలైంది. అయితే అనుష్కపై ఇలాంటి ఊహాగానాలు ఇప్పటివి కావు. కొన్నేళ్లుగా ఆమె వ్యక్తిగత జీవితంపై, సినిమాలపై రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌తో లింక్ చేస్తూ అప్పట్లో ఆమెపై వచ్చిన కథనాలకు కొదవ లేదు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు, ఆమె సినిమాలకు దూరమైందనే ప్రచారం కూడా నడిచింది.

అయితే దీనిపై అనుష్క నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఆమె నిజంగానే సినిమాలకు గుడ్‌బై చెప్పారా? లేక మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో సర్‌ప్రైజ్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఓ హీరో ఏడాది గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు. అదే హీరోయిన్ తీసుకుంటే అంతే సంగతులు. కానీ అనుష్క లాంటి నటిని ఇలాంటి గ్యాప్స్ ఏం చేయలేవు. మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో వచ్చి మరో సూపర్‌ హిట్‌ కొడితే ఈ రూమర్స్‌ అన్నీ రూమర్స్‌గానే మిగిలిపోతాయి. అయితే ఇండస్ట్రీలో చాలామంది మాత్రం ఇక ఆమె సినిమాలు చేయదనే టాక్‌ నడుస్తోంది. దీనిపై అనుష్క టీమ్‌ నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement