Anushka Shetty
-
ఈ ఏడాది ఒక్క సినిమా చేయని హీరోయిన్లు వీళ్లే (ఫొటోలు)
-
అనుష్క 'ఘాటి' ఊచకోత.. రిలీజ్‌పై క్రిష్ ప్రకటన
టాలీవుడ్ క్వీన్ హీరోయిన్ అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఘాటి’. ఇప్పటికే షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అయితే, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు.'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తర్వాత అనుష్క నటిస్తున్న ఈ 'ఘాటి' చిత్రానికి చింతకింది శ్రీనివాస్‌రావు, క్రిష్, బుర్రా సాయిమాధవ్ రచన చేశారు. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతీకారం ప్రధానంగా సాగుతుంది. ఏప్రిల్ 18న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. -
హీరోలకు తక్కువేం కాదు.. ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తున్న హీరోయిన్లు
వెండితెరపై వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తుంటారు హీరోయిన్లు. కొన్ని చిత్రాల్లో ఫెరోషియస్ రోల్స్ చేస్తుంటారు. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ట్రైనింగ్ తీసుకుని మరీ ఫైట్స్ చేస్తుంటారు. హీరోలా సినిమాని నడిపించేలా హీరోషియస్ రోల్స్ చేస్తున్న కొంతమంది హీరోయిన్స్‌పై కథనం.ప్రతీకారంపవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేసే అగ్రశ్రేణి హీరోయిన్స్ జాబితాలో అనుష్కా శెట్టి ముందు వరసలో ఉంటారు. ‘అరుంధతి, భాగమతి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో అనుష్క చేసిన నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ అంత సులభంగా మర్చిలేరు. కొంత గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ పవర్ఫుల్ రోల్‌నే ‘ఘాటి’ చిత్రంలో చేస్తున్నారు అనుష్క. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల ‘ఘాటి’ సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోలో ఓ మనిషి తలను అతి క్రూరంగా కొడవలితో నరికిన మహిళగా అనుష్క కనిపించారు. ఈ విజువల్స్ ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టం చేశాయి. ‘షూటి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే విడుదల తేదీపై స్పష్టత రానుంది.ఇక వ్యాపారంలో అత్యుత్తమంగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు దారుణంగా మోసం చేస్తారు. ఈ మోసంతో ఆ మహిళ మనసు విరిగిపోయి, కఠినంగా మారుతుంది. తనను మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే గెలవాలనుకుంటుంది. ఆ మహిళ ఎలా గెలిచింది? అన్నదే ‘ఘాటి’ కథ అని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.శివశక్తిదాదాపు ఇరవైఏళ్ల సినీ కెరీర్లో హీరోయిన్ తమన్నా డిఫరెంట్ రోల్స్ చేశారు. వీటిలో కొన్ని యాక్షన్ తరహా చిత్రాలూ ఉన్నాయి. అయితే ఈసారి కొంచెం కొత్తగా యాక్షన్‌తో కూడిన ఆధ్యాత్మిక పాత్ర నాగసాధువు శివశక్తిగా కనిపించనున్నారు తమన్నా. దర్శకుడు సంపత్ నంది కథతో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ సినిమాలోనే నాగసాధువు శివశక్తిగా తమన్నా కనిపిస్తారు.మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకాలపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, యువ, నాగమహేశ్ వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల మల్లన్న ఆలయం, ఆ గ్రామంలో జరిగే కొన్ని ఊహాతీత ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.కూతురి కోసం...ఓ రాక్షసుడి నుంచి తన చిన్నారి కుమార్తెను కాపాడుకోవడానికి ఓ తల్లి రాక్షసిగా మారింది. ఈ రాక్షసుడిపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆ తల్లి ఎలా పోరాడింది? అనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘రాక్కాయి’. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ఇది. ఇందులో కూతురి రక్షణ కోసం ఎంతకైనా తెగించే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. సెంథిల్ నల్లసామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో బరిసె పట్టుకుని, ఆ బరిసెకు కొడవలి బిగించి, మరో చేతిలో మరో కొడవలిని పట్టుకుని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న నయనతార విజువల్స్ ‘రాక్కాయి’ టైటిల్ గ్లింప్స్‌లో కనిపించాయి. ఇప్పటివరకు ‘డోరా, ఐరా, నెట్రిక్కన్’ వంటి హారర్ ఫిల్మ్స్, ‘కర్తవ్యం’ వంటి సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనే నయనతార ఎక్కువగా నటించారు. తొలిసారిగా ఆమె ‘రాక్కాయి’ వంటి పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.వంట గదిలో తుపాకీకిచెన్లో గరిటె పట్టుకునే గృహిణిగానే కాదు... అవసరమైతే అదే చేత్తో తుపాకీ కూడా పట్టుకోగలదు. ఇంతకీ ఆ గృహిణి పూర్తి కథ ఏంటో తెలుసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేంతవరకూ వేచి ఉండాలి. ఇందులో సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘ట్రా లా లా’ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను సమంతనే నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది సమంత బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్రకటించారు.అయితే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, షూటింగ్ అప్డేట్స్ వంటి విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, షూట్ మొదలైందని సమాచారం. ఇక ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌లో సమంత ఓ యాక్షన్ రోల్ చేసి, బుల్లితెరపై సూపర్‌హిట్ అయ్యారు. ఇప్పుడు వెండితెరపైనా ఈ రిజల్ట్‌ను రిపీట్ చేయాలనుకుని యాక్షన్ బేస్డ్ మూవీ ‘మా ఇంటి బంగారం’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.హ్యాండ్ బాగ్‌లో బాంబుఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో ఏముంటాయి? మేకప్ కిట్, మొబైల్ ఫోన్... వగైరా వస్తువులు ఉండటం కామన్. కానీ ఓ అమ్మాయి హ్యాండ్‌బ్యాగ్‌లో మాత్రం రక్తంతో తడిసిన కత్తి, ఓ తుపాకీ, బాంబు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరు అంటే రివాల్వర్ రీటా. వెండితెరపై రివాల్వర్ రీటాగా చేస్తున్నారు కీర్తీ సురేష్. పవర్ఫుల్ ఉమన్ రోల్స్ చేయడంలో సిద్ధహస్తురాలైన హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తీ సురేష్ ‘రివాల్వర్ రీటా’లో మరోసారి నటిగా తానేంటో చూపించనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు కె. చంద్రు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.గాంధారి గతంకిడ్నాప్కు గురైన తన కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి చేసే సాహసాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ చిత్రంలో తల్లి పాత్రలో తాప్సీ నటిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను ఆమె డూప్ లేకుండా చేశారు. దేవాశిశ్ మఖీజా దర్శకత్వంలో ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ఓ తల్లి గతం వల్ల ఆమె కూతురు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆ తల్లి ఏం చేసింది? అనే అంశాలతో ‘గాంధారి’ చిత్రకథ ఉంటుందని సమాచారం.ఇలా యాక్షన్ రోల్స్ చేసే హీరోయిన్స్ మరికొంతమంది ఉన్నారు. : ముసిమి శివాంజనేయులు -
అనుష్క పెళ్లిపై రూమర్స్.. తొలిసారి స్పందించిన స్వీటి
నాలుగు పదుల వయసు దాటినా సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోని హీరోయిన్ల శాతం చాలానే ఉంది. అలాంటి వారిలో త్రిష, అనుష్క పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. దీంతో సోషల్‌మీడియాలో వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున పలు కథనాలు వస్తూనే ఉంటాయి. పెళ్లి వార్తలపై అనుష్క తాజాగా స్పందించారు. తెలుగులో కథానాయకిగా రంగప్రవేశం చేసిన బెంగళూరు బ్యూటీ ఈమె. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలతో జతకట్టి పాపులర్ అయ్యారు. లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారారు. అలాంటిది సడన్‌గా సైజ్ జీరో చిత్రంలోని పాత్ర కోసం బరువు పెరిగి ఆ తరువాత బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక కెరీర్ గాడి తప్పింది. చిన్న గ్యాప్ తరువాత తాజాగా ఘాడీ అనే వైవిధ్యభరిత కథా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తొలిసారిగా ఒక మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇకపోతే వ్యక్తిగతంగా అనుష్క చాలా వదంతులను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా పెళ్లి విషయంలో పలు అసత్య ప్రచారానికి గురవుతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరితో ప్రేమను అంటగట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తాజాగా ఓ దుబామ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవడానికి అనుష్క సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆపై ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్‌తో ఆమె పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. వీటిలో ఏ ఒక్క విషయాన్ని ఆమె ధ్రువపరచలేదన్నది గమనార్హం. ఈ వదంతులపై స్పందించిన అనుష్క తనకు పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంతో తాను ఎప్పుడూ బాధపడిందిలేదన్నారు. అయినా పెళ్లి పెళ్లి అంటున్న వారు.. ఎక్కడ, ఎవరితో జరిగిందో చెప్పడం లేదన్నారు. వివాహ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదన్నారు. అది నేరం కాదని.. భావోద్వేగంతో కూడిన విషయం అని, ఇకనైనా అసత్య ప్రచా రం చేయొద్దని అన్నారు. ఆ టైం వస్తే అందరికీ తెలియజేస్తానని అనుష్క పేర్కొన్నారు. -
అనుష్క బర్త్ డే.. ఆ తప్పు చేయకపోయింటే ఈ పాటికి ఎక్కడో! (ఫొటోలు)
-
కొత్త సినిమాతో అనుష్క.. భయపెట్టేలా ఫస్ట్ లుక్
'బాహుబలి' తర్వాత అనుష్క సినిమాలు చేయడంలో పూర్తిగా నెమ్మదించింది. ఒకటి అరా మూవీస్ చేస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబరులో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఏమైపోయిందో, ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఈమె పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ డీటైల్స్ బయటకొచ్చాయి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)'హరిహర వీరమల్లు' లేట్ అవుతూ వచ్చేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన డైరెక్టర్ క్రిష్.. అనుష్కని లీడ్ రోల్‌గా పెట్టి సినిమా తీస్తున్నాడు. దీనికే ఇప్పుడు 'ఘాటీ' టైటిల్ నిర్ణయించారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాధితురాలే క్రిమినల్ అయితే? అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.తల, చేతికి రక్తంతో చుట్ట తాగుతూ.. భయపెట్టేలా అనుష్క ఫస్ట్ లుక్ ఉంది. సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఇది పాన్ ఇండియా మూవీనే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దీన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో థియేట్రికల్ రిలీజ్ ఉండొచ్చేమో?(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
బెల్లంకొండ 'భైరవం'.. శివరాత్రికి 'తమ్ముడు'
*'ఛత్రపతి' రీమేక్ ఫలితం దెబ్బకు సైలెంట్ అయిపోయిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కొత్త సినిమాని రెడీ చేశాడు. 'భైరవం' టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన 'గరుడన్' చిత్రానికి ఇది రీమేక్ అని తెలుస్తోంది. మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడు. వచ్చే నెలలో అంటే డిసెంబరు 3వ వారంలో రిలీజ్ ఉండొచ్చని టాక్.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)*ప్రస్తుతం 'రాబిన్ హుడ్' చేస్తున్న నితిన్.. డిసెంబరు 20న ఈ సినిమాతో థియేటర్లలోకి రానున్నాడు. మరోవైపు 'వకీల్ సాబ్' తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' చేస్తున్నాడు. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ కథతో తీస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.*అనుష్క శెట్టి ప్రస్తుతం 'ఘాటి' అనే సినిమా చేస్తోంది. క్రిష్ దర్శకుడు. చాలా వరకు షూటింగ్ పూర్తి కాగా.. ఈనెల 7న అంటే గురువారం చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుందని ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
అనుష్కపై మళ్లీ అవే రూమర్స్
ఇప్పటి వరకు తెలుగు, తమిళం భాషలకే పరిమితం అయిన అనుష్క తాజాగా మాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. అరుంధతి చిత్రంతో తన నటనా ప్రతిభను ప్రదర్శించిన ఈమె రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాలతో తనకు తానే చాటి అని చాటారు. అలాంటి అనుష్క నట జీవితం 'సైజ్ జీరో' చిత్రంతో ఒక్కసారిగా మారిపోయింది. ఆ చిత్రంలోని పాత్ర కోసం భారీగా బరువు పెంచిన అనుష్క ఆ తరువాత ఆ బరువును తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ ఆ తరువాత 'సైలెన్స్' అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరచింది. ఇటీవల 'మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి' చిత్రంలో నటించి సక్సెస్‌ను అందుకున్నారు. కాగా ప్రస్తుతం మలయాళంలో 'కాత్తనార్' అనే చిత్రం చేస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి మలయాళ చిత్రం కావడం గమనార్హం. అదే విధంగా 'భాగమతి' చిత్రానికి సీక్వెల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క పెళ్లికి సిద్ధం అవుతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు వీరి పెళ్లి పనుల్లో కుటుంబ సభ్యులు మునిగి తేలుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇంతకు ముందు కూడా అనుష్క పెళ్లిపై పలుమార్లు ప్రచారం జరిగింది. అదేదీ నిజం కాలేదు. ఆమె కూడా ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు. మరి తాజాగా జరుగుతున్న పెళ్లి ప్రచారంౖలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. -
భాగమతి 2.. దర్శకుడు కీలక వ్యాఖ్యలు
అందంతో, అభినయంతో అందరినీ అబ్బురపరిచే బ్యూటీ అనుష్క శెట్టి. అరుంధతి సినిమాతో స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం లిఖించుకున్న ఈమె దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో భాగమతి సినిమా 2016లో వచ్చింది. ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందని కొన్నేళ్లుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి తప్ప ఏదీ కార్యరూపం దాల్చలేదు.భాగమతి సీక్వెల్..ఇన్నాళ్లకు భాగమతి సీక్వెల్‌పై దర్శకుడు అశోక్ స్పందించాడు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. భాగమతి సీక్వెల్లో అనుష్క మరింత పవర్ఫుల్ రోల్లో కనిపించనుందని చెప్పాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నాడు. 2025లో సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్తుందన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమా నిర్మిస్తుందని తెలిపాడు. ఈ విషయం తెలిసి స్వీటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.చేతిలో రెండు చిత్రాలుగతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో అలరించిన అనుష్క ప్రస్తుతం ఘాటి సినిమా చేస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. అలాగే మలయాళంలో తొలిసారిగా కథనార్- ద వైల్డ్ సోర్సరర్ అనే చిత్రంలో నటిస్తోంది.చదవండి: జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నా, కోలుకోవడానికి.. -
తమన్‌కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క
సినిమా హిట్ అయితే డైరెక్టర్, హీరోకి నిర్మాత కారు లేదా విలువైన వస్తువులు గిఫ్ట్ ఇవ్వడం కామన్. కానీ ఓ హీరోయిన్ ప్రతి ఏడాది మ్యూజిక్ డైరెక్టర్‌కి బహుమతి ఇవ్వడం అంటే స్పెషలే కదా! స్వీటీ అనుష్క శెట్టి ఇలానే ప్రతి ఏటా మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి గిఫ్ట్ ఇస్తోంది. తాజాగా ఈ విషయాన్ని తమన్ బయటపెట్టాడు.'రాజా సాబ్', 'గేమ్ ఛేంజర్' లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండే తమన్.. 'తెలుగు ఇండియన్ ఐడల్' పాటల పోటీకి జడ్జిగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో మాట్లాడుతూ అనుష్కని తెగ పొగిడేశాడు. తనకు 'భాగమతి' షూటింగ్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ప్రతి ఏడాది ఓ ఐఫోన్ బహుమతిగా ఇస్తుందని చెప్పాడు.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)'అనుష్క హీరోయిన్ అని కాదు గానీ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆమె మనసు బంగారం, అందం గురించి పక్కనబెడితే ఎంతో మంచి వ్యక్తి. ఇన్సైడ్ బ్యూటిఫుల్. నాకు ఇచ్చిన మాట ప్రకారం అనుష్క నుంచి ప్రతి సెప్టెంబరులో నాకు ఓ ఐఫోన్ గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అదే. 'భాగమతి' షూటింగ్ టైంలో నాకు ఐఫోన్ అంటే ఇష్టమని అనుష్కతో చెప్పాను. మూవీ హిట్ అయితే ఇవ్వాలని అన్నాను. అలా ఐఫోన్ నాకు గిఫ్ట్‌గా వస్తుంటుంది. యూవీ ఆఫీస్ నుంచి అనుష్క ద్వారా నా దగ్గరకు ఐఫోన్ వస్తుంది. అలానే అనుష్క అంటే నాకు ఇష్టం. తనే నా జీవితం. నేను ఇంతవరకు చూసిన బెస్ట్ హ్యుమన్ అనుష్క' అని తమన్ చెప్పుకొచ్చాడు.చివరగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో కనిపించిన అనుష్క.. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. మరోవైపు తమన్ చెప్పినట్లు 'భాగమతి 2' కోసం రెడీ అవుతోంది. ఇందుకోసం ఫిట్‌గా మారే పనిలో ఉంది. అందుకే బయట కనిపించట్లేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే అప్పుడెప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వడం విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)#AnushkaShetty is My Life, She is Gold, Very Lovely Human.We are Working on #Bhaagamathie 2 🔥She is Fantastic Character, Beauty is Inside. She is Most Sweetest. Every Year September, I Get an IPhone from Her as She Promised.- @MusicThaman 😍❤️🔥 pic.twitter.com/GhK73j2Z2I— Sweety Cults ❤️ (@AnushkaCults) September 15, 2024 -
అనుష్క ఆ పోస్ట్ ప్రభాస్ కోసమేనా..?
-
స్వీటీ అనుష్క ఇప్పుడా ఫొటో ఎందుకు పోస్ట్ చేసినట్లు?
స్వీటీ అనుష్క సినిమా వచ్చి దాదాపు ఏడాది దాటిపోయింది. ప్రస్తుతానికి ఏదో మలయాళ సినిమా చేస్తోంది! ఈ విషయం తప్పితే బయటకు కూడా అస్సలు కనిపించడం లేదు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఈమె వార్తల్లో నిలిచింది. అసలు సంబంధం లేని టైంలో, అది కూడా 'బాహుబలి' మూవీలో తన పిక్‌ని ఇన్ స్టాలో ఎందుకు పోస్ట్ చేసిందా అని తెగ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి)'సైజ్ జీరో' మూవీ వల్ల అనుష్క అనుహ్యంగా బరువు పెరిగిపోయింది. దీని వల్ల సినిమాలు తగ్గించేసింది. బయట కనిపించడం మానేసింది. ఇక సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు పోస్ట్ చేసి చాలా కాలమే అయిపోయింది. తాజాగా సోమవారం సాయంత్రం 'బాహుబలి'లోని తన స్టిల్‌ని పోస్ట్ చేసింది. సరిగ్గా అదే టైంలో ప్రభాస్ 'రాజా సాబ్' గ్లింప్స్ రిలీజైంది. దీంతో చర్చ మొదలైంది.అనుష్క ఫొటో పోస్ట్, ప్రభాస్ 'రాజాసాబ్' గ్లింప్స్ రిలీజ్ కావడం అనుకోకుండా జరిగిందా? అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అవుననే అంటున్నారు. గ్లింప్స్ చూసిన తర్వాత ఈ ఫొటో పోస్ట్ చేసిందని, కావాలంటే ఇద్దరు మ్యాచింగ్ డ్రస్సుల్లోనే ఉన్నారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో పెద్ద కాంట్రవర్సీ ఏం లేనప్పటికీ.. ఇలా మరోసారి ప్రభాస్-అనుష్క గురించి అభిమానులు మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) -
రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?
స్వీటీ అనే పేరు చెప్పగానే అందరికీ అనుష్క శెట్టినే గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి తెలుగులో మూవీస్ చేస్తోంది. 'బాహుబలి'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తోంది. అలాంటిది ఈమెకు కొన్నాళ్ల క్రితం ఏకంగా రూ.5 కోట్ల ఆఫర్ వచ్చిందట. కానీ దాన్ని స్వీటీ రిజెక్ట్ చేసిందట. ఇంతకీ దీని సంగతేంటి?కన్నడ బ్యూటీ అనుష్క.. నాగార్జున 'సూపర్' సినిమాతో నటిగా మారింది. కెరీర్ ప్రారంభంలో స్పెషల్ సాంగ్స్ చేసింది. కానీ ఆ తర్వాత హీరోయిన్గా చిన్నా పెద్దా హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 'బాహుబలి' ఈమెకి ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. కానీ 'సైజ్ జీరో' మూవీ ఎప్పుడైతే చేసిందో ఈమెకు అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం బరువు పెరిగింది కానీ తగ్గలేకపోయింది. దీంతో పూర్తిగా బయట కనిపించడమే మానేసింది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)గత కొన్నాళ్ల నుంచి మహిళా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ వస్తున్న అనుష్క.. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో తలో మూవీ చేస్తోంది. ఇవి రెండు కూడా కాస్త డిఫరెంట్ మూవీస్. అయితే కొన్నాళ్ల క్రితం తెలుగు స్టార్ సినిమాలో ఆఫర్ ఈమె దగ్గరకు వచ్చిందట. రూ.5 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇస్తామన్నారట. కానీ అనుష్క నో చెప్పేసిందట.ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్లే అనుష్క నో చెప్పిందని అంటున్నారు. దీనిబట్టి చూస్తే అనుష్క ఎన్నాళ్లు నటిస్తుందో తెలియదు గానీ ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం పాత్ర ప్రాధాన్యమున్న మూవీసే చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అనుష్క.. కోట్లు విలువ చేసే ఆఫర్ వదులుకుందనే న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'నింద' సినిమా రివ్యూ) -
అనుష్కకు వింత వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అనుష్క శెట్టి. 2005లో ‘సూపర్’ చిత్రంలో టాలీవుడ్‌కి పరిచమైన ఈ మలయాళ భామ..తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేస్తూ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక అరుంధతి చిత్రం ఆమె సినీ జీవితాన్నే మార్చేసింది. (చదవండి: రజనీకాంత్ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్)ఆ తర్వాత వరుసగా ఫీమేల్ ఓరియెంటెండ్ మూవీస్ చేసి హిట్టుకొట్టింది.బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఈ భామ చేసిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మరో లేడి ఓరియెంటెండ్ మూవీ చేస్తోంది. (చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్)ఇదిలా ఉంటే అనుష్క ఆరోగ్యంపై ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనుష్క ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఆమె నవ్వడం ప్రారంభిస్తే..చాలా సేపటివరకు ఆపలేదట. ఎవరైనా జోక్ చేస్తే పగలబడి నవ్వేస్తుందట. చిన్న చిన్న సరదా విషయాలకు కూడా బాగా నవ్వుతుందట. దాని వల్ల షూటింగ్ సమయంలో చాలా సార్లు ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనుష్కనే చెప్పింది. షూటింగ్ లో ఏదైనా కామెడీ సన్నివేశం చేయాల్సి వస్తే ఆ రోజు చాలా ఆలస్యం అవుతుందట. తాను నవ్వడం మొదలు పెడితే యూనిట్ మొత్తం టీ బ్రేక్ తీసుకుంటారు అని తెలిపింది అనుష్క. అయితే ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యానికేమి ఇబ్బంది లేదని తెలియడంతో స్వీటీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. -
హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?
అందం, అభినయం.. ఇలా రెండింటిలోనూ కేక పుట్టించే టాలెంట్ ఉన్న బ్యూటీ అనుష్క శెట్టి. గతంలో ఆమె నటించిన సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ప్రస్తుతం ఈమె చాలావరకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన అనుష్క.. 40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే సింగిలే. ఈ క్రమంలో చాలాసార్లు పెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓ నిర్మాతతో ఏడడుగులు వేయబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?)'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. ఈ మూవీ చేస్తున్న టైంలోనే 'సైజ్ జీరో'లో నటించింది. ఇందులో పాత్ర కోసం భారీగా బరువు పెరిగింది. ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇదే. సినిమా హిట్ అవ్వలేదు. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గట్లేదు. దీంతో చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మలయాళం ఓ మూవీ చేస్తోంది.హీరోయిన్లలో అనుష్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఈమె-ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వచ్చాయి. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. టాలీవుడ్ దర్శకుడితోనూ పెళ్లంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అలా మరోసారి టాక్ మొదలైంది. అనుష్క త్వరలో పెళ్లికి రెడీ అయిందని, కన్నడ నిర్మాతతో ఏడడుగులు వేయనుందని అంటున్నారు. ఇది కూడా కేవలం ఓ రూమర్‌లానే అనిపిస్తుంది. కొన్నిరోజులాగితే నిజమేంటనేది తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు) -
ప్రతీకారం!
హీరోయిన్ అనుష్కా శెట్టి, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా సినిమాకు ‘ఘాటి’ అనే టైటిల్ ఖరారైంది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. వ్యాపార రంగంలో అంచలంచలుగా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు కావాలని ఎలా నష్టపరిచారు? ఆ తర్వాత ఆమె ఏ విధంగా వారిపై ప్రతీకారం తీర్చుకుంది? అనే కోణంలో ‘ఘాటి’ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. -
మలయాళంలో ఫస్ట్ మూవీ.. స్వీటీ ఎంత తీసుకుంటుందంటే?
చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు.. మొన్నటివరకు బొద్దుగా, ముద్దుగా కనిపించిన స్వీటీ ఇప్పుడు సన్నబడి క్యూట్‌గా తయారైంది. అగ్ర హీరోల సరసన నటించడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలూ చేసిన స్టార్ హీరోయిన్ అనుష్క చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే మిస్ శ్రీట్టి మిస్టర్ పొలిశెట్టితో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కథనార్- ద వైల్డ్ సోర్సరర్ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజిన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకుగానూ అనుష్క రూ.5-6 కోట్లు డిమాండ్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గతంలో ఒక్క సినిమాకు మూడు కోట్ల మేర పారితోషికం తీసుకున్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి ఐదారుకోట్లు తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ లెక్కన మలయాళ సినిమాకు కూడా దాదాపు అంతే తీసుకుని ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. చదవండి: 36 దేశాల్లో ట్రెండ్ అవుతున్న ఇండియన్ సిరీస్.. స్ట్రీమింగ్ అక్కడే! -
ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?
సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే సినిమాలు చేసినా చేయకపోయినా.. అప్పుడప్పుడు మీడియాలో అయితే కనిపిస్తుంటారు. అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. కానీ 'బాహుబలి' బ్యూటీ అనుష్క మాత్రం బయట దర్శనమిచ్చి చాలా ఏళ్ల గడిచిపోయింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత బయటకొచ్చింది. అయితే అందరూ ఈమెని చూసే షాకవుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క.. అదే టైంలో 'సైజ్ జీరో' అనే సినిమా చేసింది. దీని కోసం నిజంగా బరువు పెరిగింది. అక్కడి నుంచి అనుష్కకు సమస్యలు మొదలయ్యాయి. పెరగడమైతే పెరిగిపోయింది గానీ దాన్ని తగ్గించడం కోసం నానా పాట్లు పడింది. అడపాదడపా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది గానీ కమర్షియల్ చిత్రాలకు పూర్తిగా దూరమైపోయింది. అనుష్క హీరోయిన్గా చేసిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా గతేడాది థియేటర్లలో రిలీజైంది. అప్పుడు కూడా కనీసం ఒక్కసారి కూడా బయటకు రాలేదు. బరువు తగ్గకపోవడం, ఒకవేళ బయటకొస్తే విమర్శలు రావొచ్చేమో అనే భయంతో రాలేదని అప్పట్లో మాట్లాడుకున్నారు. ఇన్నాళ్ల పాటు వర్కౌట్స్ చేసిందో ఏమో గానీ ఇప్పుడు స్లిమ్ లుక్‌లో కనిపించింది. తాజాగా ఓ మలాయళ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఈ క్రమంలోనే అనుష్క లేటెస్ట్ ఫొటోస్ బయటకొచ్చాయి. ఈమెని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎల్లుండే నిశ్చితార్థం?) -
లేడీ సూపర్ స్టార్స్ కామ్ బ్యాక్
-
అనుష్క- క్రిష్.. ఓ ఒడిశా అమ్మాయి!
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ రంగంలో రాణించాలంటే.. ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రస్తుతం ఆ అదృష్టానికి అనుష్క, క్రిష్ దూరమయ్యారు. ఇద్దరు మంచి ప్రతిభావంతులే. కానీ కాలం కలిసిరాకపోవడంతో కెరీర్ పరంగా కొంతవరకూ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల అనుష్క నటించిన.. క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. దీంతో ఈ ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తులు కలిని ఓ సినిమా చేయబోతున్నారు.ఎలాంటి గాసిప్ లేకుండా వీరిద్దరి సినిమా పట్టాలెక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనుష్కని మెయిన్ లీడ్‌లో పెట్టి ఏకంగా ఓ పాన్ ఇండియా సినిమానే తెరకెక్కిస్తున్నాడట క్రిష్. పడిపోయిన అనుష్క గ్రాఫ్‌ని లేపడానికి యూవీ క్రియేషన్స్ ఈ బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తోంది. లేడి ఓరియెంటెండ్ చిత్రాలు అనుష్కకి కొత్తేమి కాదు. అరుధంతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి లాంటి చిత్రాలెన్నో చేసింది. ఇవన్నీ కెరీర్ పరంగా అనుష్క స్థాయిని పెంచిన చిత్రాలే. అయితే చివరకు అలాంటి లేడి ఓరియెంటెండ్ చిత్రమే అనుష్క గ్రాఫ్‌ని పడిపోయేలా చేసింది. అదే జీరో సైజ్ మూవీ. ఈ మూవీ కోసం అధిక బరువు పెరిగింది ఈ యోగా టీచర్. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడం కోసం నానాపాట్లు పడినా.. మళ్లీ మునుపటి అనుష్క మాత్రం తెరపై కనిపించలేదు. చాలా కాలం తర్వాత ఆ మధ్య మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెరపై కాస్త అందంగా కనిపించింది. ఇక క్రిష్ సంగతి కూడా అంతే.. గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో టాలెంటెండ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణ వరకు క్రిష్‌కి మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు క్రిష్ గ్రాఫ్‌ని కిందకు దించాయి. దీనికి తోడు మణికర్ణిక సినిమా విషయంలో కంగనా రనౌత్‌తో జరిగిన గొడవ క్రిష్‌కి మైనస్ అయింది. ఆ గొడవ వల్ల క్రిష్ బాలీవుడ్‌కి దూరమయ్యాయి. 2021లో కొండపొలం అనే సినిమా వచ్చేవరకు క్రిష్ పేరు ఎక్కడా వినిపించలేదు. అయితే కొండపొలం కూడా డిజాస్టర్ కావడంతో క్రిష్ ఢీలా పడ్డాడు. హరిహర వీరమల్లు చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ ఆ చిత్రం మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఇలా కెరీర్ పరంగా ఢీలా పడ్డ ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ వ్యక్తులు కలిసి ఓ పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో ఓ అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిశా అమ్మాయి ఎలా పోరాటం చేసిందనే నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఒడిశాలో జరుగుతుంది. అక్కడ అనుష్కపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఒడిశాకి చెందిన అమ్మాయి కథే కాబట్టి అక్కడ షూటింగ్ చేస్తున్నారని అంటున్నారు. మహిళా లోకం మొత్తం ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట క్రిష్. మరి ఈ చిత్రంతో కెరీర్ పరంగా ఇద్దరు సక్సెస్ బాట పడతారో లేదో చూడాలి. -
స్టార్ క్రికెటర్ తో అనుష్క శెట్టి పెళ్లి ?
-
వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న అనుష్క తల్లిదండ్రులు..?
డీప్ ఫేక్ టెక్నాలజీని క్రియేటివ్, ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించింది. అసాధ్యం అయిన వాటిని ఈ టెక్నాలజీతో సుసాధ్యం చేసి చూపించొచ్చు. ఎప్పుడో చనిపోయిన నటుడిని మళ్లీ తెరపై చూపించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కొందరు సాంకేతికత మాటున సామాన్య జనాలతో పాటు సెలబ్రిటీలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీకి తాజా బాధితురాలు రష్మిక. ఆమెకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వీడియోను ఎవరో మార్ఫింగ్ చేశారు. చివరకు అలాంటి చెత్తపని చేసిన వారు అరెస్ట్ కూడా అయ్యారు. కొద్దిరోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ అనుష్కకు కూడా ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు అనుష్క- ప్రభాస్‌లకు పెళ్లి అయినట్లు వారికి పిల్లలు కూడా ఉన్నట్లు పలు ఫోటోలను టెక్నాలజీ సాయంతో క్రియేట్ చేసి ఇంటర్నెట్లో షేర్ చేశారు. అవి భారీగా ట్రెండ్ అయ్యాయి. కానీ అవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో క్రియేట్ చేయడంతో అవన్నీ ఫేక్ అని అందరూ ఈజీగా చెప్పేశారు. ఈ విషయంలో వారి ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. ఇలాంటి చెత్తపనులు మరోసారి చేస్తే తాటతీస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసిన వారిపై తాజాగా అనుష్క కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి అంటూ తాజాగా ఆమె ఫోటోలతో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పినట్లు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అనుష్క కుటుంబం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అనుష్క గురించి నెలకొకసారి ఇలాంటి తప్పుడు వార్తలు కావాలనే ఎవరో ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. అనుష్క ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి ఇబ్బంది కలిగించడం చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. వీటికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టకపోతే కుదరదని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని భావించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. తన సినిమాల విషయానికొస్తే.. ఐదేళ్ల తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో అనుష్క వెండితెరపై కనిపించింది. అయినా టాలీవుడ్లో తన రేంజ్ ఏమాత్రం తగ్గలేదని ఆ సినిమా కలెక్షన్స్‌తో నిరూపించింది. భాగమతి పార్ట్-2తో ఆమె త్వరలో రానుంది. -
త్వరలోనే అనుష్క శెట్టి పెళ్లి?
సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ రావడం సర్వ సాధారణం. బాలీవుడ్ మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఇటీవల ఎక్కువయ్యాయి. డేటింగ్, పెళ్లి, విడాకులు అంటూ సినీ తారలపై మనం తరచు వార్తలు వింటుంటాం. స్టార్ నటీనటుల విషయంలో ఇవీ కాస్తా ఎక్కువగానే ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం అని అందరికీ తెలుసు. కెరీర్ ప్రధానంగా సాగే ఈ రంగంలో చాలామంది వయసు పెరుగుతునప్పటికీ పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ల విషయంలో తరచుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇటీవల రష్మిక- విజయ్ ఎంగేజ్మెంట్ అంటూ పెద్దఎత్తున రూమర్స్ వచ్చాయి. అలాంటిదేమీ లేదంటూ విజయ్ టీం క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న టాక్ తెగ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో స్వీటీగా తన పేరును ముద్రించుకున్న హీరోయిన్ అనుష్క. విక్రమార్కుడు నుంచి బాహుబలి దాగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పించింది. అరుంధతి చిత్రంతో జేజమ్మగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ద్వారా పలకరించింది. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమాలో డిఫరెంట్ రోల్లో కనిపించి అలరించింది. అయితే ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంలో గతంలో చాలాసార్లు ఆమెపై రూమర్స్ కూడా వచ్చాయి. అవీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయంపై చర్చ మొదలైంది. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్‌తో రిలేషన్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో ఏకంగా ఓ స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతే కాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కాగా.. గతంలో అనుష్క పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లిపై నాకు నమ్మకముంది. వివాహానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క పెళ్లిపై మరోసారి వార్తలు రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
అరుంధతి @15 ఏళ్లు.. అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అయితే సంక్రాంతి హంగామా నడుస్తోంది. దాదాపు ప్రతిఒక్కరూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే టైంలో నాలుగు సినిమాలు కూడా రిలీజయ్యాయి. వీటిలో 'హను-మాన్'కు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వచ్చింది. సరే దీని గురించి కాసేపు పక్కనబెడితే ఈ పండగ టైంలో వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన మూవీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'అరుంధతి'నే. ఇప్పుడు ఈ చిత్రం 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు లీడ్ యాక్టర్స్ రెమ్యునరేషన్ సంగతి కూడా చూసేద్దాం. సంక్రాంతి పండక్కి సాధారణంగా ఫ్యామిలీ స్టోరీలతో తీసిన సినిమాల్నే రిలీజ్ చేస్తుంటారు. ఇవి కాదంటే యాక్షన్ ఎంటర్టైనర్, కామెడీ సినిమాల్ని థియేటర్లలోకి తీసుకొస్తుంటారు. అయితే ఈ పండగ హడావుడిలో చాలా అంటే చాలా అరుదుగా హారర్ మూవీస్ వస్తుంటాయి. అలా వచ్చిన చిత్రమే 'అరుంధతి'. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ఈ చిత్రం విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులు కైవసం చేసుకున్న 'అరుంధతి'.. టాలీవుడ్లోనే సరికొత్త రికార్డులు సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఇటుగా రూ.13 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీస్తే ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయట. ప్రధాన పాత్రల్లో నటించిన అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. సినిమా తీసే టైంలో అనుష్క కేవలం ఓ హీరోయిన్ అంతే. దీంతో ఈమెని రూ.కోటి లోపే పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. మరోవైపు విలన్ పశుపతిగా చేసిన సోనూసూద్‌కి అయితే తొలుత రూ.18 లక్షలే అనుకున్నారు. కానీ ఎక్కువ రోజులు వర్క్ చేయడంతో రూ.45 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని టాక్. దీనిబట్టి చూస్తే మరీ రూ.కోటిన్నరలోపే ఇద్దరు లీడ్ యాక్టర్స్ పారితోషికం అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) One and only Lady Super Star of South India cinema @MsAnushkaShetty ❤️🔥 Oka horror film tho max andhari hero la highest lepina legendary actress anushka !💥💥#15YearsForAnushkaArundhati pic.twitter.com/3XI8TGfR9O — Manjula Reddy (@Manju_Anushka) January 15, 2024 -
స్వీటీ అనుష్క.. మళ్లీ అలాంటి సినిమాలోనే?
‘అరుంధతి’, ‘భాగమతి’ వంటి ఉమెన్ సెంట్రిక్ హిట్స్‌తో ఈ జానర్ చిత్రాలకు ఓ స్పెషలిస్ట్‌గా మారిపోయారు అనుష్కా శెట్టి. తాజాగా ఆమె మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దర్శకుడు క్రిష్ ఇటీవల ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ స్టోరీని డెవలప్ చేశారని, ఈ కథలో అనుష్క అయితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నారనీ టాక్. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ (2010) సినిమాలో అనుష్క ఓ లీడ్ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. పద్నాలుగేళ్లకు క్రిష్–అనుష్క కాంబో కుదురుతుందా? అనేది వేచి చూడాల్సిందే. -
Birthday Special: సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్‌డే స్పెషల్
-
Anushka Shetty Birthday: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బర్త్‌డే ఫోటోలు
-
శతాబ్దాల నాటి పండుగ.. వేదికపై ఐశ్వర్య రాయ్, అనుష్కతో పాటు ఈ స్టార్స్ కూడా..
కర్ణాటకలో కంబళ ఉత్సవాలు ప్రతియేటా ఘనంగా జరుగుతాయి. ఇది శతాబ్దాల నాటి ఆనవాయతీ. వారి సంస్కృతి సంప్రదాయంలో ఇదొక భాగం.. అందుకే కాంతార సినిమాలో కూడా కంబళ పోటీలలో రిషభ్ శెట్టి పాల్గొంటాడు. ఆ సినిమాలో కూడా వాటిని రియల్‌గానే ఆయన చిత్రీకరించారు. నవంబర్‌లో ప్రారంభమై మార్చి వరకు జరిగే వార్షిక పండుగ సీజన్‌గా గుర్తింపు ఉంది. ఈ ఏడాది పోటీల కోసం కర్ణాటక సన్నద్ధమవుతోంది. ఈసారి అతి పొడవైన ట్రాక్‌ను నిర్మిస్తున్నట్టు కంబళ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అశోక్‌కుమార్ రాయ్ వెల్లడించారు. పోటీలలో భాగంగా శీతాకాలంలో తీర ప్రాంతంలోని రైతులు.. గేదెలను పట్టుకుని బురదపై పరుగులు తీస్తారు. పంట బాగా పండాలని దేవుడుకి ప్రార్థిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తారు. చాలా ఏళ్లుగా ఈ కంబళ పోటీలు కొనసాగుతున్నా ఈ మధ్య ఎక్కువగా దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ఈ పోటీలు తీర ప్రాంతానికే పరిమితం. కానీ ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని బెంగళూరు వేదికగా పాలెస్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. నవంబర్ 25, 26 తేదీల్లో ఈ ఈవెంట్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పోటీలను చూసేందుకు సుమారు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 150 గేదెలు ఉన్నాయి. ఆ మేరకు వాటి యజమానులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. పోటీలో గెలిచిన వారికి రూ. 1.50 లక్షల నగదు అందించినున్నారు. తీర ప్రాంతానికే పరిమితం అయిన ఈ పోటీలను ఈసారి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు.. బెంగళూరులో ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఫలితంగా.. నవంబర్ 25, 26 తేదీల్లో ఈ కంబళ పోటీలు.. తొలిసారిగా పాలెస్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. ఈసారి జరగనున్న కంబళ పోటీలకు ప్రముఖ సినీ తారలు ఐశ్వర్య రాయ్, అనుష్క శెట్టి, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి, కేజీఎఫ్ యష్, దర్శన్‌లతో పాటు క్రికెటర్ కే.ఎల్ రాహుల్ కూడా ఈ రెండు రోజుల ఈవెంట్లో పాల్గొంటారని అశోక్ రాయ్ తెలిపారు. -
ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి!
సినిమా ఇండస్ట్రీలో స్వీటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనుష్కనే. ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అలరించారు. ఈ బెంగళూరు భామ మొదట్లో యోగా టీచర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సూపర్ అనే తెలుగు చిత్రంలో నాగార్జునకు జంటగా నటించే అవకాశం వరించింది. అలా తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్ని తన అందాలతో కొల్లగొట్టిన అనుష్క ఆ తర్వాత రెండు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో మరింతగా గ్లామరస్‌గా నటించి తడితడి అందాలతో తమిళ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించారు. ఇంకేముంది ఈ రెండు భాషల్లోనూ వరుసగా అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలాంటి గ్లామరస్ నటిని అరుంధతి చిత్రంతో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ చిత్రం తమిళంలోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భాగమతి చిత్రాలతో తనలోని నట దాహాన్ని తీర్చుకున్న అనుష్క, బాహుబలి చిత్రంతో నటిగా మరో అంతస్తుకు చేరుకుంది. అలా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించిన ఈ భామ సైజ్ జీరో అనే చిత్రంలో నటించడానికి ఏ హీరోయిన్ చేయని సాహసం చేశారు. అందులోని పాత్ర కోసం బరువును విపరీతంగా పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత బరువు తగ్గడానికి ఇప్పటి వరకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. దీంతో అవకాశాలు ఆమెకు దూరమయ్యాయనే అనే చెప్పాలి. ఇటీవలే రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం అనుష్కకు మంచి కమ్ బ్యాక్‌గా నిలిచింది. దీంతో నూతన ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు తాజాగా ఒక మలయాళ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. హోమ్ చిత్రం ఫేమ్ రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జై సూర్యకు జంటగా అనుష్క నటిస్తున్నారు. ఇది చారిత్రక కథ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు తెలిసింది. తన పాత్ర కొత్తగా ఉండకపోతే అనుష్క ఇందులో నటించడానికి సమ్మతించి ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?
డార్లింగ్ హీరో ప్రభాస్ వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ఏ హీరోకి సాధ్యం కానీ క్రేజ్ సంపాదించాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తాజా పుట్టినరోజుతో 44 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాడు. పెళ్లి మాత్రం చేసుకోవట్లేదు. ఇది మాత్రమే అభిమానుల్ని టెన్షన్ పెడుతున్న విషయం. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాసింది. పెళ్లికి అడ్డొస్తున్న సమస్య ఇదేనంటూ బయటపెట్టింది. అనుష్కతో పెళ్లి? ప్రభాస్-అనుష్క.. హిట్ అండ్ క్యూట్ జోడీ. 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి' రెండు పార్ట్స్‌లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. వీళ్ల బాండింగ్ చూసిన ఫ్యాన్స్.. వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అన్నారు. అయితే తమ మధ్య స్నేహం తప్ప మరొకటి లేదని పలు సందర్భాల్లో వీళ్లు చెప్పారు. లేదంటే నవ్వుతూ తప్పించుకున్నారు. అయితే వీళ్లిద్దరూ 10 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని తాజాగా టైమ్స్ నౌ వెబ్సైట్ రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?) జాతకాల సమస్య ఇంగ్లీష్ వెబ్సైట్ రాసుకొచ్చిన దాని ప్రకారం.. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోవాలని ఒకరికొకరు మాటిచ్చుకున్నారట. ఒకవేళ కుదరకపోతే జీవితాంతం సింగిల్‌గా ఉండిపోవాలని అనుకున్నారట. అలానే జాతకాలు కలవకపోవడంతో ప్రభాస్ కుటుంబ సభ్యులు పెళ్లికి నో చెప్పారట. ప్రభాస్ తల్లి ఎక్కువగా జాతకాలు, దేవుడిని నమ్ముతారట. ఆమె చెప్పడంతోనే ప్రభాస్ మరో మాట మాట్లాడకుండా ఇన్నాళ్లు పెళ్లికి దూరంగా ఉన్నారట. ఈ విషయాన్ని ఒకరు తమకు ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పారని టైమ్స్ నౌ రాసుకొచ్చింది. పెద్దమ్మ చెప్పేసిందిగా! ఈ మధ్య దసరా సందర్భంగా విజయవాడ దుర్గమ్మని దర్శించుకున్న ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే దసరాలోపు ఈ శుభకార్యం జరిగిపోతుందని ఆమె అన్నారు. ఈమె చెప్పిందే నిజమా? లేదా తాజాగా ఇంగ్లీష్ వెబ్సైట్లో వచ్చిందా నిజామా అనేది.. ప్రభాస్-అనుష్క స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు. (ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్) -
అనుష్క కోసం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాను కానీ..!
-
సౌత్‌లో ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతంటే.. టాప్‌లో ఎవరో తెలుసా?
సినీరంగంలో ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చినా తనదైన మార్కెట్‌తో దూసుకుపోతుంటారు. వారు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా కూడా సినిమా ఛాన్స్‌లు వస్తుంటాయి. ఈ విషయాన్ని స్వయంగా సినీరంగంలో పనిచేసే వారే చాలాసార్లు చెప్తుంటారు. సినిమాల్లో మగవాళ్లలా నటీమణులు కనీసం 40, 50 ఏళ్లు కూడా ఉండలేరు. ఒకవేళ ఉన్నా సపోర్టింగ్ రోల్స్‌లలో నటించేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వారు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో మార్కెట్ పడిపోతుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్లుగా ఇంకా తమ సత్తా చాటుతున్నారు. త్రిష, నయనతార వంటి నటీమణులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ 20 ఏళ్లకు పైగా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకానీ సపోర్టింగ్ రోల్స్ లో నటించడం లేదు. అనేక భారీ బడ్జెట్, పాన్-ఇండియన్ చిత్రాలలో ఇటీవలి కాలంలో హీరోలతో సమానంగా వారు కూడా రెరమ్యునరేషన్ పొందుతున్నారు. వీళ్లు రూ. 10 నుంచి 11 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్. ఒక సినిమాకు రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి దక్షిణ భారత నటిగా నయనతారకు గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి మరోకరు ఉన్నారు. ఆమె మరెవరో కాదు నటి త్రిష. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి త్రిష. ప్రస్తుతం నయనతార పారితోషికం కంటే త్రిష ఎక్కువ తీసుకుంటున్నట్లు టాక్. దీనికి ప్రధాన కారణం త్రిష నటనా ప్రావీణ్యంతో పాటు.. 40 ఏళ్లు దాటినా యూత్ ఫుల్ అందం అని చెప్పవచ్చు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు త్రిష 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయం గూగుల్ కూడా తెలుపుతుంది. త్రిషకు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు కూడా ముందుకొచ్చారని తెలుస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి త్రిష అని పరిగణనలోకి తీసుకుంటే, నయనతార రెమ్యూనరేషన్ పెద్దగా తగ్గలేదు. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార ఈ సినిమా కోసం 11 కోట్ల పారితోషికం తీసుకుందట. రెమ్యునరేషన్ పరంగా అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఆమె పారితోషికం రూ.6 కోట్లు. అనుష్క ప్రస్తుతం తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. సమంత రూ.6 నుంచి 8 కోట్లు ఒక సినిమాతో సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన యశోద, శకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. పూజా హెగ్డే సౌత్ ఇండియన్ బిజీ నటీమణులలో ఒకరు. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. జైలర్ ద్వారా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. రూ. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఒక సినిమా కోసం ఒకటిన్నర నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నటి ఏడాది క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకు 1.5 నుంచి 3.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. నివేదికల ప్రకారం, కీర్తి సురేష్ ఒక సినిమాకు రూ.2.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు సరైన హిట్ దక్కలేదు. -
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఓటీటీ అఫిషియల్ ప్రకటన వచ్చేసింది
అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాతో వెండితెరపై మెరిసింది. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి.మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో ఇప్పటి వరకు సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఎఫెక్ట్.. సూసైడ్ లేఖతో చరణ్ అభిమాని వార్నింగ్..) తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నుంచి ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అఫిషీయల్‌గా నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు తొలి ప్రేక్షకుడిని నేనే అంటూ గతంలో చిరంజీవి తెలిపారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆయన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో సినిమాకు ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. మెగాస్టార్‌తో పాటు మహేశ్ బాబు, సమంత కూడా ఈ సినిమాపై పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ కంటే రెట్టింపు వినోదం ఇందులో ఉన్నట్లు వారందరూ తెలిపారు. థియేటర్లో ఈ సినిమా చూడలేకపోయిన వారు అక్టోబర్ 5న నెట్‌ఫ్లిక్స్ చూసి ఎంజాయ్ చేయండి. -
నమ్మకం నిజమైంది
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో వాళ్లే మా సినిమాను ప్రమోట్ చేశారు. ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 75 సిటీస్‌కి వెళ్లాను. అమెరికాలో ప్రమోషన్‌కి వెళ్లినప్పుడు హోటల్లో నిద్రపోయే టైమ్ ఉండేది కాదు. ఈస్ట్ నుంచి వెస్ట్‌కు ప్రయాణం చేసే విమానంలోనే నిద్రపోయేవాణ్ణి. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్లా కాబట్టి నాకు కష్టం అనిపించలేదు’’ అని హీరో నవీన్ పోలిశెట్టి అన్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో అనుష్కా శెట్టి, నవీన్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి విలేకరులతో చెప్పిన విశేషాలు. ► మంచి సినిమా చేశాం.. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉండేది. అది నిజమైంది. తెలుగులో వసూళ్లు నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకున్నాయి.. మూడో వారంలోనూ మంచి వసూళ్లు ఉన్నాయి. అమెరికాలోనూ మూడో వారంలో మంచి వసూళ్లు ఉండటంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లోనూ షోలు పెంచుతున్నారు. మా మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్. ► నా తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నేను బాగా నటించగలనని నిరూపించింది. నా సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రొడ్యూసర్స్, బయ్యర్స్‌లో వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు.. భావోద్వేగాలు కూడా పండించగలను అని నిరూపించుకున్నా. ► తెలుగులో చిరంజీవి, ప్రభాస్గార్లు, హిందీలో ఆమిర్ ఖాన్‌గారు ఇష్టం. అలాగే అన్ని జానర్స్ సినిమాలను ఇష్టపడతాను. హిందీలో రాజ్‌కుమార్ హిరాణీగారి చిత్రాలంటే ఇష్టం. తెలుగులో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, భైరవ ద్వీపం, ఆదిత్య 369’ వంటి సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ఆ గుర్తింపు వచ్చింది: నవీన్ పోలిశెట్టి
ఇప్పటి వరకు నేను చేసిన మూడు సినిమాలు(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి) చేశాను. ఈ మూడు సక్సెస్ఫుల్ మూవీస్ ఒక్కోటి నా కెరీర్‌కు ఒక్కో రకంగా హెల్ప్ చేశాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస..మూవీతో నేను బాగా నటించగలనే నమ్మకం వచ్చింది. జాతి రత్నాలు టైమ్ లో పాండమిక్ వచ్చింది. అప్పుడు సినిమాలు థియేటర్ లో చూడరు అన్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి...నవీన్ సినిమా థియేటర్ లో బాగా పే చేస్తుందనే నమ్మకం ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ లో వచ్చింది. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా చేయగలను అని నిరూపించుకున్నాను’అని యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అన్నాడు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్ మీడియాతో ముచ్చటించారు.ఆ విశేషాలు.. ►మేము సెప్టెంబర్ 7 డేట్ అనౌన్స్ చేయగానే మరోవైపు జవాన్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అప్పుడు ఎంతో టెన్షన్ పడ్డా. పెద్ద సినిమాతో వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో అనే కంగారు ఉండేది. కానీ ప్రేక్షకులు మా సినిమాను సూపర్ హిట్ చేశారు. మంచి సినిమా అనే వర్డ్ ఆఫ్ మౌత్ తోనే అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ తెలుగులో కలెక్షన్స్ నెమ్మదిగా మొదలయ్యాయి. కానీ యూఎస్ లో డల్లాస్ లో ప్రీమియర్స్ వేసినప్పటి నుంచే స్ట్రాంగ్ గా రన్ స్టార్ట్ అయ్యింది. మూడు రోజులకే వన్ మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వీక్ లో కూడా యూఎస్ లో రన్ అవుతోంది. స్క్రీన్స్ పెంచుతున్నారు. ► మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ హీరోస్, టెక్నీషియన్స్ మా సినిమాను అప్రిషియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. మాతో రెండు గంటలపాటు మాట్లాడారు. నా పర్ ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మహేశ్ బాబు, రవితేజ, రాజమౌళి, చరణ్ గారు, సమంత..ఇంకా చాలా మంది చూసి వాలెంటరీగా రియాక్ట్ అయ్యారు. ఆడియెన్స్ కూడా వాళ్లకు వాళ్లే ముందుకొచ్చి మా సినిమాను ప్రమోట్ చేశారు. ► ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 15 సిటీస్ వెళ్లాను. అమెరికాలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు జర్నీ చేసే ఫ్లైట్ లోనే నిద్రపోయేవాడిని. హోటల్ లో నిద్ర పోయేందుకు కూడా టైమ్ ఉండేది కాదు. రిలీజ్ అయ్యాక కూడా మూవీ ప్రమోషన్ చేశాం. ప్రేక్షకులకు నా థ్యాంక్స్ చెప్పుకోవాడనికి వెళ్తున్నా. కాబట్టి అది కష్టం అనిపించలేదు. ► బాలీవుడ్ లో స్టాండప్ కామెడీ హిట్, తమిళంలో బాగా చూస్తారు. మన దగ్గర ఎందుకు సక్సెస్ కాలేదని అనిపించింది. అయితే మనం పర్పెక్ట్ గా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని ఛాలెంజ్ గా తీసుకుని చేశాను. ఇక్కడ కూడా స్టాండప్ కమెడియన్స్ కు ఆదరణ పెరిగితే హ్యాపీ. ► నటుడిగా ప్రతి సీన్ ను సెట్ లో ఇంప్రొవైజ్ చేసుకుంటా. సీన్ లో నాలుగు జోక్స్ ఉంటే..నేను చేసేప్పుడు ఏడుసార్లు ఆడియెన్స్ నవ్వాలని అనుకుంటా. అలాంటి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటా. లక్కీగా నా డైరెక్టర్స్ అందరూ నాకు అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు. సీన్ పేపర్ లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. రేపు చేసే సీన్ గురించి రాత్రే దర్శకుడితో మాట్లాడి పూర్తి క్లారిటీ తీసుకుంటా. ► ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటి స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి. వచ్చే ఏడాది మూడు మూవీస్ ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయి. వాటి అప్ డేట్స్ నేనే మీకు చెప్తా. హిందీలో రెండు మూడు కథలు విన్నాను కానీ నా ప్రయారిటీ ప్రస్తుతానికి తెలుగులో నటించడమే. -
ప్రేక్షకుల వల్లే అది సాధ్యమైంది
‘‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విడుదల రోజే ఓ పెద్ద హిందీ సినిమా(జవాన్) రిలీజ్ అవుతోందని తెలినప్పుడు ఆందోళన చెందాం. కానీ ఈ నెల 7 నుంచి మొదలైన ప్రీమియర్స్ నుంచి ఇప్పటి వరకూ మా సినిమాకు మంచి స్పందన లభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల మౌత్‌టాక్‌తోనే ఇది సాధ్య మైంది.. మాకు పెద్ద హిట్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని హీరో నవీన్ పొలిశెట్టి అన్నారు. అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సినిమా విజయోత్సవంలో నవీన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను అందరికంటే ముందు చూసిన చిరంజీవిగారు హిట్ అవుతుందన్నారు.. ఆయన మాటే నిజం అయింది’’ అన్నారు. ‘‘నాకు వచ్చిన ఓ ఐడియాను నవీన్ , అనుష్కలతో పాటు నిర్మాతలు నమ్మకుంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు’’ అన్నారు పి.మహేశ్‌బాబు. దర్శకులు మారుతి, నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ, నందినీ రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, ఎస్‌ఎకేఎన్ మాట్లాడారు. -
పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్ ఇదే!
తమిళసినిమా: అరుంధతి చిత్రం నటి అనుష్క ఇమేజ్ను ఒక్కసారిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత అనుష్క ఆమె అభిమానులు ఆమెను గ్లామర్ పాత్రల్లో ఊహించుకోవడం మానేశారు. దర్శక నిర్మాతలు కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే ఆమెను నటింపజేయడానికి ఇష్టపడ్డారు. అలా రూపొందిన చిత్రాలే భాగమతి, బాహుబలి వంటివి. అగ్ర కథానాయక వెలిగిపోతున్న సమయంలో ఆమె కెరీర్‌కు బ్రేకులు వేసిన చిత్రం సైజ్ జీరో అనే చెప్పాలి. ఆ చిత్రంలోని పాత్ర కోసం అనుష్క బరువు పెరగడం అనే పెద్ద సాహసమే చేశారు. ఆ తర్వాత ఎప్పటికీ ఆమె బొద్దుగానే ఉన్నారు అదే సమయంలో ముద్దుగానో కనిపించడం విశేషం. అలా తాజాగా అనుష్క నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ చిత్రంపై అనుష్క చాలా ఆశలు పెట్టుకున్నారు. కొంచెం ఆలస్యం అయినా ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకిది కమ్ బ్యాక్ చిత్రం అయిందనే చెప్పాలి. ఈ సందర్భంగా నటి అనుష్క ఓ భేటీలో పేర్కొంటూ నటిగా తనకు ఇంత బ్రేక్ వస్తుందని ఊహించలేదన్నారు. ఆయన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కొత్త కాన్సెప్ట్‌తో కూడిన ఒరిజినల్ కథా చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. (చదవండి: తమిళ్ సైమా విజేతలు వీరే.. బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే?) ఇకపై వరుసగా నటిస్తానని చెప్పారు. ఇటీవల ఎక్కువగా గుళ్లు గోపురాలు తిరగడం గురించి ప్రస్తావిస్తూ తాను చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లేదాన్ని, నటిగా బిజీగా ఉండటంతో సమయం కుదరలేదని చెప్పారు. అయితే ఇంట్లో ఇప్పటికీ సోమవారం, శుక్రవారం పూజలు నిర్వహిస్తానని చెప్పారు. ఇక ఇటీవల ఖాళీగా ఉండడంతో ఆలయాలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? అన్న ప్రశ్నకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం అనుష్క ఓ మలయాళం చిత్రంలో నటించిన సిద్ధమవుతున్నారు. -
మంచి సినిమాలను ప్రోత్సహించాలి
‘‘తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మరోసారి నిరూపించారు. ఇలాంటి మంచి సినిమాలను అందరూప్రోత్సహించాలి. ‘జవాన్’ విడుదలైన రోజే వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నిలబడి, బలమైన వసూళ్లతో ముందుకెళ్తోంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పి. మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని చిరంజీవి, మహేశ్‌బాబు, రవితేజ, రాజమౌళి, వంశీ పైడిపల్లి సమంత అభినందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో సక్సెస్ సెలబ్రేషన్స్, సక్సెస్ టూర్ ΄్లాన్ చేస్తున్నాం’’ అన్నారు ప్రమోద్. -
'స్వీటీ చాలా అందంగా కనిపించింది'.. రాజమౌళి ట్వీట్ వైరల్!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి'. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. చాలా రోజుల తర్వాత అద్భుతమైన చిత్రం చూశానంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ డైరెక్టర్‌పై అట్లీని కొనియాడారు. (ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!) కాగా.. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా మహేశ్ బాబు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా కనిపించగా, అనుష్క చెఫ్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రాజమౌళి ట్వీట్లో రాస్తూ..'చాలా కాలం తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చూశాను. స్వీటీ ఎప్పటిలాగే తన అందంతో మెరిసిపోయింది. నవీన్ పొలిశెట్టి కామెడీ మంచి వినోదాన్ని అందించింది. సక్సెస్ సాధించిన చిత్ర బృందానికి అభినందనలు. ఇంత సున్నితమైన విషయాన్ని చాలా సరదాగా హ్యాండిల్ చేసినందుకు మహేశ్ బాబుకు వందనాలు!' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. (ఇది చదవండి: 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' టీజర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ) Watched 2 movies back to back after a long time…🙂 Sweety looked as beautiful and radiant as ever. @NaveenPolishety provided lots of laughter and loads of fun… Congratulations to the #MissShettyMrPolishetty’s team on their success. @filmymahesh, kudos to you for handling such… — rajamouli ss (@ssrajamouli) September 8, 2023 This is the reason why @IamSRK is the Baadshah of the box office… What an earth-shattering opening… 🤯🤯 Congratulations @Atlee_dir for continuing the success streak in the north too, and congrats to the team of #Jawan for the stupendous success…:) — rajamouli ss (@ssrajamouli) September 8, 2023 -
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. తొలిరోజు పేలవమైన కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి తొలిసారి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. కామెడీ, ఎమోషన్స్ కలగలిపి తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్స్ మాత్రం పేలవంగా వచ్చాయి. ఇండియాలో కేవలం రూ.4 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు ముందు పెద్దగా బజ్ లేకపోవడం, ప్రమోషన్స్‌కు అనుష్క దూరం కావడం వల్లే వసూళ్లు ఇంత పేలవంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మౌత్ టాక్ బాగుండటంతో రానున్న రోజుల్లో కలెక్షన్స్ నెంబర్ పెరిగే అవకాశం ఉంది. మరోపక్క అదేరోజు రిలీజైన బాలీవుడ్ మూవీ జవాన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో దూసుకుపోతోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల మేర వసూళ్లు రాబట్టి రికార్డుల వేటకు సిద్ధమని సమరశంఖం పూరించింది. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు ఒకేరోజు రిలీజవడం నవీన్-అనుష్కల సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. జవాన్‌కు హిట్ టాక్ రావడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. మరి జవాన్ పోటీని తట్టుకుని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది చూడాలి! చదవండి: బేబి పెళ్లికొడుకు.. రియల్ లైఫ్‌లోనూ బేబి స్టోరీ.. మూడు బ్రేకప్‌లు.. సూసైడ్ ఆలోచనలు.. -
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’మూవీ రివ్యూ
టైటిల్: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నటీనటుటు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమటం, సోనియా దీప్తి, తులసి తదిరతులు నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్ నిర్మాతలు: వంశీ-ప్రమోద్ దర్శకత్వం: పి.మహేశ్ బాబు సంగీతం:రధన్ నేపథ్య సంగీతం: గోపీ సుందర్ విడుదల తేది: సెప్టెంబర్ 7, 2023 కథేంటంటే.. అన్విత(అనుష్క శెట్టి) లండన్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ చెఫ్. ఆమె వంటకు లండన్ వాసులు ఫిదా అయిపోతారు. కెరీర్ పరంగా ఎంతో ఎదిగినా.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం నిరాకరిస్తుంది. ఆమె తల్లి(జయసుధ)ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా రిజెక్ట్ చేస్తుంది. పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తల్లితో తెగేసి చెబుతుంది. తల్లి మరణించిన తర్వాత.. తనకు ఓ తోడు కావాలనుకుంటుంది అన్విత. అందుకోసం ఓ బిడ్డను కనాలనుకుంటుంది. అది కూడా పెళ్లి చేసుకోకుండా. ఐయూఐ పద్దతిలో తల్లి కావాలని ఓ డాక్టర్ని సంప్రదిస్తుంది. స్పెర్మ్ డోనర్ని తనే వెతుకుతానని చెప్పి..తనకు నచ్చిన లక్షణాలు ఉన్న యువకుడి కోసం సెర్చ్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు స్టాండప్ కమెడియన్ సిద్ధు (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. తనతో క్లోజ్‌గా మూవ్ అయిన తర్వాత అసలు విషయం చెబుతుంది. అయితే అప్పటికే అన్వితతో ప్రేమలో పడిన సిద్దు ఆమెకు సహాయం చేశాడా? లేదా? అసలు అన్విత పెళ్లి చేసుకోకూడదని ఎందుకు నిర్ణయం తీసుకుంది? ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె దేశం విడిచి లండన్ ఎందుకు వెళ్లింది? చివరకు సిద్ధూ-అన్విత కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పెళ్లి కాకుండా తల్లి కావాలనుకునే ఓ యువతి కథే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ పాయింట్ వినగానే ఏదో వల్గారిటీ సినిమా అనే ఫిలింగ్ కలుగుతుంది. అదే సమయంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి సినిమాలు ఒప్పుకోదులే అనే నమ్మకం కూడా ఉంటుంది. ఆ నమ్మకాన్ని కాపాడుతూ.. ఎలాంటి వల్గారిటీ లేకుండా, ప్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మహేశ్‌బాబు పి. ఓ సున్నితమైన అంశాన్ని కామెడీ, ఎమోషన్స్‌తో అతి సున్నితంగా తెరపై చూపించాడు. ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు కచ్చితంగా ఉండాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. అలా అని కథంతా సీరియస్‌గా సాగదు. కామెడీ వేలో చెబుతూనే.. అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఫేమస్ చెఫ్‌గా అనుష్కను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లితో ఆమె బాడింగ్ చూపించారు. అవి కాస్త ఎమోషనల్‌గా ఉన్నప్పటికీ.. రొటీన్‌గా అనిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి ఎంట్రీ వరకు కథ చాలా సింపుల్‌గా సాగుతుంది. ఇక హీరో ఎంట్రీ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నప్పటి కామెడీతో కప్పేశారు. స్టాండప్ కమెడియన్‌గా హీరో చెప్పే జోకులు కొన్ని చోట్ల నవ్విస్తే.. మరికొన్ని చోట్ల బోర్ తెప్పిస్తాయి. హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడడం..ఆమె ఏమో అతన్ని స్పెర్మ్ డోనర్‌గా చూడడం.. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా అర్థమైపోతుంది. హీరోయిన్‌కి ప్రపోజ్ చేసే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. స్పెర్మ్ డొనేషన్ కోసమే తనతో క్లోజ్‌గా మూవ్ అయిందనే విషయం తెలిశాక హీరో ఏం చేశాడనేది సెకండాఫ్. ప్రేమించిన అమ్మాయి కాబట్టి ఆమె అడిగిన సహాయం చేస్తాడనేది అందరికి అర్థమైపోతుంది. కానీ ఈ క్రమంలో జరిగే సన్నివేశాలను హిలేరియస్‌గా రాసుకున్నాడు దర్శకుడు. ఆస్పత్రిలో డాక్టర్‌కి హీరో మధ్య జరిగే సంభాషనలు కానీ.. హీరోయిన్ ఇంటికి పిలిస్తే.. వేరేలా అనుకొని వెళ్లడం..ఈ సీన్లలన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. చివరల్లో మాత్రం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. అసలు హీరోయిన్ ప్రేమ, పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందనే కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. ఎమోషనల్గానూ కనెక్ట్ అవుతారు. అయితే కథంతా ఒక పాయింట్ చుట్టే తిరగడంతో సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే సినిమా ఫలితంగా మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం అనుష్క, నవీన్ పోలిశెట్టి పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, అనుష్క కాకుండా వేరేవాళ్లు నటించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. చెఫ్ అన్విత పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. తన స్టార్‌డమ్‌ని పక్కకిపెట్టి.. ఆ పాత్రలో ఎంతమేరకు నటించాలో అంతమేరకు చక్కగా నటించింది. తెరపై చాలా హుందాగా కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించింది. ఇక నవీన్ పోలిశెట్టి మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. స్టాండప్ కమెడియన్ సిద్దూ పాత్రలో జీవించేశాడు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. హీరోయిన్ తల్లిగా జయసుధ తన పాత్ర పరిధిమేర నటించింది. సినిమా ప్రారంభమైన 10 నిమిషాలకే ఆమె పాత్ర ముగుస్తుంది. ఇందులో ఆమె బాలయ్య వీరాభిమానిగా కనిపించడం గమనార్హం. హీరో తల్లిదండ్రులుగా తులసి, మురళీ శర్మలు రొటీన్ పాత్రలు పోషించారు. హీరో స్నేహితుడిగా అభినవ్ గోమఠం, హీరోయిన్ స్నేహితురాలిగా సోనియా దీప్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గోపీ సుందర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్. రధన్ పాటలు బాగున్నాయి. కథలో భాగంగానే పాటలు వస్తాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌తో పాటు సెకండాఫ్‌లోనూ కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టే, సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రమోషన్స్‌కు అనుష్క దూరం? నిజమెంత?
సినిమాను నిర్మించడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకు ప్రమోషన్ చాలా ముఖ్యంగా మారింది. దీంతో చిత్ర వర్గాలు ప్రచారానికి ప్రాముఖ్యతనిస్తున్నాయి. ఈ క్రమంలో హీరోహీరోయిన్లు చిత్ర ప్రచారాల్లో పాల్గొనాల్సిన పరిస్థితి. బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కంగనారనౌత్ లాంటి స్టార్స్ కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. షారూఖ్‌ఖాన్ అయితే జవాన్ చిత్రం కోసం దేశాన్ని చుట్టేస్తున్నారు. హీరోయిన్ కంగనారనౌత్ తాను తాజాగా నటించిన చంద్రముఖి 2 చిత్రం కోసం చెన్నైలోనే మకాం పెట్టారు. కాగా జవాన్ చిత్రంలో హీరోయిన్గా నటించిన నయనతార మాత్రం ఎలాంటి ప్రచారంలోనూ పాల్గొనకుండా తన పాలసీకి అలాగే కట్టుబడి ఉంది. అదే విధంగా హీరోయిన్ అనుష్క కూడా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటోందని ప్రచారం జరుగుతోంది. ఈమె చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మొన్నటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్‌లోనూ అనుష్క పాల్గొనలేదు. మయోసైటిస్ వ్యాధికి గురైన నమంతనే వీరికంటే బెటర్. అంత బాధలోనూ తాను నటించిన ఖుషీ చిత్ర ప్రచారంలో ఒక్కసారి అయినా పాల్గొందని కామెంట్లు వినిపించాయి. నిజానికి అనుష్క మొన్నటివరకు హైదరాబాద్‌లో లేదు. అందుకనే ఏ ప్రమోషన్స్‌లోనూ కనిపించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. తాజాగా సాక్షికి ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు యాంకర్ సుమ ఇంటర్వ్యూకు హాజరై ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటోంది. ఇకపోతే నయనతార నటించిన జవాన్, అనుష్క నటించిన మిసెస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు నేడు (సెప్టెంబర్ 7) ఒకేసారి విడుదలయ్యాయి. చదవండి: Jawan: క్రికెట్ మ్యాచ్‌లో 'జవాన్' ప్లాన్: అట్లీ -
అనుష్క కోసం రంగంలోకి దిగిన ప్రభాస్
టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో ఆమె మళ్లీ ప్రేక్షకులను మెప్పించనున్నారు. యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నవీన్ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలకు తిరిగి భారీగా సినిమాను ప్రమోట్ చేయగా.. హీరోయిన్ అనుష్క కూడా వినూత్నంగా ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఈ సారి అనుష్క కోసం ప్రభాస్ రంగంలోకి దిగారు. అనుష్క సినిమా కోసం ఆయన చేసిన ఓ పని నెట్టింట ట్రెండ్ అవుతోంది. (ఇదీ చదవండి: ‘జవాన్’మూవీ ట్విటర్ రివ్యూ) 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో తాజాగా అనుష్క ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఇష్టమైన వంటకం అయిన మంగుళూరు చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తయారీ విధానాన్ని అభిమానులతో ఇలా పంచుకున్నారు. (ఇదీ చదవండి: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విటర్ రివ్యూ) 'చెఫ్ పాత్రలో చేయడం నాకు ఇదే తొలిసారి. ఇది నా బెస్ట్ మూవీలా ఫీలవుతున్నాను. దీంతో సోషల్ మీడియా ద్వారా ఓ కొత్త ఛాలెంజ్‌ను మొదలు పెడుతున్నాను. ఇందులో ప్రభాస్ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి ఆయన... ఇప్పుడు తనకు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ఆయన పోస్టు పెట్టాలి.' అని ప్రభాస్‌ను అనుష్క ట్యాగ్ చేశారు. ప్రభాస్ రియాక్షన్ అనుష్క విసిరిన ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్ వెంటనే ఇన్‌స్టాలో తన ఫేవరట్ రెసిపీని పోస్ట్ చేశారు. రొయ్యల పులావ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన తయారీ విధానాన్ని కూడా ఆయన షేర్ చేశారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు విసురుతున్నట్లు ప్రభాస్ చెప్పారు. ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆ పోస్ట్‌ను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడంటే అనుష్క సినిమాకు భారీగా ప్రమోషన్ దక్కినట్లేనని వారు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విటర్ రివ్యూ
నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ‘జాతిరత్నాలు’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్.. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ఆ అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా వెరైటీగా చేయడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. ట్విటర్లో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్ వస్తోంది. సినిమా బాగుందని, నవీన్ కామెడీ అదిరిపోయిందని అంటున్నారు. అనుష్కకు కమ్‌బ్యాక్ మూవీ ఇది అని కామెంట్ చేస్తున్నారు. Watched premiers in London#MissShettyMrPolishetty In simple words the movie is really very nice and good to watch @NaveenPolishety comedy timing and acting 💥 @MsAnushkaShetty sweetie's comeback movie.#วอลเลย์บอลหญิง — Vinaykumar sura (@Vinaykumarsura) September 7, 2023 ఇప్పుడే లండన్‌లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూశాను. ఒక్కమాటలో చెప్పాలంటే.. వెరీ నైస్ సినిమా ఇది. చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, యాక్టింగ్ అద్భుతంగా ఉంది. అనుష్కకు ఇది మంచి కమ్‌బ్యాక్ సినిమా’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #MissShettyMrPolishetty Clean comedy with heartfelt emotions… #Anushka is queen as always and @NaveenPolishety is star of the show….. Comedy matram ROFL👌👌 pic.twitter.com/9ZWx00kxNg — VishnuBose ᴼᴳ (@vishnubose1947) September 6, 2023 మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎమోషనల్‌తో కూడిన క్లీన్ కామెడీ చిత్రం. అనుష్క ఎప్పటికీ రాణిలాగే ఉంటుంది. నవీన్ కామెడీ చాలా బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Watched the premier of Miss Shetty Mr Polishetty with @NaveenPolishety … met him after 17 years. My second movie with him - first being Krish in 2006. Very humble, nice and down to earth person. The movie is really good. Watch it!!! #MissShettyMrPolishetty #NaveenPolishetty pic.twitter.com/jUy7zzb2Es — Sandeep Tapse (@SandeepTapse) September 7, 2023 #MissShettyMrPolishetty #MissShettyMrPolishettyReview a feel good movie . @NaveenPolishety @MsAnushkaShetty both fit into their worlds perfectly. " bhayta nundi vache prema pina bhayamtho, thanlo thane preminchukovatam modalpetindhi" . This dialogue is deep. Rating: 2.75/5 pic.twitter.com/TBbweThRRO — Thaagubothu🥃 (@reventhmails5) September 7, 2023 #MissShettyMrPolishetty What a beautiful cinema this is ❤️❤️. @NaveenPolishety what an actor , what a talent long way to go man . @MsAnushkaShetty the princess of screen presence and acting does it again effortlessly. Fun and emotion is so organic and situational. Loved it 🙌 — Sravankumar 25 (@25Sravankumar) September 7, 2023 #MissShettyMrPolishetty Overall, movie is a sure shot blockbuster and a hattrick for @NaveenPolishety ! He is a natural rockstar and you won’t be disappointed with this one at all! His description about the movie in climax is apt (IYKYK)!#TrustMyReviews rating: 3.75/5 — Trust my reviews (@trustmyreviews) September 6, 2023 After #Kushi, Another Clean Hit for #Tollywood loading... With #MissShettyMrPolishetty 👏👏👏 Blockbuster Reports from the premiere shows 🤘🤘🤘#MSMP @NaveenPolishety @MsAnushkaShetty #MaheshBabu @UV_Creations @GskMedia_PR @SureshPRO_ — SR Promotions (@SR_Promotions) September 7, 2023 Review #MissShettyMrPolishetty 3/5. ⭐️⭐️⭐️/5 "Outstanding performances by Anushka Shetty and Naveen Polishetty in #MissShettyMrPolishetty. Good songs, engaging screenplay, some minor flaws, top-notch comedy, and emotions. Rating: ⭐️⭐️⭐️/5. Must-watch Telugu movie! #Jaibalayya… pic.twitter.com/oe6YpXZ15C — MovieBuffSmartScopeTV (@SunoritaTrading) September 6, 2023 #MissShettyMrPolishetty one word review It's #NaveenPolishetty show.. He carries the movie with one-liners which work at most parts Rest of the movie is dull — SaiCharan Ande (@SaicharanAnde) September 7, 2023 #MissShettyMrPolishetty Out and out proper rom com Good to see Anushka back. But the real dinosaur of the movie is @NaveenPolishety he literally outperformed everyone in the movie His comedy and emotional performance was terrific, He is the Rajendra Prasad of this generation. — sampathkumar (@Imsampathkumar) September 7, 2023 #MissShettyMrPolishetty Review: ⭐⭐⭐ Comedy is Good👍 Emotions reflected well on Screen 👍 Super First half and a Good 2nd Half Predictable at times But Overall Good movie ✅ Follow @Thyveiw for Genuine Reviews #Jawan pic.twitter.com/VmKKa7cxq8 — Thyview (@Thyveiw) September 7, 2023 -
మెగాస్టార్ ప్రశంసలే మాకు బిగ్ సక్సెస్: దర్శకుడు కామెంట్స్!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి'. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న థియేటర్లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో నవీన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్ బాబు ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి సినిమా చూసిన మెగాస్టార్ ప్రశంసలు కురిపించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: విజయ్-రష్మిక.. కొత్త విషయం బయటపడింది!) మహేశ్ బాబు మాట్లాడుతూ.. ' చిరంజీవి మాకు ఫోన్ చేశారు. మెగాస్టార్ ఫోన్ రావడంతో సంతోషంతో ఊగిపోయా. ఆయనను అభిమానించే వాళ్లం. మెగాస్టార్ ఫోన్ చేసి అభినందిస్తే ఎలా ఉంటుంది. మా సినిమా గురించి చిరంజీవి మాట్లాడటం సర్ ప్రైజ్ ఇచ్చింది. చిరంజీవి నాతో పాటు నవీన్‌ను ఇంటికి పిలిచి అభినందించారు. మెగాస్టార్ ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూయర్. ఆయన అభినందనలతో మాకు బిగ్ సక్సెస్ కొట్టిన ఫీలింగ్ కలిగింది. ' అని అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ..' కొత్త తరహా కథలు చేసేందుకు అనుష్క, నవీన్ లాంటి స్టార్స్ సిద్ధంగా ఉన్నందువల్లే మాలాంటి డైరెక్టర్స్ కథలు రాయగలుగుతున్నామని అన్నారు. ఈ సినిమా ఫన్ ఎమోషన్ కలిసి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందని తెలిపారు. సందేశాలు నేరుగా చెప్పడం లేదు.. కానీ కథలో ఆ మోరల్ కనిపిస్తుందన్నారు. శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ పేపర్లో చదివా.. ఆ రైమింగ్ తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశామని తెలిపారు. (ఇది చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్… pic.twitter.com/ADJVt6ins6 — Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2023 -
ప్రభాస్‌తో ఎప్పటికీ అలానే ఉంటాను: అనుష్క
ఐదేళ్ల తర్వాత అనుష్క వెండితెరపై కనిపించనున్నారు. ‘ఇక కెరీర్లో ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడూ తీసుకోను’ అంటున్నారామె. మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి ముఖ్య తారలుగా యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. రేపు (సెప్టెంబర్ 7) ఈ చిత్రం విడుదల కానుంది. ‘భాగమతి’ (2018) తర్వాత అనుష్క సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం ఇది. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనుష్క చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ‘మిస్ శెట్టి..’లో చేసిన షెఫ్ అన్విత క్యారెక్టర్ గురించి... షెఫ్ క్యారెక్టర్ చేయడం నాకు ఇదే తొలిసారి. ఇది నా బెస్ట్ మూవీలా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఐదున్నరేళ్ల థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఒక కొత్త పాత్ర, సరికొత్త కథాంశం ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ చిత్రంలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి. ట్రైలర్లో కామెడీ, ఎమోషన్ కనిపించాయి. మీరీ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఇవేనా? నేను కథకి ప్రాధాన్యత ఇస్తాను. నాకు, నిర్మాతలకు వినయ్‌గారు అని కామన్ ఫ్రెండ్ ఉన్నారు. మహేశ్ వద్ద ఒక స్టోరీ ఉంది వింటారా? అని అడిగారు.. అయితే సినిమా చేయమని కాదు. మహేశ్‌గారు కథ చెప్పాక అన్విత పాత్ర ఎవరు చేస్తున్నారు? అని అడిగాను. ఇంకా ఎవర్నీ అనుకోలేదని తను చెప్పగానే నేను చేస్తానన్నాను. మహేశ్ ఓ మంచి కథని కొత్తగా, క్లీన్ వేలో చూపించారు. క్లీన్ వే అన్నారు. ట్రైలర్లో ‘తల్లవ్వాలంటే గర్భవతి కావాలి కానీ పెళ్లక్కర్లేదు’ అనే డైలాగ్ చెప్పారు.. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్ అన్నది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. లైఫ్‌లో ఎలా ఉంటాం? మన మైండ్ ఎలా మాట్లాడుతుంది? అనేది చెప్పాం. మైండ్‌లో ఉన్నదాన్ని బయటకు చెబితే సమాజం ఒప్పుకోదు కదా? మన మైండ్ చాలా విషయాలు చెబుతుంది. కానీ, వాటిలోని సున్నితత్వాన్ని మనం అర్థం చేసుకొని మాట్లాడాలి. నా ఇష్టం వచ్చినది నేను చెబుతాను.. దాన్ని అర్థం చేసుకోకుంటే మీ సమస్య అనను. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని సరైన విధానంలో చెప్పాలి. అంతేకానీ, ఎదుటి వారు హర్ట్ అయ్యేలా చెప్పడం సరికాదని నమ్ముతాను. మన మైండ్‌లో ఉన్నదాన్ని చెప్పే పద్ధతిలో చెప్పాలి. 18 ఏళ్ల కెరీర్లో నటిగా మీ గ్రాఫ్ పెరిగింది. వ్యక్తిగతంగానూ పెద్దంత వివాదాలు లేకుండా సాగిన ఇన్నేళ్ల ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే.. యాక్చువల్లీ నేను కాంట్రవర్శీలను హ్యాండిల్ చేయలేను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. ఇలా నాలా సెన్సిటివ్‌గా ఉండేవాళ్లకు వేరేవాళ్ల ఎమోషన్స్ అర్థమవుతాయి. దాంతో హర్ట్ అయ్యేలా మాట్లాడలేం. నాకు ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి బోలెడంత ప్రేమ, గౌరవం దక్కాయి. అందుకే పెద్దగా వివాదాలు కూడా లేవు. అరుంధతి, దేవసేన (బాహుబలి), భాగమతి.. ఇలాంటి రేర్ క్యారెక్టర్స్ దక్కడం మీకో బ్లెస్సింగ్ అనొచ్చా.. కచ్చితంగా.. మనకి హార్డ్‌వర్క్ చేయాలని ఉన్నా రైట్ చాన్స్ కూడా రావాలంటాను. శ్యామ్‌గారు, కోడి రామకృష్ణగారు నన్ను ‘అరుంధతి’గా విజువలైజ్ చేసి, నమ్మి తీసుకున్నారు. దర్శక–నిర్మాతలు నన్ను నమ్మారు కాబట్టి నాకు హార్డ్ వర్క్ చేయడానికి చాన్స్ దొరికింది. నిరూపించుకునే స్కోప్ దక్కింది. ఈ మధ్య మీలో భక్తి భావం ఎక్కువయినట్టుంది.. పూజలు చేస్తున్నారు... ఆలయాలు సందర్శిస్తున్నారు.. ఇప్పుడనే కాదు.. నా చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంలో గుడికి వెళ్లడం ఒక భాగం. ప్రతి సోమవారం, శుక్రవారం పూజలు చేస్తుంటాం. అయితే కంటిన్యూస్‌గా సినిమాలు చేయడంవల్ల ఆ మధ్య గుడికి వెళ్లడానికి కుదరలేదు. ఈ మధ్య వచ్చిన లాంగ్ గ్యాప్‌లో వెళ్లడానికి కుదిరింది. పెళ్లి కాని అమ్మాయిలు పూజలు చేస్తే.. పెళ్లి కోసమే అనే చర్చ జరుగుతుంటుంది... మీ గురించి కూడా అలాంటి ఒక చర్చ ఉంది.. ఇప్పుడనే కాదు.. నేను గుడికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఒక మంచి విషయం ఏంటంటే.. నా కూతురి గురించి అందరూ ఇంత కేర్ తీసుకుంటారని మా అమ్మానాన్న ఆనందపడతారు (నవ్వుతూ). మరి.. పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారు? ఇప్పుడు ప్లాన్స్ లేవు. పెళ్లనేది మంచి విషయం కాబట్టి కుదిరినప్పుడు హ్యాపీగా షేర్ చేసుకుంటా. మీ కో–స్టార్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పుడు మీకు సంతోషం అనిపించడం సహజం... అలా పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి... ప్రభాస్‌గారు నాకు 2005 నుంచే తెలుసు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ స్థాయి గుర్తింపు వచ్చాక కూడా ప్రభాస్‌గారు అలానే ఉన్నారు. ఏ మార్పూ లేదు. తను నాకు ‘వెరీ వెరీ డియర్ ఫ్రెండ్’. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అలాగే రాజమౌళిగారి ఫ్యామిలీ కూడా నాకు క్లోజ్. భైరవ (కాలభైరవ)ని తన చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. తనకు మంచి (‘కొమురం భీముడో..’కి సింగర్‌గా నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని ఉద్దేశించి) గుర్తింపు రావడం హ్యాపీగా ఉంది. మనకు క్లోజ్‌గా ఉన్నవాళ్లు ఎదుగుతుంటే చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది. -
పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!
స్వీట్ అనుష్క శెట్టి పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే దాదాపు 18 ఏళ్లుగా ఇక్కడే సినిమాలు చేస్తోందిగా. అలానే 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. అయితే 40 ఏళ్ల వయసు దాటిపోయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. గతంలో పలు రూమర్స్ వచ్చాయి తప్ప అవి నిజం కాలేదు. ఇప్పుడు మాత్రం స్వయంగా అనుష్కనే తన మ్యారేజ్ గురించి మాట్లాడింది. త్వరలో గుడ్‌న్యూస్ వినే ఛాన్స్ ఉందనేలా కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!) 'బాహుబలి' తర్వాత హీరోయిన్గా పాన్ ఇండియా హోదా సంపాదించిన అనుష్క.. 'సైజ్ జీరో' సినిమాతో లావుగా మారి ప్రయోగం చేసింది. ఆ మూవీ ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గలేకపోయింది. దీంతో ఒకటి అరా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగులో ఆమె చేసిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. సెప్టెంబరు 7న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి బయటపెట్టింది. 'పెళ్లిపై నాకు నమ్మకం ఉంది. అయ. అయితే వివాహానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం అయితే కాదు. టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను' అని అనుష్క చెప్పింది. దీంతో అందరి కళ్లు ప్రభాస్‌పై పడ్డాయి. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేశారు. దీంతో ప్రభాస్-అనుష్క మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందన్నారు. కానీ తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ అని చాలాసార్లు చెబుతూ వచ్చారు. అయితే వీళ్లిద్దరూ ఇప్పటికీ సింగిల్‌గా ఉన్నారు. దీంతో ప్రభాస్-అనుష్క ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారేమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత!) -
ఇవాళ బిగ్ బాస్ లో జరగబోయే సీన్స్ గురించి ముందే చెప్పిన నవీన్
-
జనాలు వస్తారా లేదా అని టెన్షన్ పడ్డా..
-
మా నమ్మకం మరింత పెరిగింది
‘‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ యునిక్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మా సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే చిత్రం విజయంపై నమ్మకం మరింత పెరిగింది. కృష్ణాష్టమి రోజు సినిమా రిలీజ్ అవుతోంది. కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, మా సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది’’ అని నవీన్ పొలిశెట్టి అన్నారు. మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘జాతి రత్నాలు’ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నచ్చింది. నా ΄ాత్రలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి. నాగార్జునగారికి మా ట్రైలర్ బాగా నచ్చింది. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి 15వ కంటెస్టెంట్‌గా వెళ్లాను’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్లో చూసింది 30 శాతం అనుకుంటే.. సినిమాలో 70 శాతం భావోద్వేగాలు, వినోదం ఉంటాయి’’ అన్నారు పి. మహేశ్‌బాబు. -
ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాల్లో నవీన్ పోలిశెట్ అభిమానులను కలిసి సందడి చేశారు. త్వరలోనే అమెరికాలోనూ సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నవీన్ పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నవీన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్‌కు ఎక్కువ టైం పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులే వల్ల మూవీ రిలీజ్ ఆలస్యమైంది. ఈ విషయంలో మన్నించాలని ప్రేక్షకులను కోరుతున్నా. మీరు చూపించే ప్రేమకు మంచి సినిమాను తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభవుతాయి.' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో స్టాండప్ కమెడియన్‌గా నవీన్, చెఫ్‌గా అనుష్క కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో ప్రమోషన్స్ నవీన్ పోలిశెట్టి అమెరికాలో కూడా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లనున్నారు. డల్లాస్‌లో ఈ నెల 6వ తేదీన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు. -
‘తగ్గేదేలే’ అంటున్న నవీన్ పోలిశెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా..
సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లనున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. నవీన్, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేశారు.తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మాటలు, పాటలతో, సినిమా విశేషాలతో ఆడియెన్స్ కు "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు అమెరికాలో కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మెరికాలోని డల్లాస్ లో ఈ నెల 6వ తేదీన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు. -
మాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అనుష్క శెట్టి.. ఆకట్టుకుంటోన్న గ్లింప్స్!
మలయాళ పరిశ్రమలో తొలి అడుగు వేశారు హీరోయిన్ అనుష్కా శెట్టి. దాదాపు ఇరవయ్యేళ్ల సుదీర్ఘ కెరీర్లో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తొలి మలయాళ సినిమా ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’. ఫ్యాంటసీ హారర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో జయసూర్య హీరోగా నటిస్తుండగా, రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో జయసూర్య (సెప్టెంబర్ 2) బర్త్ డే సందర్భంగా ‘కథనార్’ సినిమా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. వీడియోలో అనుష్క కనిపించకపోయినా, ఆమె పేరును కన్ఫార్మ్ చేశారు మేకర్స్. వాస్తవ ఘటనల ఆధారంగా కేరళలోని కడమట్టు ప్రాంతంలో గల ఓ చర్చి ఫాదర్ జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ చిత్రం పద్నాలుగు భాషల్లో విడుదల కానుందట. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా తొలి భాగం 2024లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ‘కథనార్’ గ్లింప్స్ వీడియోను బట్టి ఈ చిత్రంలో ‘అరుంధతి’ తరహా పాత్రను అనుష్క చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
సర్ప్రైజ్ న్యూస్.. మరో పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్ విడుదల
అరుంధతితో తిరుగులేని విజయాన్ని అందుకున్న అనుష్క… జేజెమ్మగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమా ఆమె సినీ జీవితానికే ఓ మలుపుగా చెప్పుకోవచ్చు.. ఆ తర్వాత బాహుబలి ఫ్రాంచైజ్‌తో ఆమెకు పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు దక్కింది. ఇలా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంది. కానీ సైజ్ జీరో సినిమా నుంచి చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) ఇదిలా ఉండగా అనుష్క శెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయింది. మలయాళ చిత్ర సీమ నుంచి వస్తున్న ఫాంటసీ హారర్ డ్రామా 'కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్' సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో జాతీయ అవార్డు అందుకున్న మలయాళ టాప్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు. (ఇదీ చదవండి: నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. కానీ ఆమె మరో హీరోతో .. : విజయ్ సేతుపతి) ఈ మూవీకి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మొత్తం 14 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం. వచ్చే ఏడాది (2024)లో పార్ట్-1 విడుదల కానుందని వెల్లడించారు. సుమారు రెండు నిమిషాల పాటు ఉన్న ఈ గ్లింప్స్ వెన్నులో వణుకు పుట్టించేలా విజువల్స్ ఉన్నాయి. -
అనుష్కతో హగ్స్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. తాజాగ నవీన్ పొలిశెట్టి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. షూటింగ్ ప్రారంభంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ పక్కన నటించడం అంత సులభం కాదని నవీన్ తెలిపాడు. దీంతో షూటింగ్ ప్రారంభంలో మొదటి 2 రోజులు కాస్త ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పాడు. ఆ తర్వాత నుంచి అనుష్క అందించిన ఎంకరేజ్‌మెంట్‌తో ఎలాంటి బెరుకు లేకుండా ఆమెతో కలిసిపోయానని చెప్పాడు. అలా షూటింగ్ మొత్తం సరదాగా సాగిపోయిందని గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమా వల్ల తామిద్దరం మంచి ఫ్రెడ్స్ అయ్యాం. సినిమాలో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని నవీన్ పేర్కొన్నాడు. అనుష్క లాంటి స్టార్ నటితో కలిసి నటించారు కదా ఆమె నుంచి ఏం నేర్చుకున్నారని యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనిపై వెంటనే స్పందించాడు నవీన్. అనుష్క నుంచి కౌగిలింతలు నేర్చుకున్నానని ఇలా చెప్పేశాడు. 'సెట్స్ లో అడుగుపెట్టగానే టెక్నీషియన్స్‌కు అనుష్క ఓ వెచ్చటి హగ్ ఇస్తుంది. కానీ అది ఎంతో అభిమానపూర్వకంగా మాత్రమే ఇచ్చే కౌగిలింత. ఆవిడ నుంచి నేను కూడా అలా హగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. అది మనలో ఎంతో పాజిటివ్‌ను ఇస్తుంది. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్లో ఇదొకటి.' అని ఆయన చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: అనిరుద్ గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్) తాజాగ విడుదలైన ట్రైలర్లో అనుష్కను చాలా తక్కువగా చూపించారని, సినిమాలో ఆమె చేసిన రచ్చ ఓ రేంజ్లో ఉంటుందని నవీన్ తెలిపాడు. అంతేకాకుండా ఆమె ఏ నటుడితోనైనా ఫర్ఫెక్ట్గా సింక్ అవుతుందని చెప్పాడు. -
తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ.. పెళ్లెందుకు?: అనుష్క!
జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్ అందుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మోస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేశ్ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా మరో అప్డేట్తో ముందుకొచ్చారు మేకర్స్. (ఇది చదవండి: 'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్‌పై సంచలన కామెంట్స్! ) తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా కనిపించనుండగా, అనుష్క చెఫ్‌గా నటించనుంది. ట్రైలర్ చూస్తే ఈ మూవీ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ చేసి స్టాండప్ కమెడియన్ ఎంటి? అనే అనుష్క డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. అ తర్వాత తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ.. పెళ్లేందుకు? అన్న అనుష్క డైలాగ్ అభిమానుల్లో ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెంచుతోంది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. The trailer of #MissShettyMrPolishetty is all set to work up your appetite for comedy and entertainment! #MSMPTrailer - https://t.co/UQfI6Xo6kZ Grand release on September 7th! #MSMPonSep7th @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @adityamusic @UV_Creations pic.twitter.com/LxhgRPHkp9 — UV Creations (@UV_Creations) August 21, 2023 -
మూడేళ్ల గ్యాప్, అయినా తగ్గేదేలే.. రెమ్యునరేషన్ డబుల్..
టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య సినిమాల స్పీడు తగ్గించేసింది. 2019లో చిరంజీవి సైరా సినిమాతో వెండితెరపై మెరిసింది స్వీటి. 2020లో నిశ్శబ్ధం అనే సినిమా చేసినా ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంటే అనుష్క సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి మూడేళ్లవుతోంది. చాలాకాలం తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. రెమ్యునరేషన్ డబుల్ గతంలో అనుష్క సినిమాకు మూడు కోట్ల మేర పారితోషికం తీసుకుంది. అయితే అది అప్పటి ముచ్చట అని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు తెలుస్తోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి చిత్రానికిగాను ఆమె ఆరు కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎంత సంపాదించమన్నది కాదు ముఖ్యం.. సినీ పరిశ్రమలో ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నామన్నదే ప్రధానం అనే మాటను నమ్ముతుంది స్వీటీ. డబ్బు కన్నా మనుషులే ముఖ్యం గతంలో ఈ పారితోషికం గురించి అనుష్క మాట్లాడుతూ.. 'ఒక నటి 100 చిత్రాల్లో నటించడం, కోట్లు సంపాదించడం, చాలా ఏళ్లు కథానాయకిగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం లాంటివి పెద్ద విషయాలు కావు.. కానీ ఎంతమంది ఫ్రెండ్స్‌కు సంపాదించుకున్నదే ముఖ్యం. డబ్బు ఆర్జించడం కంటే మంచి మనుషుల్ని సంపాదించడం గొప్ప విషయం. నాకు పారితోషికం ప్రధానం కాదు. మంచి కథా పాత్రలో నటించాలన్నదే నా కోరిక' అని పేర్కొంది. చదవండి: గ్లామర్ క్వీన్ మాలశ్రీ కూతుర్ని చూశారా? అందంలో అమ్మను మించిపోయేలా ఉందిగా! -
Miss Shetty Mr Polishetty : హే కృష్ణా... వస్తున్నాం
మా సినిమాని రిలీజ్ చేయడానికి మంచి తేదీ చెప్పు అంటూ జ్యోతిష్కుడు మహేశ్ దగ్గరికి వెళ్లాడు పొలిశెట్టి. ఓ 70, 80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకో అని మహేశ్ అంటే... ‘హే కృష్ణా’ అంటూ ఉట్టి కొట్టి కృష్ణాష్టమికి రిలీజ్ చేసుకుంటాం అంటాడు పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్ బాబు పి. దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్లీ కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించే వీడియోను సోమవారం విడుదల చేశారు. నవీన్ పొలిశెట్టి, మహేశ్‌ల కామెడీతో సాగే ఈ ఫన్నీ వీడియో ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. -
అనుష్క శెట్టి తల్లిని చూశారా? ఎంత అందంగా ఉందో..
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులను కొత్తగా పరిచయం చేయాల్సిందేమి లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. అరుంధతి మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పటికీ అనుష్క అంటే అందరికి జేజమ్మ(అరుంధతిలో అనుష్క పాత్ర పేరు)గానే గుర్తుండిపోయింది. అంతలా తనదైన నటనతో ఆకట్టుకుంది అనుష్క. ఆ తర్వాత బాహుబలితో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. (చదవండి: గత కొన్నేళ్లుగా అనుష్కకు సరైన హిట్ పడలేదు కానీ అభిమానుల ప్రేమ మాత్రం చెక్కుచెదరలేదు. త్వరలోనే ఈ బ్యూటీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల పరంగా అనుష్క గురించి అందరికి తెలుగు కానీ ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ ఎవరీకి పెద్దగా తెలియదు. అనుష్క కూడా ఎక్కడా తన పర్సనల్ విషయాలను పెద్దగా షేర్ చేసుకోలేదు. కానీ తాజాగా తన తల్లి ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నిన్న(జులై 31) అనుష్క తల్లి పుట్టిన రోజు. ఈ సందర్భంగా తల్లి ప్రఫుల్ల శెట్టి ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే మా’ అని రాసుకొచ్చింది. అనుష్క చూడడానికి అచ్చం తల్లిలాగే ఉంది. ఇద్దరి నవ్వు కూడా ఒకేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ పై ఆమె అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) -
అనుష్క అభిమానులకు బ్యాడ్ న్యూస్
అనుష్క శెట్టి తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతుంది. నిశ్శబ్దం(2020) చిత్రం తర్వాత ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. త్వరలోనే ఆమె తెరపై కనిపించబోతున్నారని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విడుదల వాయిదా పడింది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. గతంలోనే చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ డేట్‌ని అనౌన్స్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. (చదవండి: ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్) పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా ఆగస్ట్ 4న విడుదల చేయడం లేదని, కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటనను విడుదల చేసింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నందుకు అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేసింది. ఈ చిత్రానికి పి.మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో చెఫ్‌గా అనుష్క, స్టాండప్ కమెడియన్‌గా నవీన్ పోలిశెట్టి నటించారు. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ట్రైలర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించే చాన్స్ ఉంది. We apologize from the bottom of our hearts for this unforeseen delays. We will soon be serving #MissShettyMrPolishetty, a comedic feast, with a side of laughter... Stay tuned for the New release date and trailer... pic.twitter.com/LpMbdrVTsm — UV Creations (@UV_Creations) July 29, 2023 -
ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ప్రభాస్- అనుష్క టాలీవుడ్ సినీ హిస్టరీలో వారిది హిట్ పెయిర్ అనే చెప్పవచ్చు. మిర్చి,బిల్లా,బాహుబలి సీరిస్‌లతో మెప్పించిన ఈ జోడి తెలుగు ప్రేక్షలపై చెరగని ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్‌కు చేరుకున్నాడు. అనుష్క మాత్రం జీరో సైజ్ సినిమా దెబ్బతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. తాజాగా అనుష్క.. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. త్వరలో ఆ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సినీ కెరీయర్‌కు ఫుల్స్టాప్ పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరోక అదిరిపోయే వార్త ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది. (ఇదీ చదవండి: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ) ప్రభాస్- అనుష్క కాంబోలో ఒక సినిమా రాబోతున్నుట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే మళ్లీ జోరందుకుంది. కానీ ఈసారి కొంచెం బలంగానే ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందట. ఇదే విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ మారుతి.. ప్రభాస్‌తో తను తెరకెక్కిస్తున్న సినిమాలో నటించాలని అనుష్కను కోరారట. అందులో ఆమెను హీరోయిన్గా కాకుండా సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం మారుతి అడిగారట. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా మారుతీదే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్‌తో డేర్ చేస్తున్న నిహారిక ) ఇదిలా ఉంటే.. అనుష్క- ప్రభాస్ కాంబోలో మరో పిరియాడికల్ సినిమా తీసేందుకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ కథను రెడీ చేశారట. ఇదే స్టోరీని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా ఆయన కథను వినిపించారట. వారికి స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ ప్రభాస్- అనుష్క జంటను బిగ్ స్క్రీన్‌పై వారిద్దరి ఫ్యాన్స్ చూడవచ్చు. ఒక విధంగా ప్రభాస్,అనుష్క ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. -
అనుష్క ఫ్యాన్స్ కి ఊహించని షాక్
-
అనుష్క సినిమా వాయిదా...పోలిశెట్టి రిలీజ్ కష్టాలు
-
అనుష్కను కోడలిగా చేసుకోవాలనుకున్న స్టార్ డైరెక్టర్..?
అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో విశేష గుర్తింపు ఆమె సొంతం. మంగళూరుకి చెందిన యోగా టీచర్ అయిన ఈమె 2005లో సూపర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో అందాలను ఆరబోసిన అనుష్క ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లో గ్లామరస్ పాత్రలకే పరిమితమయ్యారు. అలా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ కెరియర్ను అరుంధతి చిత్రం ఒక్కసారిగా మార్చేసింది. అందులో జేజమ్మగా తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నారు. ఆ తరువాత బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. అయితే సైజు జీరో చిత్రం అనుష్క నట జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసిందనే చెప్పాలి. అందులో పాత్ర కోసం అనుష్క బరువుని భారీగా పెంచేసుకుంది. ఆ తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కొన్ని సినిమాలు ఆమె చేయలేకపోయింది. చాలా గ్యాప్ తర్వాత నిశ్శబ్దం అనే చిత్రంతో వచ్చినా అది శబ్దం లేకుండానే వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు అనుష్క- నవీన్ పొలిశెట్టి కీలక పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: ‘బలగం' హీరోయిన్‌కి అవమానం!) ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో అనుష్కని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని భావించారట స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు. తమ కుమారుడిని పెళ్లి చేసుకుంటారా? అని డైరెక్ట్‌గా అనుష్కనే అడిగారట. అయితే అనుష్క మాత్రం రాఘవేంద్రరావు ప్రపోజల్‌ని సున్నితంగా తిరస్కరించారట. (చదవండి: అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది: ఆనంద్ దేవరకొండ) ఇదీ గతంలో జరిగిన విషయం అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. గతంలో తన కుమారుడు ప్రకాష్‌కు పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పడు రాఘవేంద్రరావు ఫస్ట్ చాయిస్ అనుష్కనే అనుకున్నారట. ఇదే విషయాన్ని డైరెక్ట్‌గా అనుష్కను అడిగితే... తను సున్నితంగా తిరష్కరించిందట. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేనట్లు అనుష్క చెప్పిందట. దీంతో 2014లో ముంబైకి చెందిన కనికతో ప్రకాష్‌కు పెళ్లి రాఘవేంద్రరావు జరిపించారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత 2017లో ఈ జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మళ్లీ అనుష్క వద్దకు పెళ్లి మ్యాటర్ గురించి చర్చించాలని భావించాడట. కానీ అప్పటికే పెళ్లికి నో చెప్పిన అనుష్క.. మళ్లీ తన అబ్బాయిని చేసుకునేందుకు ఒప్పుకుంటుందా అనే సందేహంతో రాఘవేంద్రరావు ఆగిపోయారట. -
అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టిల ‘లేడీ లక్’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రథన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘లేడీ లక్..’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని సోమవారం రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్ పాడారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. చెఫ్ అన్వితా రవళిగా అనుష్క, స్టాండప్ కమెడియన్ సిద్ధుగా నవీన్ పాత్రలు మనసులను హత్తుకునేలా ఉంటాయి. ‘లేడీ లక్..’ సాంగ్‌లో నవీన్ ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నీరవ్ షా. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. దీంతో తాజాగా ఆగస్టు 4న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను విడుదఅనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ల చేశారు మేకర్స్. చెఫ్ అన్విత రవళి శెట్టిపాత్రలో అనుష్కా శెట్టి, స్టాండప్ కమెడియన్ సిద్ధుపాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపిస్తారు. ఈ సినిమాకు సంగీతం: రధఅనుష్కా శెట్టి, నవీ¯Œ ΄÷లిశెట్టి ్రç . -
హతవిధి.. ధనుష్ వాయిస్‌లో ఉన్న మ్యాజిక్కే వేరు!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్‌కు మంచి స్పందన లభించింది. బుధవారం ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను హీరో ధనుష్ పాడడం విశేషం. ధనుష్ గతంలో కూడా ఎన్నో సాంగ్స్ పాడి అలరించాడు. అందుకే సింగర్‌గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన పాడిన కొలవరి డి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు తన గాత్రంతో హతవిధి సాంగ్‌కు మరింత వన్నె తెచ్చాడీ హీరో. నవీన్ పొలిశెట్టి నిస్పృహతో అరిచే వాయిస్‌తో ఈ పాట మొదలవుతుంది. హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే ఆ చిలక కూడా పారిపోతుంది. అలా తన లైఫ్‌లో ఏది గొప్పగా చేయాలనుకున్నా అది అనుకున్నట్టు జరగకపోవడం అనే కాన్సెప్ట్‌తో సాంగ్ కొనసాగుతుంది. అంతేకాదు తనకు ఎదురవుతున్న సంఘటనల వల్ల హీరో ఎంత నిరుత్సాహానికి లోనవుతాడనే విషయాన్ని దర్శకుడు ఈ పాటలో స్పష్టంగా చూపించాడు. లిరిక్స్ విషయానికి వస్తే 'బుల్లిచీమ బతుకుపై... బుల్డోజరైందాయ్' అనే పంచులతో మిస్టర్ శెట్టి జీవితాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఈ పాట. ఇంత మంచి లిరిక్స్‌ను రామజోగయ్య శాస్త్రి అందించడం విశేషం. ధనుష్ గొంతు, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌తో పాటు సంగీత దర్శకుడు రధన్ మ్యూజిక్ ఈ సాంగ్‌ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. చదవండి: చాతిపై పవర్ స్టార్ పచ్చబొట్టు -
అట్టు అనుష్క ఇటు కృతి సనన్... నారీ నారీ నడుమ ప్రభాస్
-
ప్రభాస్‌ను అనుష్క ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
టాలీవుడ్లో ప్రభాస్-అనుష్కల జోడీకి సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఉంది. ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా, ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఎప్పటినుంచో ప్రభాస్-అనుష్కలు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. చదవండి: 'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ్మత్తలా ఉందే! కానీ అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం ఫ్రెండ్స్ అని అనుష్క, ప్రభాస్‌లో క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం వీళ్లు రియల్ లైఫ్ కపుల్ అయితే బాగుండని కోరుకుంటారు. ఇక తాజాగా మరోసారి ప్రభాస్-అనుష్కల రిలేషన్‌షిప్‌పై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏమైందంటే.. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. దీన్ని ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. టీజర్ చాలా బావుందంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై అనుష్క స్పందిస్తూ.. థ్యాంక్యూ 'పప్సు' అంటూ కామెంట్ చేసింది. ఈ స్టోరీని స్క్రీన్ షాట్ చేసిన పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చదవండి: వారికి ఇష్టమైనప్పుడు.. మనం ఏం చేయగలం: కంగనా -
'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' టీజర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ
జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్ అందుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను అనౌన్స్ చేసి చాలాకాలమే అయినా ఇడేట్ప్పటివరకు ఇలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ సినిమా టీజర్‌ను వదిలారు మేకర్స్. ఇందులో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా కనిపించనుండగా, అనుష్క చెఫ్‌గా నటించనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసుందేకు మేకర్స్ రెడీ అవుతున్నారు. -
Anushka Shetty: బొద్దుగా మారిన అనుష్క.. కారణం ఇదేనా?
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చాలా మంది రాణిస్తారు. వీరిలో కొంత మంది బ్యూటీస్ మాత్రమే ప్రయోగాలు చేయటానికి ఇష్టపడతారు. వారిలో అనుష్క ఒకరు. అనుష్క అందం అభినయం కలిసిన నటి. సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అనుష్క...తన అందంతోనే కాదు..అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుష్క నటనకే కాదు..గ్లామర్ కు కూడా ప్యాన్స్ ఉన్నారు. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తనయుడు, కె.ప్రకాష్ దర్శకత్వంలో అనుష్క సైజ్ జీరో సినిమాలో నటించింది. సైజ్ జీరో ముందు వరకు అనుష్క చాలా స్లిమ్ గా ఉండేది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నార్మల్ లుక్ లోనే కనిపించింది. సైజ్ జీరో కోసం అనుష్క చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అనుష్క వెయిట్ కంట్రోల్ తప్పింది. ఆ సినిమా కోసం అనుష్క కావాలని విపరీతంగా బరువు పెరిగింది. రాజమౌళి వద్దని చెప్పిన వినకుండా ఆ సినిమాలో నటించింది అనుష్క. ఆ సినిమా మీద నమ్మకంతో బాగా లావుగా మారిపోయింది. అనుష్క నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తన యోగా పద్దతులు ద్వారా స్లిమ్ కావచ్చు అనుకున్న అనుష్క ప్రయత్నం సక్సెస్ కాలేదు. అనవసరంగా అనుష్క సైజ్ జీరో చేసిందనే కామెంట్స్ ఎక్కువైయ్యాయి.ఇక బాహుబలి 2 కోసం అనుష్క వెయిట్ లాస్ అవ్వటానికి ఎంత ట్రై చేసిన నార్మల్ లుక్ లోకి రాలేకపోయింది. దీంతో రాజమౌళి గ్రాఫిక్స్ తో ఏదో మ్యానేజ్ చేశాడు. బాహుబలి 2 తర్వాత నటించిన భాగమతి, నిశ్శబ్దం సినిమాలో అనుష్క లావుగానే కనిపించింది. నిశ్శబ్దం తర్వాత అనుష్క ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో అందరూ అనుష్క స్లిమ్ కావటం కోసం గ్యాప్ తీసుకుందనుకున్నారు. ఇక అనుష్క కూడా అమెరికా లో వెయిట్ లాస్ అయ్యేందుకు ట్రై చేసింది. కానీ ఎలాంటి రిజల్ట్ అనుష్క కి అవి ఇవ్వలేదని..ఈ మధ్య కర్ణాటకలోని ఓ ఆలయంలో కనిపించిన అనుష్క చూస్తే అర్ధమౌతుంది. ఇక సోషల్ మీడియా లో బాగా బొద్దుగా మారిన అనుష్క వీడియో వైరల్ అయింది. అయితే అనుష్క ఇంతలా వెయిట్ పెరగడానికి కారణం థైరాయిడ్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.. అందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం అనుష్కనే తేల్చాలి. ఇక అనుష్క బొద్దుగా మారటంపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అనుష్కకి సినిమాల్లో నటించే ఆలోచన లేదని..అందుకే ఫిట్ నెస్ విషయం పట్టించుకోవటం లేదంటూ డిస్కషన్ చేస్తున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అనుష్క ఇలా లావు కనిపించటం వెనుక రీజన్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనుష్క..యూవీ క్రియేషన్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసమే అనుష్క లావు అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి మూవీ పోస్టర్ అండ్ లిరికల్ సాంగ్ లో అనుష్క అంత బొద్దుగా కనిపించలేదు. అయితే ఈ సినిమా విషయంలో కూడా అనుష్క లావుగా కనిపించకుండా ఉండేందుకు గ్రాఫిక్స్ వాడారనే మాట టీటౌన్ లో వినిపిస్తోంది. ఇక అనుష్క ఫ్యాన్స్ మాత్రం స్వీటీ మళ్లీ నార్మల్ లుక్ లో రావాలనుకుంటున్నారు.కానీ ఫ్యాన్స్ కల నిజం అయ్యేలా లేదు. ఎందుకంటే ప్రసస్తుతం అనుష్క వయస్సు నాలుగు పదులు దాటేసింది. ఏజ్ పరంగా చూసుకున్న అనుష్క నార్మల్ లుక్ లోకి..ఫ్యాన్స్ కోరుకున్న విధంగా తయారు కావాలంటే కొంచెం కష్టమే. కానీ అనుష్క కి సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఎంత రిస్క్ అయినా చేస్తుంది. అందుకే సైజ్ జీర్ చేసింది. ఆ సినిమా మీద ప్రేమే మళ్లీ అనుష్క ను స్లిమ్ గా మార్చేలా చేస్తుందేమో చూడాలి. -
అనుష్క, నవీన్ పొలిశెట్టి మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ అవుట్
హీరోయిన్ అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. యు.వి.క్రియేషన్స్ పతాకంపై ‘రారా కృష్ణయ్య ఫేం’ పి మహేశ్ బాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ మూవీ టైటిల్‌ను ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’గా ఖరారు చేశారు. ఈ సందర్భంగా, అనుష్క, నవీన్ పొలిశెట్టిల లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్‌గా నవీన్, అన్విత రవళి శెట్టి అనే చెఫ్‌గా అనుష్క నటించనున్నారు. కాగా ఈ సమ్మర్‌కు తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిశ్శబ్దం తర్వాత అనుష్క, జాతిరత్నాలు తర్వాత నవీన్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తున్నాడు. Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩 Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz — UV Creations (@UV_Creations) March 1, 2023 -
Anushka Latest Photos: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అనుష్క శెట్టి.. ఎందుకో తెలుసా?
-
మరోసారి ఆ డైరెక్టర్‌కు అనుష్క గ్రీన్ సిగ్నల్?
అందానికి ప్రతిరూపం నటి అనుష్క. ఈ బెంగళూరు బ్యూటీ తొలి రోజుల్లో యోగా టీచర్ అన్నది తెలిసిందే. ఆ తరువాత సూపర్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు కథానాయకిగా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ప్రత్యేకతను చాటుకున్న ఈ భామ ఆదిలో అందాలారబోతకే పరిమితమైంది. అరుంధతి చిత్రంతో తనలోని నటనను నిరూపించుకున్నారు. ఆ తరువాత వరుసగా హీరోయిన్‌కు ప్రాముఖ్యత కలిగిన పాత్రలు రావడం మొదలెట్టాయి. అలా నటించిన చిత్రాలే రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి భారీ చిత్రాలు. చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? అలా అగ్రనటిగా రాణించిన అనుష్క కోలీవుడ్‌కు రెండు చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోనూ తన అందాలతో యువతను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దైవ తిరుమగళ్, సింగం వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటిది ఇంజి ఇడుప్పళగి చిత్రంలో పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఫలితం శూన్యం. దీంతో చాలా కాలం నటనకు దూరం అయ్యారు. ఆ మధ్య తెలుగులో నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగినా, అది ఏ స్టేజీలో ఉందో తెలియని పరిస్థితి. కాగా అనుష్క మరింత లావెక్కిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క మళ్లీ కోలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకు ముందు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో దైవతిరుమగళ్ చిత్రంలో నటించారు. కాగా మరోసారి అనుష్కతో చిత్రం చేయడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ కొందరు దర్శకులు అనుష్కతో చిత్రాలు చేయడానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం తన బరువే అంటూ ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు విజయ్ దర్శకత్వంలో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు లావుగా ఉన్న తనను గ్రాఫిక్స్ ద్వారా సన్నగా చూపించడానికి ఈ దర్శకుడు అంగీకరించినట్లు, అందుకే అనుష్క ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. -
అనుష్కతో నవీన్ పొలిశెట్టి ప్రేమాయణం..?
-
అనుష్క శెట్టికి ఏమైంది? ఇలా మారిపోయింది.. ఫోటోలు వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సినిమా ఫంక్షన్లు సహా సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. బాహుబలి లాంటి అద్భుతమైన విజయం తర్వాత ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుందనుకున్నారు. కానీ చాలా రోజులుగా అనుష్క బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క బయట కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందులో అనుష్క కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నవీన్ పొలిశెట్టికి జోడీగా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. -
అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ
వెండితెరపై తమ అందం, గ్లామర్‌తో ఆకట్టుకుంటునే భామలు వ్యక్తిగతంగా పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత, మమత మోహన్ దాస్, శృతి హాసన్‌తో సహా పలువురు నటీనటులు ఉన్నారు. ఇటీవల మయెసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డ సామ్ ప్రస్తుతం కోలుకుంది.మయోసైటిస్‌తో బాధపడుతున్నానని సమంత వెల్లడించడంతో పలువురు నటీనటులు, హీరోయిన్లు కూడా బయటకు వచ్చి తమ వ్యాధిని బయటపెట్టారు. చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే.. తాజాగా స్వీటీ అనుష్క కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె తాను బాధపడుతున్న అరుదైన వ్యాధి గురించి బయటపెట్టింది. తనకు నవ్వే జబ్బు ఉందంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అది పెద్ద సమస్య కానప్పటికి తాను నవ్వడం స్టార్ట్ చేస్తే 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటానని చెప్పింది. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ ‘నవ్వించే సంఘటన వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. నవ్వుని అసలు కంట్రోల్ చేసుకోలేను. ఇక సెట్లో నేను నవ్వడం స్టార్ట్ చేస్తే షూటింగ్ ఆపేసుకోవాల్సిందే. దాదాపు 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. ఈ గ్యాప్‌లో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకుని వస్తారు’ అని అంటూ తన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అనుష్క మైత్రి మూవీ ప్రొడక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
‘గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది’ అంటున్నస్టార్ హీరోయిన్స్
ఏడేళ్ల తర్వాత తెలుగుకి వచ్చారు కృతీ సనన్.. దిశా పటానీ. మూడేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు కియారా అద్వానీ.. మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు అనుష్క. ఇరవైరెండేళ్ల తర్వాత హిందీ సినిమా చేశారు జ్యోతిక.. ఎందుకీ గ్యాప్ అంటే.. వేరే భాషల్లో సినిమాలు చేయడంవల్ల, వేరే కారణాల వల్ల అన్నమాట.అంతేకానీ కావాలని ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’. ఇక తెలుగు, హిందీలో గ్యాప్ తర్వాత ఈ స్టార్స్ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం... ‘జియా జలే...’ అంటూ వరుణ్ తేజ్‌తో కలిసి ‘లోఫర్’లో చాలా హాట్ హాట్‌గా స్టెప్పులేసిన దిశా పఠానీ గుర్తుందా? తెలుగులో తనకు ఇదే తొలి చిత్రం. ఆ మాటకొస్తే.. హీరోయిన్‌గానే మొదటి సినిమా. 2015లో ఈ సినిమా వచి్చంది. ఆ తర్వాత ఈ నార్త్ బ్యూటీ హిందీ పరిశ్రమకు వెళ్లి మళ్లీ తెలుగువైపు చూడలేదు. ఈ ఏడేళ్లల్లో అక్కడ సినిమాలు చేస్తూ వచి్చన దిశా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ‘΄ాజెక్ట్ కె’. ప్రభాస్ హీరోగా నాగ్ అశి్వన్ దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ΄ాన్ ఇండియా సినిమా ద్వారా దిశా గ్రాండ్‌గా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. దిశాలానే కృతీ సనన్ కూడా పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్‌తో తెలుగు తెరపై గ్రాండ్ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే దిశాలానే ప్రభాస్ సరసన కనిపించనున్నారు. ఆ బ్యూటీలానే కృతీ కూడా ఏడేళ్లకు తెలుగుకి వస్తున్నారు. మహేశ్‌బాబు సరసన ‘1 నేనొక్కడినే’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి ఆ తర్వాత నాగచైతన్య సరసన ‘దోచేయ్’ (2015) చేశారు. మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక ‘ఆదిపురు‹Ù’ విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీతగా కృతీ సనన్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక హిందీ చిత్రం ‘ఫగ్లీ’ (2014) ద్వారా హీరోయిన్గా పరిచయ మైన కియారా అద్వానీ ఆ తర్వాత నాలుగేళ్లకు తెలుగు తెరపై మెరిశారు. మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్‌చరణ్ సరసన ‘వినయ విధేమ రామ’ (2019)లో నటించారు. హిందీ చిత్రాలు చేస్తూ వస్తున్న కియారా కొంత గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ రామ్‌చరణ్ సరసనే కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో కియారా కథానాయికగా నటిస్తున్నారు. దిశా, కృతీలానే ఈ బ్యూటీ కూడా గ్రాండ్‌గా పాన్ ఇండియా మూవీతో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ ముగ్గురూ పాన్ ఇండియా సినిమాల ద్వారా మళ్లీ తెలుగులో కనిపించనుండటం వారికే కాదు.. వారి ఫ్యాన్స్‌కి కూడా ఆనందంగా ఉంటుంది. నిశ్శబ్దంగా... అనుష్క రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా తెరపై కనిపించారు. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ చిత్రంలో బదిరురాలు (మూగ, చెవిటి) పాత్ర చేశారు అనుష్క. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంతకుముందు 2019లో చిరంజీవి నటించిన ‘సైరా’లో వెండితెరపై కనిపించారు అనుష్క. సో.. సిల్వర్ స్క్రీన్‌పై ఈ బ్యూటీ కనిపించి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు అనుష్క. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరో. మహేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. పెద్ద అప్డేట్స్ ఏవీ ఇవ్వకుండా ఈ చిత్రం షూటింగ్‌ని నిశ్శబ్దంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇరవైరెండేళ్లకు హిందీలో... హిందీ చిత్రం ‘డోలీ సజా కే రఖ్నా’ (1998)తో తన కెరీర్‌ను ప్రారంభించారు జ్యోతిక. ఆ తర్వాత ‘వాలీ’ సినిమాతో తమిళ్‌కి పరిచయమై, వరుసగా తమిళ్, తెలుగు.. ఇలా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా బిజీ అయ్యారు. హీరో స్యూరని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయ్యాక కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె. 2009 నుంచి 2014 వరకూ సినిమాలు చేయలేదు. 2015లో ‘36 వయదినిలే’తో రీ–ఎంట్రీ ఇచ్చి, లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇక జ్యోతిక చివరిగా హిందీ తెరపై కనిపించిన సినిమా ‘లిటిల్ జాన్’ (2001). ఇన్నేళ్ల తర్వాత ఆమె ఆ మధ్య హిందీ సినిమా ‘శ్రీ’ అంగీకరించారు. రాజ్‌కుమార్ రావ్ హీరోగా తుషార్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘శ్రీ’లో నా ΄ాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. భారమైన హృదయంతో ఈ యూనిట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు జ్యోతిక. -
హీరోయిన్ అనుష్క పేరు చెప్పి రూ.51 లక్షలు మోసం!
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పలానా హీరో, హీరోయిన్ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని, సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటూ పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.51లక్షలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనుష్క, మణిశర్మలతో అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటూ మేనేజర్ ఎల్లారెడ్డి.. విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, వర్ధమాన నిర్మాత లక్ష్మన్ చారీ నుంచి రూ. 51 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనుష్కతో సినిమా డేట్స్ అంటూ నిర్మాతను పలు మార్లు బెంగళూరు తీసుకెళ్ళిన ఎల్లారెడ్డి.. మొదటగా రూ.26 లక్షలు వసూలు, తర్వాత మణిశర్మ పేరు చెప్పి మరికొన్ని డబ్బులు.. మొత్తంగా రూ.51 లక్షలు వసూలు చేసి అపాయింట్మెంట్ ఇప్పించలేదు. ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానని గుర్తించిన లక్ష్మణాచారి.. ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు. దీంతో మొదట డబ్బు వెనక్కి ఇస్తా అని చెప్పిన మేనేజర్, తరువాత తిరగపడ్డాడు.డబ్బులు అడిగితే ఇంట్లోని ఆడవాళ్లతో కేసులు పెట్టిస్తాని బెదిరించాడు. చివరకు చేసేదేమి లేక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
2023: నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల జాతర.. అన్ని భారీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్సే
ఓటీటీలో ఈ ఏడాది కొత్త సినిమాల జాతర నెలకొననుంది. థియేటర్లో సంక్రాంతి పండుగ సందడి ఉండగానే.. ఓటీటీలో కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ సంక్రాంతికి డిజిటల్ ప్రియులను ఆకర్షించే పనిలో పడింది. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అనంతరం ప్రకటన ఇచ్చే నెట్‌ఫ్లిక్స్ ఈసారి థియేట్రికల్ రిలీజ్‌కు ముందే కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తోంది. చదవండి: Priyanka Jawalkar: పవన్ కల్యాణ్‌తో అసలు నటించను! ఎందుకంటే.. సంక్రాంతి సంందర్భంగా తెలుగులో రాబోయే స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేసింది. వాటిలో భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని రిలీజ్‌కు సిద్దంగా ఉండగా.. మరికొన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. అవేంటంటే చిరంజీవి భోళా శంకర్, మహేశ్ బాబు ఎస్ఎస్ఎమ్బి 28, వరుణ్ తేజ్ వీటీ 12, అనుష్క ప్రోడక్షన్ నెం. 14, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, నాని దసరా, డీజే టిల్లు 2 ఇంకా ఎన్నో కొత్త ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన ఇక విడుదలైన 18 పేజెస్, ధమాకా చిత్రాలు కూడా త్వరలో ఇక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి. ఒక్క తెలుగు సినిమాలే కాదు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలను కూడా వరుసగా ప్రకటిస్తోంది. అందులో అయినప్పుడు అతి తర్వలో మీ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే చిత్రాలు ఇవే అంటూనే థియేట్రికల్ రిలీజ్ అనంతరమే అని స్పష్టం చేసింది. నెట్‌ఫ్లిక్స్ జోరు చూస్తుంటే ఈ ఏడాది సినీ ప్రియులకు సినిమాల జాతర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ చిత్రాలేవో చూద్దాం! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
హైలైట్‌గా నిలిచిన ప్రభాస్-చరణ్ ఫోన్‌కాల్.. డార్లింగ్ పెళ్లిపై హింట్
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎపిసోడ్‌తో మరింత సూపర్ హిట్‌గా నిలిచింది షో. దేశవ్యాప్తంగా ఈ ఎపిసోడ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ ఎపిసోడ్‌లోని పార్ట్-1 ఇప్పటికే స్ట్రీమింగ్ అయ్యింది. ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా నిలిచిన ఈ ఎపిసోడ్లో రామ్‌చరణ్‌కు ప్రభాస్ కాల్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఇదే క్రమంలో ప్రభాస్‌ని ఆటపట్టించిన రామ్ చరణ్ త్వరలోనే డార్లింగ్ మీ అందరికి గుడ్‌న్యూస్ చెబుతాడంటూ హింట్ ఇచ్చాడు. దీంతో అంతలోనే అందుకున్న బాలకృష్ణ.. ఆ అమ్మాయి చౌదరినా లేక శెట్టినా, లేక సనన్ హా? అంటూ ఇరికించే ప్రయత్నం చేయగా అది తాను చెప్పలేనని మీకే ఊహించుకోండంటూ క్లూ వదిలాడు. దీంతో ‘రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్ డార్లింగ్’ నువ్వు నా ఫ్రెండువా ? శత్రువా ?అంటూ ప్రభాస్ ఫన్నీగా బదులిచ్చాడు. ఇక ఎప్పుడూ బయట కలిసి కనిపించని.. ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న ఇంతలా బండింగ్ ఉందా? ఇద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటున్నారంటూ వారి మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. Charan and prabhas phone call#RamCharan#Prabhas pic.twitter.com/RsOzTX1VqV — Ra_1 (@MahiCharan31) December 29, 2022 Mari intha close a #RamCharan and #Prabhas 😳 pic.twitter.com/OyBVV5HNew — Teja (@tejarebel10) December 29, 2022 -
‘కాంతార’ భూత కోల నృత్యం వేడుకలో అనుష్క సందడి, వీడియో వైరల్
ఇటీవల దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగిన పేరు కాంతార. కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ప్రాంతీయ సినిమాగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400కోట్ల కలెక్షన్ల రాబట్టింది. కన్నడ సంస్కృతి భూత కోల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చదవండి: విన్నింగ్ ప్రైజ్‌మనీతో పాటు రేవంత్ 15 వారాల పారితోషికం ఎంతంటే! దీంతో సాంప్రదాయ నృత్యం భూత కోల వేడుక దేశవ్యాప్తంగా ఆసక్తిని సంతరించుకుంది. ఈ సంస్కృతిని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిని చూపారు. ఈ నేపథ్యంలో భూత కోల నృత్యానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రీసెంట్గా ప్రముఖ హీరోయిన్, ‘స్వీటీ’ అనుష్క శెట్టి ఈ భూత కోల వేడుకలో పాల్గొని సందడి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారి ఆశీర్వదం తీసుకుంది అనుష్క. ఈ సందర్భంగా స్వీటీ ఈ వేడుకను తన ఫోన్ కెమెరాలలో వీడియో తీస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియోను ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. చదవండి: అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి Another glimpse of Sweety attending Boothakola Festival in her home town ❤️❤️✨✨#AnushkaShetty #Sweety #Anushka48 pic.twitter.com/XvwIXTnjha — PRANUSHKA FANCLUB 🌸❤️ (@pranushka_fan) December 18, 2022 -
లండన్‌కు వెళ్లనున్న అనుష్క..10 రోజుల అక్కడే..కారణం ఇదే
టాలీవుడ్లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దేవసేనకు.. హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2005లో సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ అయింది. అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. . యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తుంది. ఇదిలా ఉంటే అనుష్క ఇప్పుడు లండన్ వెళ్లేందుకు సిద్దమతుందని సమాచారం. అయితే ఇది హాలీడే ట్రిప్ కాదట.. నవీన్ పొలిశెటి సినిమా షూటింగ్ కోసం ఆమె లండన్ వెళ్తున్నారు. దాదాపు పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో అనుష్క, నవీన్ పొలిశెట్టిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. లండన్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో కొన్ని కీలకమైన సీన్స్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ ఎండ్లోగా షూటింగ్‌ను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు. (చదవండి: స్వీటీకి అనుష్క పేరు ఎలా వచ్చిందో తెలుసా?) -
అలా లెక్కలేసుకుని నేను ఇండస్ట్రీకి రాలేదు: అనుష్క శెట్టి
అందానికి, అభినయానికి చిరునామా నటి అనుష్క అని చెప్పవచ్చు. టాలీవుడ్లో సూపర్ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె నట పయనం సూపర్ ఎక్స్‌ప్రెస్‌లా సాగిపోయింది. అందులో ఎన్నో విజయాలు, అగ్రనటిగా అందలం ఎక్కిన తరుణాలు.. కొన్ని తప్పటడుగులు వెరసి అనుష్క 17 వసంతా ల సినీ జీవితం. టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో క్రేజీ కథానాయకిగా రాణించిన అనుష్క చివరిగా నటించిన చిత్రం సైలెన్స్. ఆ చిత్రం నిరాశపరిచింది. ఇకపోతే ఇడుప్పళగి చిత్రం కోసం భారీగా బరువును పెంచుకున్న అనుష్కకు అది కేరీర్ పరంగా బాగా ఎఫెక్ట్ అయింది. చదవండి: ‘ఈ యంగ్ హీరోల తీరు వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి’ కారణాలు ఏమైనా ఈ బొమ్మాళి వెండితెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. మళ్లీ ఎప్పుడు తెరపై మెరుస్తుందా? అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తీపి కబురు అనుష్క తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటిస్తోంది. యువ నటుడు నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అనుష్క లేడీ చెఫ్‌గా నటించడం విశేషం. ఈ పాత్రను సోమవారం మీడియాకు రిలీజ్ చేశారు. కాగా 17 ఏళ్ల పయనాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నటి అనుష్క ఒక భేటీలో పేర్కొంటూ ఇన్నేళ్లు హీరోయిన్గా రాణించడం సంతోషంగా ఉందని చెప్పింది. పలువురు దీన్ని చిరకాల పయనం అని అంటున్నారని, అయితే తనవరకు ఇది చాలా చిన్నపయనమని పేర్కొంది. బాగా శ్రమిస్తే కథానాయికలు సినిమా రంగంలో ఎక్కువకాలం నిలదొక్కుకోవడం సాధ్యమేనంది. ఆ నమ్మకంతోనే తాను ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చానంది. చాలామంది మాదిరిగానే తాను ఈ రంగంలోకి అనుహ్యంగా ప్రవేశించానని చెప్పింది. అంతకుముందు తనకు సినిమా గురించి ఏమి తెలియదని చెప్పింది. మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నిల్చున్నప్పుడు భయపడ్డానంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే తనకు ఫలానా హీరోతో నటించాలని ఫలానా పాత్రలో నటించాలని లెక్కలేసుకోవడం తన పాలసీ కాదని చెప్పింది. మంచి కథ ఉన్న పాత్రలు చేయాలని మాత్రమే ఆశించానంది. తాను చాలా చిత్రాల్లో నటించినా, అరుంధతి చిత్రమే నెంబర్ వన్ అని పేర్కొంది. ఏనాటికైనా అలాంటి కథా పాత్రల్లో నటించడం చాలెంజ్ అని చెప్పింది. తాను ఈ రంగానికి రాకముందు యోగా టీచర్‌గా పనిచేసిన విషయం చాలా మందికి తెలుసని, అయితే అంతకుముందు పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పానన్న విషయం అతి కొద్దిమందికే తెలుసని పేర్కొంది. -
చెఫ్‌గా మారిపోయిన హీరోయిన్ అనుష్క.. ఫోటో వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి గరిట పట్టారు. తన వంటలను కస్ట్మర్స్కి రుచి చూపించేందుకు చెఫ్‌గా మారారు. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు.. ఆమె నటిస్తున్న తాజా చిత్రం కోసమే. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తున్నారు. కాగా సోమవారం (నవంబర్ 7) అనుష్క బర్త్‌డేని పురస్కరించు కుని అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘మా సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. On my Birthday I am happy to Introduce myself as Masterchef 'Anvitha Ravali Shetty' from my upcoming project with @NaveenPolishety #MaheshBabuP #NiravShah @UV_Creations 😊 Can’t wait to meet u all on Big Screen 🤞🏻❤️ pic.twitter.com/jsVFlTDwMM — Anushka Shetty (@MsAnushkaShetty) November 7, 2022 -
అరుంధతి మూవీలో బాలనటి.. అంతలా మారిపోతుందని ఊహించలేదు..!
టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అరుంధతి'. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా అనుష్క ఫేమస్ అయిపోయింది. అందరూ జేజమ్మ అంటూ ముద్దుగా పేరు పెట్టారు. అయితే ఈ సినిమాలో బాలనటిగా ఓ చిన్నారి అద్భుతంగా నటించింది. తన డైలాగులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఎవరా చిన్నారి అనుకుంటున్నారా? బాలనటిగా మెప్పించిన దివ్య నగేశ్ అందరినీ తనదైన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆ చిన్నారి ఇప్పుడెలా ఉంది? తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చదివేయండి. (చదవండి: కాంతార మూవీ.. అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరో తెలుసా?) చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి అగ్రతారలుగా ఎదిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. మరికొందరు ఒకటి, రెండు సినిమాలతోనే మర్చిపోలేని గుర్తింపును పొందారు. అలానే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి దివ్య నగేశ్ కూడా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం మలయాళంలో ఆమె పలు సినిమాలు కూడా చేసింది. టాలీవుడ్లో 'నేను నాన్న అబద్దం' అనే సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దివ్య నగేశ్. ఇటీవలే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అరుంధతి బాలనటి దివ్య నగేశ్. -
అనుష్కపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దీంతో గరికపాటి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. తాజాగా ఈ వివాదంపై సంచలన దర్శకుడు స్పందించాడు. గరికపాటి తీరుని తప్పుబడుతూ వరుస ట్వీట్స్ చేశాడు. అందులో ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గరికపాటి గతంలో అనుష్క అందం గురించి పొగుడుతున్న వీడియో క్లిప్పుని ఆర్టీజీవి ట్విటర్లో షేర్ చేస్తూ ‘మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!’అని క్యాప్షన్ ఇచ్చాడు. (చదవండి: రిలీజ్‌కు ముందే ఖరీదైన బహుమతి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? డైరెక్టర్ ట్వీట్ వైరల్) ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. ‘హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. అలా నిలబడి ఉంది.. ఒక మంచి పోజ్. మనం కవి కదా.. ఊరికే ఎలా ఉండగలం.. చూశా పై నుంచి కిందకు. ఒక రోజు పేపర్ చదువుతుంటే ముందు రాజకీయాలు చూస్తున్నా.. డిగ్రీ చదివే మా అబ్బాయి .. నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను.. స్నానం చేసొచ్చి నా కాళ్లకు దండం పెడుతున్నాడు అని, కానీ వాడు అక్కడ కూర్చొని పేపర్లోని అనుష్క ఫోటోని చూస్తున్నాడు. వాడి ధోరణిలో వాడున్నాడు.. నా ధోరణిలో నేనున్నాను. దానికేముంది ఎవడికి కావాల్సింది వాడు చూసుకుంటున్నాడు. ఏంట్రా అని అడిగితే టక్కుమని లేచి వెళ్లిపోయాడు. ఏంటా అని నేను చూశాను.. ఆ ఫోటో చూసేసరికి వాడు ఈ అమ్మాయిని చూడడంలో తప్పేమి లేదనిపించింది. నన్నే ఆకర్షిస్తుంటే.. వాడిని ఆకర్షించదా? ’అని గరికపాటి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! 😜 pic.twitter.com/00rLB4oVj7 — Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022 -
పెళ్లికి సిద్ధమవుతున్న అనుష్క?
సాక్షి, చెన్నై: అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో విశేష గుర్తింపు ఆమె సొంతం. మంగళూరుకి చెందిన యోగా టీచర్ అయిన ఈమె 2005లో సూపర్ చిత్రంతో నాగార్జునకు జంటగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో అందాలను ఆరబోసిన అనుష్క ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లో గ్లామరస్ పాత్రలకే పరిమితమయ్యారు. అదే సమయంలో తమిళంలోనూ రెండు అనే చిత్రంతో నటుడు మాధవన్‌కు జంటగా పరిచయం అయ్యారు. అలా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ కెరియర్ను అరుంధతి చిత్రం ఒక్కసారిగా మార్చేసింది. అందులో జేజమ్మగా తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నారు. ఆ తరువాత బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. అయితే సైజు జీరో చిత్రం అనుష్క నట జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసిందనే చెప్పాలి. అందులో పాత్ర కోసం అనుష్క బరువుని భారీగా పెంచేసుకుంది. ఆ తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సినిమా ఆమెను దాదాపు పక్కన పెట్టేసింది. అనుష్క చివరగా నటించిన చిత్రం నిశ్శబ్దం. అది ఎలాంటి శబ్దం లేకుండానే థియేటర్ల నుంచి నిష్క్రమించింది. నవీన్ పోలిశెట్టితో కలిసి చిత్రం జరుగుతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా, అది ఇప్పటి వరకు సెట్‌పైకి రాలేదు. మధ్యలో ప్రభాస్‌తో ప్రేమాయణం అంటూ వార్తలు గట్టిగానే ప్రచారమయ్యాయి. అయితే వాటిపై ఇద్దరూ స్పందిస్తూ తాము మంచి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో 42 వయసును టచ్ చేస్తున్న అనుష్క మనసు పెళ్లిపై మళ్లిందనేది తాజాగా జరుగుతున్న ప్రచారం. ఇటీవల గోవాలో ఉన్న తన యోగా గురువును కలుసుకోవటానికి వెళ్లిన అనుష్క అక్కడ కొన్ని రోజుల పాటు యోగాకు సంబంధించిన అనేక విషయాలను నేర్చుకుని తిరిగి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు చెందిన ఓ గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలు స్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది ప్రశార్థకమే. చదవండి: Indira Devi: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం -
నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో
ఐదేళ్ల కెరీర్. బానే ఉన్నట్టు. పదేళ్లు. అబ్బో కేక. చాలా పెద్ద హీరోయిన్. ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమాని ఏలేసింది అంటారు. అదే హీరోలకైతే పదేళ్లు అన్నది చాలా తక్కువ టైమ్. వాళ్లకి 60 దాటినా హీరోలే. సో విషయం ఏంటంటే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఇలా వచ్చారు. అలా వెళ్లిపోయారు అన్నట్టుగా ఉంటుంది. ఈ టైమ్‌లో వాళ్లు పోషించే ఛాలెంజింగ్ పాత్రలే ఆ తర్వాత కూడా వాళ్ల గురించి మాట్లాడుకునేలా చేస్తాయి. లేదా వాళ్ల లైఫ్ స్పాన్స్ని పెంచుతాయి. లేడి ఓరియంటెడ్ సినిమాలే తెలుగులో తక్కువ. అందులో ఒక గ్లామర్ హీరోయిన్ ఏకంగా లేడి అమితాబ్ అన్న బిరుదును దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. విజయశాంతికి అది ఎందుకు సాధ్యమైందంటే తను అసామాన్యురాలు కాబట్టి. ఒకటి కాదు. రెండు కాదు. తానే ముందుండి నడిపించిన సినిమాల లిస్ట్ ఒసేయ్ రాములమ్మ దాకా చాలా పెద్దదే ఉంది. అయితే వీటన్నింటికీ పునాది మాత్రం కర్తవ్యం సినిమానే. అందులో పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి పెర్ఫామెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సావిత్రి బయోపిక్ తీస్తున్నారు. కీర్తిసురేష్ సావిత్రిగా చేస్తుందన్న వార్త బయటకు రాగానే రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. సావిత్రిని మరిపించేలా కీర్తి సురేష్ నటించగలదా అన్న సందేహాలు కూడా వ్యక్తమైయ్యాయి. కానీసావిత్రి పాత్రలో పరాకాయ ప్రవేశం చేసింది కీర్తి సురేష్. సావిత్రి జీవితంలోని ప్రతి దశను అద్భుతంగా వెండి తెర మీద ఆవిష్కరించింది. శివపుత్రుడు చిత్రంలో గోమతి క్యారెక్టర్‌తో అందరినీ ఆశ్చర్యపర్చింది సంగీత. అందులో గంజాయి అమ్మే యువతి పాత్రలో డీ గ్లామర్‌గా కనిపించింది. ఆ పాత్రలో జీవించింది. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్ల తర్వాత 2002లో ఖడ్గంతో హిట్ అందుకుంది సంగీత. ఆ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిలిమ్‌ఫేర్ అవార్డు తెలుగు అందుకుంది. ఆ వెంటనే పితామగన్ చిత్రంలో గంజాయి అమ్మే పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గ్లామర్ పాత్రలతో ఇల్లు చక్కపెట్టుకోవాల్సిన టైమ్‌లో ఇలాంటి రోల్స్ అవసరమా అని సలహాలు కూడా ఇచ్చారట. కానీ డైరెక్టర్ బాలా మీద నమ్మకంతో డేట్స్ ఇచ్చేసింది సంగీత. హీరోయిన్ అంటే గ్లామర్ రోల్. అంతే అని ఇండస్ట్రీ అంతా ఫిక్స్ అయిన టైమ్ సోలో గా కథలను లీడ్ చేసే ప్రతిభను ప్రదర్శించిఅవకాశాలనూ దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ తొలి నుంచి సమంతకి దక్కు తూనే ఉన్నాయి. ఏమాయ చేశావే, రంగస్థలం, ఓ బేబీఇలా చాలా సినిమాల్లో నటిగా తన సత్తాని చాటింది. ఛాలెంజింగ్ రోల్స్ గురించి ప్రస్తావించాలంటే అనుష్క గురించి చాలా చాలా మాట్లాడుకోవాలి. కేవలం గ్లామర్ డాల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క ఆ తర్వాత అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. అయితే అనుష్కలోని ప్రత్యేకత ఏంటంటే ఒక మూస లోనే ఉండకపోవడం. అరుంధతి విడుదలైన తర్వాత ఇక అనుష్కకి గ్లామర్ పాత్రలు పెద్దగా రావంటూ చాలా విశ్లేషణలు వచ్చాయి. కానీ ఆ అంచనాలను తప్పని నిరూపించింది. అటు గ్లామర్ రోల్స్, అటు ఛాలెంజింగ్ రోల్స్ అదరగొట్టింది. విభిన్నమైన పాత్రలు చేయాలని సహజంగానే ఎవరికైనా ఉంటుంది. కానీ దాని కోసం కెరీర్‌ని రిస్‌లో పెట్టడానికి కూడా వెనుకాడని వాళ్లు అతి అరుదుగా ఉంటారు. నటన పై వారికున్న గౌరవానికి అతి ప్రతీక. స్వీటి ఆ కోవలోకే వస్తుంది. అసలు హీరోయిన్ అంటేనేగ్లామర్. కేవలం ఒక పాత్ర కోసం బరువు పెరగడం అంటే కెరీర్ చుట్టూ క్వశ్చన్ మార్క్‌లు పెట్టుకోవడమే. ఆ సాహసాన్ని అనుష్క చేసింది. సైజ్ జీరో సినిమా కోసం 17 కేజీలు బరువు పెరిగింది. -
కృష్ణంరాజు మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టిహుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ కృష్ణంరాజు భౌతికదేహాన్ని సందర్శించింది. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క కృష్ణంరాజు మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు కృష్ణంరాజుతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు మరణం టాలీవుడ్‌కు తీరని లోటని పలు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు మరణవార్త విన్న తర్వాత మాటలు రావడం లేదని సీనియర్ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబం లెజెండ్, పెదనాన్నను కోల్పోయిందని మంచు విష్ణు సైతం ట్వీట్ చేశాడు. Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d — Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022 Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend. — Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022 -
‘లైగర్’కి ఆల్ ది బెస్ట్ చెప్పిన అనుష్క.. పూరీని ఇలా పిలిచిందేంటి?
విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ఇండియా మూవీ ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసేంది. పాన్ ఇండియా స్థాయికి తగినట్లే ప్రచారం కూడా చేయడంతో ‘లైగర్’గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. (చదవండి: సినిమా అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్స్‌లో రికార్డు) ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. లైగర్ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా స్టార్ హిరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియా వేదికగా ‘లైగర్’టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. విజయ్ కూడా అనుష్క పోస్ట్‌పై స్పందించాడు.‘ థ్యాంక్యూ సోమచ్ స్వీటీ.. అర్జున్ రెడ్డి సినిమా విడుదలప్పుడు కూడా మీకు ఇలాగే విషెస్ చెప్పారు. ఆ సినిమాలాగే లైగర్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని విజయ్ రిప్లై ఇచ్చాడు. అయితే అనుష్క తన పోస్ట్‌లో పూరి జగన్నాథ్ ‘జగ్గుదాదా’ అని సంబోధించడం విశేషం. కాగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ చిత్రంతోనే అనుష్క వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) -
కట్టె కొట్టె తెచ్చే...మెచ్చే!
ఓటీటీ బడిలో సృజనాత్మక పాఠాలు నేర్చుకుంటున్న యువతరం... దృశ్యలోకంలోనే ఉండిపోవడం లేదు. పుస్తక ప్రపంచం వైపు కూడా తొంగిచూస్తోంది. గంటల కొద్దీ సమయం పుస్తకాలు చదివే ఆసక్తి లేకపోయినా, రకరకాల జానర్స్‌లోని పుస్తక సాహిత్యాన్ని సంక్షిప్త రూపంలో అందిస్తున్న డిజిటల్ వేదికలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి... ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు యూత్ మహారాజ పోషకులు అనే సత్యాన్ని రకరకాల సర్వేలు ఎప్పటికప్పుడు బలపరుస్తున్నాయి. కరోనా లాక్డౌన్ తరువాత ఓటీటీ వేదికల వైపు ఆకర్షితులవుతున్న యువతరం శాతం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఈ ధోరణి మంచికా? చెడుకా? అనే చర్చలో ‘ఓటీటీ వల్ల యువత కోల్పోతుందా? నేర్చుకుంటుందా?’ అనే ప్రధాన ప్రశ్న ముందుకు వచ్చింది. ‘నేర్చుకున్నదే ఎక్కువ’ అనేది చాలామంది అభిప్రాయంగా వినబడుతుంది. ‘లాక్డౌన్ టైమ్‌కు ముందు ఓటీటీ గురించి వినడం తప్ప పెద్దగా తెలియదు. అయితే అందులోకి వెళ్లాక మైండ్‌బ్లోయింగ్ అనిపించే ఎన్నో చిత్రాలను చూశాను. మూడు ఫైట్లు, ఆరు పాటలు చూసీచూసీ మొహం మొత్తిన ప్రేక్షకులకు ఓటీటీ కంటెంట్ పెద్ద మార్పు అని చెప్పవచ్చు. ఇలా కూడా సినిమా తీయవచ్చా, ఇలాంటి సబ్జెక్ట్‌తో కూడా తీయవచ్చా! అని ఎన్నోసార్లు అనిపించింది’ అంటుంది కోల్‌కతాకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ నిఖిల. పుస్తకాలు చదవడం వల్ల సృజనాత్మకత పదును తేరుతుంది. కొత్త సబ్జెక్ట్‌లు రాసుకోవడానికి వీలవుతుంది. కొత్త సబ్జెక్ట్‌లకు ఓటీటీ ఓకే అంటుంది. అయితే ఈ ఎస్ఎంఎస్ల కాలంలో పేజీలకు పేజీలు చదివే ఓపిక యూత్‌కు ఉందా? ఇప్పుడు మనం అనుష్క శెట్టి(బెంగళూరు)ని పరిచయం చేసుకుందాం (హీరోయిన్ కాదు) ఒకప్పుడు అనుష్క శెట్టి పుస్తకాల పురుగు. ఎన్నో పుస్తకాలు చదివింది. అయితే తాను సైతం మొబైల్ ఫస్ట్–జెనరేషన్లో భాగం కావడానికి ఎంతకాలం పట్టలేదు. సోషల్ మీడియా, టెక్ట్సింగ్ యాప్స్ పైనే ఎక్కువ సమయాన్ని కేటాయించేది. ఈ నేపథ్యంలో ‘యూత్–బుక్‌రీడింగ్’ గురించి ఆలోచించగా, ఆలోచించగా ఆమెకు ఒక ఐడియా తట్టింది. అదే..ప్లాప్ స్టోరీస్! ‘ఎడ్యుటెయిన్’ నినాదంతో రంగంలోకి దిగిన ఈ గ్లోబల్ ఇంటరాక్షన్ ఫిక్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ బైట్–సైజ్డ్ ఫిక్షన్‌ను యూత్‌కు చేరువ చేస్తుంది. ‘యువతరాన్ని ఆకట్టుకోవడానికి పబ్లిషింగ్ ఇండస్ట్రీలో వినూత్న ప్రయత్నాలు జరగడం లేదు. కిండిల్ డిజిటల్ రీడింగ్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, అది పేపర్ డిజిటలైజేషన్ మాత్రమే. ఈ నేపథ్యంలో పుస్తకపఠనాన్ని ప్లాప్ రూపంలో పునరావిష్కరించాం. టెక్ట్స్, వీడియో, ఆడియోల రూపంలో తక్కువ టైమ్‌లో యూత్‌కు సాహిత్యాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటుంది ప్లాప్ స్టోరీస్ కో–ఫౌండర్ అనుష్క షెట్టి. ‘రీడింగ్ ట్రెండింగ్ అగేన్’ అనుకునే మంచి రోజులు రావాలని ఆశిస్తుంది అనుష్క. క్రియేటర్స్‌గా రాణించడానికి సినిమాలు ఎంత ఉపయోగపడుతాయో, పుస్తక సాహిత్యం కూడా అంతే ఉపయోగపడుతుంది. అయితే పుస్తకాలు చదవడానికి గంటలకొద్దీ సమయాన్ని కేటాయించడానికి యువత సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో తక్కువ టైమ్‌లో పుస్తక సారాంశాన్ని తెలుసుకునే వేదికకు రూపకల్పన చేశాం. ట్రెయిలర్ నచ్చితే ఎలాగైనా సినిమా చూడాలనుకుంటాం. ఒక పుస్తకం లేదా నవల, కథ గురించి క్లుప్తంగా తెలుసుకున్నవారు మూలం చదివే ప్రయత్నం చేస్తారు అనేది మా నమ్మకం. – అనుష్క శెట్టి, ప్లాప్ స్టోరీస్, కో–ఫౌండర్ -
ఎట్టకేలకు సెట్లో అడుగుపెట్టిన స్వీటీ.. ‘17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ..’
దక్షిణాదిలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మోస్ట్ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరో సినిమాకు సంతకం చేయలేదు. ఆమె వెండితెరపై కనిపించక మూడేళ్లు అవుతోంది. ఇప్పటికి స్వీటీ పలు సినిమాలకు సంతకం చేసిందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆమె సెట్స్‌లో అడుగు పెట్టింది లేదు. ఇక ఆమె రీఎంట్రీ ఎప్పుడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తన ఫ్యాన్స్‌కు స్వీటీ గుడ్‌న్యూస్ చెప్పంది. ఎట్టకేలకు ఆమె సెట్లో అడుగుపెట్టింది. చదవండి: కాఫీ విత్ కరణ్: టాలీవుడ్ నెపోటిజంపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అంతేకాదు అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం ఆమెతో కేక్ కట్ చేయించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా అనుష్క తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘17 ఏళ్ల ఈ ప్రయాణంలో సినీ ఇండస్ట్రీ, ఫ్యామిలీ, వెల్ విషర్స్ నుంచి అమితమై ప్రేమ, మద్దతు లభించాయి. వారంత నా జీవితంలో ఒక పార్ట్‌గా నిలిచారు. వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే వారి గురించి చెప్పేందుకు మాటలు సరిపోవు. వారి అన్‌కండీషనల్ లవ్, సర్ప్రైజ్ అనంతమైనది’ అంటూ రాసుకొచ్చింది. కాగా స్వీటీ ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మూవీ సెట్లో ఆమె పాల్గొన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఓటీటీ హావా.. ఈ ఒక్క రోజే ఏకంగా 13 సినిమాలు సందడి 17 years of much love and constant support from Film Industry,Family & well-wishers🧿🥰😍🙏 all who take out of your life’s to be part of mine a big thank u from the bottom of my Heart♥️My Fans😘🤗words always fall short for ur unconditional love & surprises which means a lot🤩😇 pic.twitter.com/gNORvXgKtT — Anushka Shetty (@MsAnushkaShetty) July 21, 2022 -
హీరోయిన్ అనుష్క సోదరునికి ప్రాణభయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో గ్యాంగ్స్టర్ల మధ్య విభేదాలతో ప్రముఖ బహుభాషా నటి అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టి హత్యకు ప్రత్యర్థులు పథకం పన్నినట్లు వార్తలొచ్చాయి. వివరాలు... గతంలో ప్రముఖ మాఫియా నేరగాడు ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్శెట్టిలు కుడి, ఎడమ భుజంలా ఉండేవారు. ముత్తప్ప రై మరణించిన తర్వాత ఈ ఇద్దరూ విభేదాలతో ప్రత్యర్థులుగా మారారు. ముత్తప్పరై స్థాపించిన జయ కర్ణాటక సంఘం నుంచి గుణరంజన్ బయటకు వచ్చి జయకర్ణాటక జనపర వేదికను స్థాపించి మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. దీంతో అసూయ పట్టలేని మన్విత్ రై తమ నేత హత్యకు కుట్ర పన్నాడని గుణరంజన్ అనుచరులు ఆరోపించారు. ఆదివారం రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్‌కు భద్రత కల్పించాలని కోరారు. ఈ ఆరోపణలను మన్విత్ రై తోసిపుచ్చారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చదవండి: విక్రమ్‌లో సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు? -
పెళ్లిని ప్రభాస్-అనుష్కలతో ముడిపెట్టిన అడివి శేష్
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ మేజర్. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్3న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ను జోరు పెంచింది చిత్ర బృందం. అయితే ఈ ప్రమోషన్స్‌లో అడివి శేష్ పెళ్లి టాపిక్ హైలైట్‌గా మారింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీ పెళ్లెప్పుడు అని శేష్‌ను ప్రశ్నించగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో నాకన్నా మ్యారేజ్ కావాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ అనుష్క, ప్రభాస్‌ల పెళ్లి ఇంకా కాలేదు. వారి పెళ్లిళ్లు అయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిద్దాం అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. శేష్ కామెంట్స్‌తో మరోసారి ప్రభాస్-అనుష్కల పెళ్లి తెరపైకి వచ్చింది. -
మిస్ చెఫ్?
విభిన్నమైన వంటకాలు, వాటి రెసిపీలు తెలుసుకునే పనిలో ఉన్నారట అనుష్కా శెట్టి. తన చేతి వంట రుచి చూపించేందుకు రెడీ అయ్యారట. వంటల గురించి యూట్యూబ్ చానెల్ ఆరంభించడానికే అనుష్క ఇలా కుకింగ్ మీద దృష్టి పెట్టారనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ వంటల రీసెర్చ్ చేస్తున్నది తన తాజా సినిమా కోసం అని సమాచారం. అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన తారాగణంగా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర గురించి ఓ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే... ఈ చిత్రంలో ఓ అంతర్జాతీయ చెఫ్ పాత్రలో ఈ బ్యూటీ కనిపించనున్నారట. ఈ పాత్రలో ఒదిగిపోవడానికే పాకశాస్త్రంలోని అంశాలపై పట్టు సాధించే పనిలో ఉన్నారట. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం ఇదే. -
బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్!
Anushka Shetty Playing Special Role In Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకా విడుదలకు రెండు రోజుల ఉండగా ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో హీరోయిన్గా చేసిన కాజల్‌ను తొలిగించిన విషయం తెలిసిందే. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ దీనికి బదులుగా ఓ సీన్ కోసం స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కాస్తా గ్లామర్ టచ్ కోసం చిత్రం బృందం ఓ అతిథి పాత్రకు అనుష్క శెట్టిని స్పంద్రించినట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లేదా ముఖ్య పాత్రలో కనిపించనుందని ఫిలీం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మూడేళ్లుగా అనుష్క వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్రం బృందం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిందట. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. ఇదే నిజమైతే ఆచార్య చూసేందుకు థియేటర్‌కు వచ్చిన స్వీట్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 29 తేదీవరకు వేచి చూడాలి. కాగా ఆచార్య మూవీ ప్రమోషన్ భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్ కొరటాల ఈ మూవీ నుంచి కాజల్‌ను తీసేశామని స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ఆచార్య’పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్ వచ్చింది. అదే సమయంలో కరోనా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు బాగా ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదని ఉద్దేశించి ఆమెను తొలగించాం’’ అని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అనుష్క కొత్త సినిమా అప్డేట్.. ఆ బ్యానర్లో హ్యాట్రిక్ చిత్రం
Anushka Shetty Movie With Naveen Polishetty In UV Creations Banner: దక్షిణాదిలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మోస్ట్ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరో సినిమాకు సంతకం చేయలేదు. దీంతో అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా అనుష్క ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమాలో నటిస్తోందంటూ వార్తలు వస్తున్నప్పటికీ అవి పుకార్లో నిజమో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఆమె ఫ్యాన్స్. చదవండి: మరోసారి ప్రభాస్‌తో అనుష్క..! ఈ నేపథ్యంలోనే అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. కానీ తర్వాత నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ను ఇచ్చింది యూవీ క్రియేషన్స్ సంస్థ. ఏప్రిల్ 4 నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది. ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నాడు. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఈ సినిమాను 'రారా.. కృష్ణయ్య' దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్ట్ చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లోనే అనుష్క మిర్చీ, భాగమతి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు అనుష్క 48వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా యూవీ బ్యానర్లో హైట్రిక్ చిత్రం. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సక్సెస్ పార్టీలో అనుష్క సందడి, ఫొటోలు వైరల్ -
క్రేజీ అప్డేట్: మరోసారి ప్రభాస్‌తో అనుష్క..!
హీరో ప్రభాస్‌తో అనుష్కది సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరోసారి ప్రభాస్, అనుష్క జంట కలిసి సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఇటీవల ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక పక్కా మాస్ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించబోతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అందులో మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం అనుష్కను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో జేజమ్మ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇక రెండో హీరోయిన్గా కృతి శెట్టిని దాదాపుగా కన్ ఫార్మ్ చేసినట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్గా మాళవిక పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే కొంతకాలంగా అనుష్క సినిమాలకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్‌తో అనుష్క కాంబినేషన్‌పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
‘ఆర్ఆర్ఆర్’ మూవీ సక్సెస్ పార్టీలో అనుష్క సందడి, ఫొటోలు వైరల్
జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’మూవీ శుక్రవారం(మార్చి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చరిత్రలోని ఇద్దరు సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో జక్కన ఈ మూవీని రూపొందించాడు. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సౌత్ నుంచి నార్త్ వరకు ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ మేనియానే కనిపిస్తోంది. నాలుగేళ్ల కష్టానికి జక్కన్న టీంకు ప్రేక్షకుల నుంచి భారీ నీరాజనాలు అందుతున్నాయి. ఇక ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో ఆర్ఆర్ఆర్ టీం సంబరాల్లో మునిగితేలుతోంది. చదవండి: సమంత స్పెషల్ సాంగ్, ‘పాన్ ఇండియానా బొక్కా?’ సామ్ ట్వీట్ వైరల్ ఈ క్రమంలో శనివారం జరిగిన సక్సెస్ పార్టీలో దర్శకుడు రాజమౌళితో పాటు రాంచరణ్, ఎన్టీఆర్, ఎస్ఎస్ కార్తికేయ, దిల్ రాజు, ఉపాసనతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ఈ పార్టీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తలుక్కున మెరిసింది. టాలీవుడ్ జేజేమ్మ, తెలుగు ప్రేక్షకులు దేవసేన అయిన అనుష్క ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ సందడి చేసింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న స్వీటీ ఇలా రాజమౌళి పార్టీలో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ పార్టీలో రాంచరణ్‌తో అనుష్క మాట్లాడుతున్న స్టిల్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా అనుష్క ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో మూడు సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో స్వీటీ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై బాబు గోగినేని వివాదస్పద రివ్యూ, ఏమన్నాడంటే -
ఉమెన్స్ డే రోజున పురుషులకు థ్యాంక్స్ చెప్పిన స్వీటీ
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా రోజులు అవుతుంది. చివరిగా నిశబ్దం మూవీతో పలకిరించిన స్వీటీ.. ఆ తర్వాత ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. కనీసం సోషల్ మీడియలో అయిన ఫ్యాన్స్ పలకరిస్తుంది అనుకుంటే ఏదైన స్పెషల్ డే రోజునే దర్శనం ఇస్తుంది. పండగలు, కొద్ది మంది సెలబ్రెటీల బర్త్‌డేలకు మాత్రమే స్వీటీ నెట్టింట కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాకు వచ్చింది. నిన్న(మార్చి 8) ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా స్వీటీ ఆసక్తికరంగా పోస్ట్ షేర్ చేసింది. ఈ మేరకు తన ఫ్యామిలీ ఫొటోను పంచుకుంది. ఈ పోస్ట్‌లో.. ‘అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతీ ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చదవండి: రెమ్యునరేషన్లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా? ప్రొఫెషనల్, ఫిజికల్, మెంటల్, సోల్ ఫుల్లీ అందరూ బెస్ట్ ఉండేందుకు ప్రయత్నించాలి. గతం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రతీక్షణాన్ని అనుభవించాలి. రోజురోజుకూ ఎదుగుతూ ఉండాలి. తండ్రిగా, సోదరుడిగా, కొడుకుగా, ఫ్రెండ్‌గా, భర్తగా ఇలా ఎన్నో రకాలుగా ప్రేమను పంచుతూ, మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడం, ప్రేమను పంచడం వంటివి చేస్తోన్న మగాళ్లందరికీ థ్యాంక్స్’ అని అనుష్క చెప్పుకొచ్చింది. ఇక స్వీటీ చాలా గ్యాప్ తర్వాత వరస ప్రాజెక్ట్స్ ఒకే అంటుంది. ఇప్పటికే ఆమె యూవీ క్రియేషన్స్‌లో రెండు, మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్, ఇది నాగ చైతన్యకు పోటీగానా? View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) -
రెమ్యునరేషన్లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా?
హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో చాలా వ్యత్యాసం ఉటుందన్న విషయం అందరికి తెలిసిందే. హీరోలతో పోల్చితే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్ హీరోయిన్లకి సైతం ఓ మామూలు హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ ఇవ్వరనేది పచ్చి నిజం. కానీ ఇప్పడు వారు రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. కాగా సినిమా సినిమాకు మన హీరోయిన్లు క్రేజ్ పెరిగిపోతోంది. లేడి ఒరియంటెడ్ పాత్రలకు సైతం సై అంటూ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో వారి రెమ్మునరేషన్ పెంచుకుంటూ పోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండ వారి పారితోషికం ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పాత్రను బట్టి ఆ సినిమా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలా కోట్ల నుంచి లక్షల వరకు పారితోషికంగా అందుకుంటున్న సౌత్ హీరోయిన్లు ఎవరూ, ఎవరెంత డిమాండ్ చేస్తున్నారు. వారి రెమ్మునరేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. నయనతార: ఒక్కో సినిమాకు ఇప్పటికీ రూ.4 కోట్ల వరకు తీసుకుంటుంది నయన్. ఇప్పటికీ అదే రేంజ్ మెయింటేన్ చేస్తుంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్లో కథానాయికగా చేస్తున్న నయన్ ఈ మూవీకి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి. పూజా హెగ్డే: వరస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీ లెగ్ అనిపించుకుంటుంది. దీంతో ఆమెను హీరోయిన్గా మాత్రమే కాకుండా... ఇతర చిత్రాల ఈవెంట్స్‌కు కూడా ముఖ్య అతిథిగా స్వాగతం ఇస్తున్నారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని పాటిస్లూ పూజ రెమ్యునరేషన్‌ను కూడా భారీగా డిమాండ్ చేస్తుందట. ఇప్పుడు ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల మధ్యలో అడుగుతుందని, ఇక మూవీ ఈవెంట్స్‌కు లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సమంత: పెళ్లైన తర్వాత కూడా సమంతతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. విడాకుల తర్వాత వరస సినిమాలకు సైన్ చేస్తుంది. ఈ మధ్యే యశోద సినిమాకు 3 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అనుష్క శెట్టి: అరుంధతి మూవీ రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న స్వీటీ.. ప్రస్తుతం రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఇటిటీవల కమిటైన యూవీ క్రియేషన్స్ సినిమాకు కూడా భారీగానే తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన్న: ఒక్కో సినిమాకు ఇప్పుడు 2.25 కోట్ల నుంచి రూ. 3 కోట్లవరకు తీసుకుంటుంది రష్మిక. హిందీలో అయితే అంతకంటే ఎక్కువగానే అందుకుంటుందని అంచనా. కీర్తి సురేశ్: సినిమాల విజయాలు, వైఫల్యాలతో సంబంధం లేకుండ కీర్తి ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందట. సాయి పల్లవి: సైలెంట్‌గా సంచలనాలు సృష్టించడంలో సాయి పల్లవి తర్వాతే ఎవరైనా. ఈ ముద్దుగుమ్మ కూడా ఒక్కో సినిమాకు సుమారు రూ. 1.50 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు అందుకుంటుంది. కాజల్ అగర్వాల్: ఎంతమంది కొత్తవాళ్లు వచ్చిన కాజల్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి కాజల్ రూ. 3 కోట్ల నుంచి రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటుంది. తమన్నా: ఒకప్పుడు కోట్లలో పారితోషికం తీసుకునే తమన్నా.. కాస్తా తన క్రేజ్ తగ్గడంతో రూ. కోటి నుంచి కోటిన్నరకుపైగా డిమాండ్ చేస్తుందట. స్పెషల్ సాంగ్ అరకోటి నుంచి కోటి వరకు అందుకుంటుంది. టీవీ షోలకు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతోంది ఈ మిల్కీ బ్యూటీ. రాశీ ఖన్నా: జై లవకుశ వంటి సినిమాలలో నటించిన తర్వాత కూడా రాశీ ఖన్నా రేంజ్ పెరగలేదు. దీంతో ఇప్పుడు సినిమాకు రూ. 60 లక్షల వరకు తీసుకుంటున్నట్లు అంచనా. రకుల్ ప్రీత్ సింగ్: మొన్నటి వరకు కోటికి తగ్గని రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు సినిమాకు 70 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
రానా @ 12 ఏళ్లు, బ్రో అంటూ అనుష్క స్వీట్ విషెస్
Rana Daggubati: భిన్న కథలు, విభిన్న సినిమాలు, డిఫరెంట్ రోల్స్‌తో అభిమానులను అలరిస్తుంటాడు రానా దగ్గుబాటి. తను ఎంచుకునే కథలన్నీ కూడా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. లీడర్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం టాలీవుడ్లో దిగ్విజయంగా కొనసాగుతోంది. హీరోగా, విలన్‌గా, వ్యాఖ్యాతగా, సహాయక నటుడిగా అన్నిరకాల పాత్రల్లో ఒదిగిపోతూ ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడాయన. ఈ భళ్లాల దేవ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు పూర్తైంది. ఈ విషయాన్ని రానా ట్వీట్ ద్వారా తెలియజేశాడు. 'అర్జున్ ప్రసాద్(లీడర్) నుంచి డేనియల్ శంకర్(భీమ్లా నాయక్) వరకు.. అప్పుడే 12 ఏళ్లు పూర్తయ్యాయి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.. మున్ముందు కూడా కొత్త కొత్త కథలు, పాత్రలను మీకు పరిచయం చేస్తాను' అని హామీ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు రానాకు శుభాకాంక్షలు చెప్తూ ఆయన చేసిన సినిమాల్లో తమకేది ఎక్కువ ఇష్టం అనేది చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే స్వీటీ అనుష్క శెట్టి రానా ట్వీట్ 'ఇలాగే ముందుకు సాగు బ్రో' అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన జనాలు స్వీటీ తన అన్నయ్యకు రిప్లై ఇచ్చిందిరో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. Great going bro 🥳❤️ https://t.co/GfizecD7LR — Anushka Shetty (@MsAnushkaShetty) February 20, 2022 -
తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే..
స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష శెట్టి వెండితెరపై కనిపించి చాలా రోజులు అవుతుంది. భాగమతి తర్వాత ఆమె ఇంతవరకు ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ‘అవును టాలీవుడ్లో సైతం క్యాస్టింగ్ కౌచ్ ఉంది. చదవండి: నటి మీరా జాస్మిన్ ఇప్పుడేం చేస్తుంది.. ఎక్కడుందో తెలుసా? అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి తెలుగు పరిశ్రమలో కూడా ఉంది. నేను అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే నేను పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి చాలా సూటిగా.. నిక్కచ్చిగా మాట్లాడతాను. అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మహిళలు లైంగిక వేధింపులతో ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: ప్రపోజ్ చేస్తే జోక్ చేశాడనుకున్నా: హీరో నిఖిల్ భార్య ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను.. కానీ నేను దురుసుగా ఉండటం వల్ల నా దగ్గర ఎప్పుడు ఎవరు అలా మాట్లాడలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా అనుష్క సూపర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్రమార్కుడు, అరుంధతి, మిర్చి వంటి కమర్షియల్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అరుంధతితో మహిళ ఓరియంటెడ్ సినిమాలకు తీసిన అనుష్క ఆ తర్వాత జీరో సైజ్, భాగమతి వంటి సినిమాల్లో నటించింది. భాగమతి సినిమా తర్వాత స్వీటీ ఇప్పటి వరకు ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. -
'అరుంధతి' ఛాన్స్ ముందు ఏ హీరోయిన్‌కు వచ్చిందంటే?
అనుష్కను స్టార్ హీరోయిన్గా నిలబెట్టిన చిత్రాల్లో అరుంధతి సినిమాది అగ్రస్థానం. అప్పటివరకు అందాల ప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చిన ఈ హీరోయిన్ అరుంధతిలో నటవిశ్వరూపం చూపించింది. సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. అరుంధతి అంటే అనుష్క.. అనుష్క అంటే అరుంధతి అని ప్రేక్షకుల మనసులో బలంగా ముద్రపడిపోయింది. టాప్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2009లో సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదలై సెన్సేషనల్ హిట్ అందుకుంది. మల్లెమాల ఎంంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలీజై నేటికి పదమూడేళ్లు పూర్తైంది. నిజానికి ఈ సినిమా ఛాన్స్ మొదట అనుష్కకు రాలేదట! మలయాళ కుట్టి మమతా మోహన్‌దాస్‌ను అరుంధతి సినిమా కోసం సంప్రదించారట. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమెకు ఎలాంటి కథలు ఎంచుకోవాలో పెద్దగా తెలిసేది కాదని, దానివల్లే అరుంధతిని వదులుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అప్పటికే ఇతర ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉండటంతో విముఖత వ్యక్తం చేసిందట. ఈ ఆఫర్ వచ్చిన రెండు నెలలకే క్యాన్సర్ ఉన్నట్లు తేలడంతో అరుంధతి కంటే బతికి ఉంటే చాలన్న భావనతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని పేర్కొంది. అలా ఈ సినిమా అనుష్క దగ్గరకు రావడం, ఆమె ఓకే చెప్పేయడంతో చకచకా షూటింగ్ జరిపేశారు. సినిమా రిలీజయ్యాక జేజమ్మగా అనుష్కకు జనాలు నీరాజనాలు పట్టారు. -
క్రేజీ అప్డేట్.. చిరు సినిమాలో హీరోయిన్గా అనుష్క!
Anushka Shetty Heroine In Chiranjeevi Next Movie?: సౌత్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. అరుంధతి, భాగమతి వంటి చిత్రాలతో మూవీతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పాపులారిటీ దక్కించుకున్న అనుష్క.. నిశ్శబ్దం మూవీ తర్వాత మరే సినిమాకు సంతకం చేయలేదు. దీంతో అనుష్క తెరపై కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా అనుష్క ఈ సినిమా చేస్తుంది, ఆ సినిమాలో చేస్తుందంటూ వార్తలు వస్తున్నప్పటికీ అవి పుకార్లు గానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అనుష్క ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: Siddharth-Saina Nehwal: సైనాపై సిద్ధార్థ్ అభ్యంతరక వ్యాఖ్యలు, హీరోకు భర్త కశ్యప్ చురకలు స్వీటీ అనుష్కకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అనుష్క నటిస్తుందంటూ టాక్ నడుస్తోంది. కాగా ఖైదీ 150తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరు యంగ్ హీరోలకు పోటీగా వరస సినిమాలను లైన్లో పెట్టారు. ఇప్పటికే ఆయన కొరటాల శివ దర్శకత్వంతో రూపొందిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆచార్య షూటింగ్ అనంతరం ఏమాత్రం గ్యాప్ లేకుండా ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీర్రాజు’ సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఇదిలా ఉండగా వీటితో పాటు చిరు మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్గా అనుష్క పేరు పరిశీలించారట. అంతేకాదు ఇప్పటికే ఆమెను సంప్రదించి కథ వివరించినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి అనుష్క తన సమాధానం ఇవ్వాల్సింది ఉందని వినికిడి. ఆ తర్వాత దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ వార్తలపై స్వీటీ స్పందించేవరకు వేచి చూడాలి. -
అనుష్కతో నవీన్ పొలిశెట్టి సినిమా ఆగిపోయిందా? ఇదిగో క్లారిటీ ..
Naveen Polishetty Confirms New Film With Anushka Shetty: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పొలిశెట్టి.. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. జాతిరత్నాలుతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నవీన్- అనుష్క జంటగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా రానుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై యూవీ క్రియేషన్స్ వారు క్లారిటీ ఇచ్చారు. నవీన్ పొలిశెట్టి బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే అనుష్క ఈ చిత్రంలో నవీన్‌కి జోడీగా కనిపించనుంది. నలభై ఏళ్ల మహిళ, పాతికేళ్ల అబ్బాయితో ఎలా ప్రేమలో పడుతుంది? ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా కథ. పి. మహేశ్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. View this post on Instagram A post shared by Naveen Polishetty (@naveen.polishetty) -
అనుష్కకు తగ్గని క్రేజ్..4నెలల్లో 10లక్షల ఫాలోవర్స్
దక్షిణాది హీరోయిన్లలో నెంబర్ వన్‌గా నిలిచి బాహుబలి సహా భారీ చిత్రాల్లో నటించి.. కొంత కాలం పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన అనుష్క శెట్టి ఇప్పుడు కెరీర్లో వెనుకబడ్డారు. అయితే సినిమాల్లో ఎక్కువ కనిపించకపోయినా ఆమె పట్ల ప్రేక్షకుల్లో ఆదరణ చెక్కు చెదరలేదనే విషయం తాజాగా కూ యాప్ సాక్షిగా నిరూపితమైంది. ట్విట్టర్ స్థానంలో దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫార్మ్గా శరవేగంగా భారతీయులను ఆకర్షిస్తున్న కూ యాప్ అంతకంతకూ ప్రముఖులకు కేరాఫ్‌గా మారుతోన్న నేపధ్యంలో.. రాజకీయ, సినీ రంగ సెలబ్రిటీలు కూ యాప్‌పై ఖాతాలను ప్రారంభిస్తున్నారు. అదే విధంగా 4నెలల క్రితం అనుష్క శెట్టి కూడా తన కూ యాప్ ఖాతాను ప్రారంభించింది. అయితే కేవలం 4నెలల్లోనే ఆమెకు 10లక్షల మంది ఫాలోయర్స్ ఏర్పడడం విశేషం. తాజాగా 40వ పుట్టిన రోజును జరుపుకున్న ఆమెకు ఈ స్థాయి ఫాలోయింగ్... అభిమానులు ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్‌గా మారింది. -
Anushka Shetty: పుకార్లకు చెక్ పెట్టిన అనుష్క.. ఆ సినిమా ఆగిపోలేదు
‘అనుష్క ఇక సినిమాల్లో నటించదు.. ఆమె పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అవుతుంది. అందుకే ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై చేయాల్సిన సినిమా నుంచి తప్పుకుంది’ అంటూ వచ్చిన పుకార్లకు బర్త్‌డే సందర్భంగా చెక్‌పెట్టింది అనుష్క. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఆగిపోయిందనుకున్న సినిమాను అధికారికంగా ప్రకటించింది. అనష్కకు 48వ చిత్రం ఇది. మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క ‘మిర్చి’,‘భాగమతి’అనే రెండు సినిమాలు చేసింది. తాజాగా ఆ బ్యానర్లో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది లేడి ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. .ఈ సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించారని అప్పట్లో ప్రచారం జరిగింది. Happy Birthday Sweety! 💕 We are delighted to announce our "Hattrick Combination" with the Sweet and Very Special @MsAnushkaShetty 🥳🎉. Directed by #MaheshBabuP Produced by @UV_Creations#HBDAnushkaShetty #Anushka48 #HappyBirthdayAnushkaShetty pic.twitter.com/nOv4LWvonh — UV Creations (@UV_Creations) November 7, 2021 -
అందుకే పేరు మార్చుకున్నా: అనుష్క
అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి.. మార్కెట్ గురించి ప్రత్యేంకగా చెప్పాల్సిన అవసరం లేదు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న అనుష్కకు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది. దానికి తోడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది జేజమ్మ. ఈమె గురించి ఇప్పుడు ఆడియన్స్‌కు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కానీ ఈమె కుటుంబం గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. టాలీవుడ్లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దేవసేనకు.. హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2005లో సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. సూపర్ చిత్రం తర్వాత ‘మహానంది’లో హీరో సుమంత్‌కు జోడిగా నటించింది అనుష్క. అయితే ఈ చిత్రం ద్వారా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. మాస్ మహారాజా , రాజమౌళి కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’తో అనుష్క్కు స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ఇక 2009లో వచ్చిన కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’తో అనుష్క జీవితమే మారిపోయింది. ఆ సినిమాలో యువరాణి జేజమ్మగా అనుష్క అభినయానికి, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత ‘రుద్రమదేవి’, ‘పంచాక్షరి’,‘భాగమతి’,‘సైజ్ జీరో’లాంటి సినిమాల్లో నటించిన తెగులులో మళ్లీ లేడి ఓరియెంటెండ్ సినిమాకు ఊపుతీసుకొచ్చింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘భాగమతి’గా పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ..హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే సినిమా చేసింది. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.. ఆతర్వాత ఏ సినిమాకి సంతకం చేయలేదు. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటరవ్యూలో చెప్పింది. నేను ఇంటర్లో అడ్మిషన్ అప్పుడు స్వీటీ అని రాస్తే ‘ముద్దు పేరు బావుంది. కానీ అసలు పేరు రాయి’ అన్నప్పుడు ఏదోలా అనిపించింది’ అని ఓసారి అనుష్క గుర్తు చేసుకున్నారు. 23 ఏళ్ల వయసులో సెట్లో ‘స్వీటీ’ అని పిలుస్తుంటే బాగోలేదన్నారట. దీంతో ఆమె తనకు తానే అనుష్క అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరుకు అలవాటు పడటానికి ఏడాది పట్టిందట. కాగా నేడు (నవంబర్ 7) అనుష్క తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు బర్త్‌డే విషేస్ తెలియజేస్తున్నారు. -
18 Years Of Anushka Shetty : టాలీవుడ్ 18 ఏళ్లు పూర్తి చేసుకున్న అనుష్క శెట్టి ఫోటోలు
-
రెబల్ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ: స్వీటీ అనుష్క స్పెషల్ విషెస్
ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. సూపర్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ పుట్టిన రోజు సందర్భంగా రాధేశ్యామ్ టీం విషెస్ తెలిపింది. ఇంకా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ కూడా డార్లింగ్‌కు విషెస్ అందిస్తూ ట్వీట్ చేసింది. అలాగే వెంకీమామ ఫ్యాన్స్ ప్రభాస్ స్పెషల్ డీపీ విడుదల చేసింది. (చదవండి: ‘డార్లింగ్’ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?) ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ స్వీటీ అనుష్క కూడా తన రీల్ హీరోకి స్పెషల్ విషెస్ తెలిపింది. అలాగే తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ పండగ చేసు కుంటున్నారు. దీంతో ప్రత్యేక శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.(Prabhas: క్లాస్ అయినా మాస్ అయినా.. మోత మోగాల్సిందే!) కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా ఐదు సినిమాలుండటం విశేషం. ముఖ్యంగా రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన థియేటర్లను పలకరించనుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు స్పిరిట్ టైటిల్‌తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో మరో మూవీకి సైన్ చేశాడు. Happy happy birthday wishing u only the best in all that life has to offer and may all ur stories reach out to as many hearts all over 🌎 🌏 🌍 … happiness and health ur way 😊 #HappyBirthdayPrabhas pic.twitter.com/3qsIngmgLo — Anushka Shetty (@MsAnushkaShetty) October 23, 2021 Here The Birthday Special CDP Of Pan India Rebel Star #Prabhas Garu Behalf Of Victory @VenkyMama Gari Fans. CDP Design: @Sultan1369#HappyBirthdayPrabhas pic.twitter.com/wY2cX3vWOJ — BA Raju's Team (@baraju_SuperHit) October 23, 2021 Wishing our Rebel Star Prabhas, a very happy birthday!#HappyBirthdayPrabhas pic.twitter.com/L2xBHJmBxM— Sri Venkateswara Creations (@SVC_official) October 23, 2021 Wishing the one and only, the humble giant Prabhas Garu a very Happy Birthday 🎉♥️#HappyBirthdayPrabhas 💥💐 pic.twitter.com/oGbbgrFgIF — Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2021 Happy birthday to the one who's won a million hearts, including ours! Dear darling #Prabhas have a wonderful day!!! - Team #Adipurush #HappyBirthdayPrabhas ✨ pic.twitter.com/pMcVDxN2No — BA Raju's Team (@baraju_SuperHit) October 23, 2021 -
అనుష్క పెళ్లిపై జ్యోతిష్కుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Astrologer Comments on Anushka Shetty Marriage: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క పెళ్లిపై వచ్చినన్ని రూమర్స్ మరే ఇతర హీరోయిన్స్‌పై వచ్చుండవేమో. గతంలో ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వినిపించాయి. అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని, అలాంటివి వార్తల్లో నిజం లేదంటూ ఇద్దరూ క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడింది. అనంతరం ఓ బిజెనెస్ మెన్‌తో అనష్కుకు పెళ్లి ఫిక్సయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అది కూడా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. చదవండి : Nagarjuna: ఆ విషయం తలుచుకొని నాగార్జున భావోద్వేగం ఇక `నిశ్శబ్దం` సినిమా అనంతరం జోరు తగ్గించిన అనుష్క నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తుందని అనౌన్స్ చేసినా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అనుష్క పెళ్లిపై మరోసారి రూమర్స్ జోరందుకున్నాయి.ఈ నేపథ్యంలో అనుష్క వివాహంపై ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి : కమెడియన్ అలీ లగ్జరీ ఇంటిని చూశారా? అనుష్క వృత్తి విషయంలో ఎంతో సిన్సియర్ అని, ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని అనుష్క పెళ్లాడనుందని పేర్కొన్నారు. అనుష్క చాలా డౌన్ టూ ఎర్త్ అని, ఆమెలో కొంచెం కూడా అహంభావం ఉండదని తెలిపారు. ఇక పెళ్లి గురించి చెబుతూ..2023లోపు అనుష్కకు వివాహం జరుగుతుందని వివరించారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది చూడాల్సి ఉంది. చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘లవ్‌స్టోరి’ప్రభంజనం.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే? -
చంద్రముఖి సీక్వెల్లో అనుష్క! ఇక బొమ్మ దద్దరిల్లాల్సిందే
Anushka Shetty: సౌత్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాపులారిటీ దక్కించుకున్న అనుష్క నిశ్శబ్దం మూవీ తర్వాత మరే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా మరో సూపర్‌హిట్ చిత్రంతో అలరించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ పి. వాసు దర్శకత్వంలో లారెన్స్-అనుష్క కాంబినేషన్లో సినిమా రూపొందనుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం అనుష్కని సంప్రదించారని, ఆమె కూడా ఈ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది. చదవండి : 'త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ'..కానీ సినిమా కోసం కాదు షాకింగ్.. తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన స్టార్ హీరో -
‘మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి’ ఆగిపోయిందా?
నిశ్శబ్దం తర్వాత అనుష్క నటించబోయే కొత్త సినిమా పై, కొంత కాలంగా కన్ ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. యూవీ క్రియేషన్స్ లో బ్యానర్ లో, మిస్ శెట్టి , మిస్టర్ పొలిశెట్టి టైటిల్ తో తెరకెక్కాల్సి ఉంది. 25 ఏళ్ల పొలిశెట్టి , 40 ఏళ్ల శెట్టితో ప్రేమలో పడితే, ఆ లవ్ స్టోరీ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కాని ఈ ప్రాజెక్ట్ రూమర్స్ కే పరిమితం అవుతోంది. ఎందుకంటే మిస్ శెట్టి ఇప్పుడు ఇతర ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతోందని సమాచారం. తమిళంలో చంద్రముఖి సీక్వెల్ తో పాటు, నెట్రికన్ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాగా ప్రచారం సాగుతోంది. (చదవండి: జాతిరత్నాలు తర్వాత నవీన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే..) ఇక మిస్టర్ పొలిశెట్టి అంటే నవీన్ పొలిశెట్టి కూడా,ఇటీవలే త్రివిక్రమ్ కొత్తగా ప్రారంభించిన బ్యానర్ లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. జాతిరత్నాలు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ చిత్రంలో దర్శకుడిగా మారుతున్నాడు. త్వరలనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇలా ఇద్దరు ఇతర ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. -
ఈ చిన్నారి ఇప్పుడో ఫేమస్ హీరోయిన్, గుర్తుపట్టారా?
Actress Childhood Photo: అందచందాలతో, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న తారలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూడాలని అభిమానులు తహతహలాడుతుంటారు. సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడూ ఫ్యాన్స్ కోసం ఆల్బమ్‌లో నుంచి కొన్ని చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతుంటారు. దీంతో లైకులు, షేర్లతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట తెగ వైరలవుతుంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ గింగిరాలు తిరుగుతోంది. ఇంతకీ తల్లి ఒడిలో కూర్చుని కెమెరా వైపు ఓ లుక్కిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఆమె ఇప్పుడు తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్. టాలీవుడ్లో దాదాపు అగ్ర హీరోలందరితో నటించిన ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో జనాలకు మరింత దగ్గరైంది. ఇటీవలే నిశ్శబ్దం చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించిందీ హీరోయిన్. ఆమెవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. అవును, మీరనుకుంటున్నట్లు ఆమె మన జేజమ్మ అనుష్క శెట్టి. తన తల్లిదండ్రులు, అన్మదమ్ములతో కలిసి ఇలా ఫొటోకు పోజిచ్చిందీ స్వీటీ. ఇదిలా వుంటే అనుష్క ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తుందంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతుంది, కానీ అఫీషియల్ అప్డేట్ మాత్రం రాలేదు. -
అయ్యో.. అనుష్క సినిమా ఆగిపోయిందా?!
ఒక పెద్ద విజయం తరువాత హీరోహీరోయిన్ల మార్కెట్ పెరిగిపోతుంది. దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి వరుస ప్రాజెక్ట్స్, మరిన్ని అవకాశాలను చేజిక్కుంచుకుంటారు స్టార్లు. అంతేగాక పారితోషికం కూడా భారీగా పెంచేస్తారు. కానీ విటన్నింటికి స్వీటి అనుష్క భిన్నమనే చెప్పుకోవాలని. బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాల తర్వాత అనుష్క క్రేజ్ మరింత పెరిగిపోయిందని అందరూ భావించారు. ‘బాహుబలి 2’ తరువాత ఆమె తన సినిమాల సంఖ్యను బాగా తగ్గించింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. తను బరువు పెరగడం వల్లే గ్లామర్ పాత్రలను పక్కన పెట్టి పూర్తిగా మహిళ ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోంటోంది. ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చి ఎన్నో ప్రాజెక్ట్స్‌ను స్వీటి వదులుకుందని టాక్. ఈ నేపథ్యంలో ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి మహిళ నేపథ్యం ఉన్న పాత్రలను చేసింది. అయితే ‘భాగమతి’ మంచి విజయం సాధించగా.. ‘నిశ్శబ్దం’ మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత అనుష్క ఏ సినిమాను ఒప్పుకోలేదు. ఫలానా బ్యానర్లో.. ఫలానా హీరోతో అనుష్క చేయనుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ చివరకు అవన్నీ పుకార్లుగానే ఉండిపోతున్నాయి. ఇక తన సినిమాలను గురించిన ప్రకటనలు వచ్చినప్పటికి అధికారికంగా రావడం లేదు. ఇటీవల యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్కా ప్రధాన పాత్రధారులుగా మహేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని జోరుగా ప్రచారం జరిగింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ‘రారా కృష్ణయ్యా’ ఫేం దర్శకుడు పి. మహేశ్ ఈ సినిమా రూపొందించనున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ అప్డేట్ వచ్చి నెలలు గడుస్తున్నా.. దీనికి సంబంధించిన తదుపరి అప్డేట్ మాత్రం రావడం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఈ మూవీకి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ ప్రాజెక్ట్‌పై తదుపరి అప్డేట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా అనుష్క నటించనుందా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలకు కూడా ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వేవాటిలో ఒకటి తమిళ మూవీ ‘వేదాళం’ కాగా ఇంకొకటి మలయాళ చిత్రం ‘లూసిఫర్’. ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ పూర్తిగాగానే వాటిని పట్టాలెక్కించబోతున్నాడు. గతడేది మలయాళంలో విడుదలైన ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ రైట్స్‌ను రామ్‌చరణ్ సొంతం చేసుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించనున్న ఈ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్లు మార్పులు చేయనున్నారు. ఇక ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం చాలామంది స్టార్ హీరోయిన్లు పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిరుకు చెల్లిగా అనుష్క శెట్టిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో మూవీ టీం సంప్రదింపులు జరిపినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చదవండి : Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం బర్త్‌డే: సైడ్ ఆర్టిస్ట్‌గా త్రిష తొలి సంపాదన ఎంతో తెలుసా! -
Anushka Shetty: ముద్దొస్తున్నావ్, దిష్టి తీయించుకో!
టాలీవుడ్ అగ్రకథానాయిక అనుష్క నిశ్శబ్ధం తర్వాత కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. కానీ రారా కృష్ణయ్య చిత్రానికి దర్శకత్వం వహించిన పి.మహేశ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్లు గుసగుసలైతే వినిపిస్తున్నాయి. జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. నలభై ఏళ్ల అమ్మాయి, పాతికేళ్ల అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి అని టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. అయితే ఈ సినిమా కోసమో, లేదంటే సినిమాలు చేయడంలో గ్యాప్ వచ్చినందువల్లో ఏమోగానీ అనుష్క లావెక్కింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే బొద్దుగుమ్మగా మారిన అనుష్క ఫొటోలను చూసిన నెటిజన్లు 'భలేగున్నావ్, తెగ ముద్దొస్తున్నావ్.. బుగ్గలు బర్గర్లా ఉన్నాయ్.. దిష్టి తీయించుకో.. చబ్బీ గర్ల్..' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది సైజ్ జీరో సినిమా సమయంలోని ఫొటోనా? అని అనుమానాన్ని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు.. స్వీటీ ఎప్పుడు సన్నబడుతుందంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. చదవండి: త్వరలోనే అనుష్క పెళ్లి, తనకంటే చిన్నవాడైన వ్యాపారవేత్తతో..! -
ఎలాగు వారిని తీసుకురాలేము, కానీ మరొకరు అలా..: అనుష్క
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కొరలుచాస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది మహమ్మారి మరింత ప్రభావం చూపేడుతోంది. రోజురోజుకు కోవిడ్ మరణాలు రెట్టింపవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజయకీయ ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలంటే ప్రజలకు సందేశాలు ఇస్తు వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్రనటి అనుష్క శెట్టి సైతం ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ‘ప్రస్తుత క్టిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాగున్నారని అనుకుంటున్నాను. పోయిన వారిని తిరిగి ఎప్పటికీ తీసుకురాలేము. అయితే ఈ కరోనాకు మరొకరు బలికాకుండా మాత్రం జాగ్రత్త పడగలం. ఇందుకోసం ఒకరికొకరం సాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. దీని నుంచి బయటప పడాలంటే అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండేందుకే ప్రయత్నించండి’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ‘మీకు మీరే స్వీయ నిర్భంధాన్ని విధించుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. వారితో సమయాన్ని గడుపండి. ప్రతీ ఒక్కరికీ వారి బాధను ఎలా చెప్పుకోవాలో తెలిసి ఉండకపోవచ్చు. అందరూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ చాలా అవసరం. అలాగే ఇతరులకు చేతనైన సాయం చేయండి. అది ప్రార్థనలైనా కావచ్చు. మనం ఈ కష్టకాలాన్ని అధిగమిస్తాం. నెగెటివిటీ మీద దృష్టి పెట్టి మనకున్న శక్తిని వృథా చేసుకోవద్దు. మానవ శక్తిని మనమంతా కలిసి బయటకు తీసుకురావచ్చు’ అంటూ స్వీటీ సందేశాన్ని ఇచ్చారు. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) చదవండి: త్వరలోనే స్వీటీ పెళ్లి, తనకంటే చిన్నవాడైన వ్యాపారవేత్తతో..! ‘బిల్లా’లో నా బికినీపై అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా.. -
త్వరలోనే స్వీటీ పెళ్లి, తనకంటే చిన్నవాడైన వ్యాపారవేత్తతో..!
టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో మోస్ట్ బ్యాచిలరేట్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది అనుష్క శెట్టి పేరు. ఆమె పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పరిశ్రమలో డార్లింగ్ ప్రభాస్- అనుష్కల జోడి క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనేది ఇటూ స్వీటీ, అటూ డార్లింగ్ అభిమానుల కోరిక. ఈ క్రమంతో గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట హల్చల్ చేసింది. అది విని వీరిద్దరి అభిమానులు తెగ సంబరపడిపోయారు. అయితే దీనిపై ప్రభాస్, అనుష్కలు స్పందించి తాము కేవలం స్నేహితులమే అని క్లారిటి ఇచ్చి అందరిని నిరాశపరిచారు. దీంతో స్వీటీ ఎవరిని పెళ్లాడబోతుందా, ఆ లక్కీఫెలో ఏవరాని తెలుసుకునేందుకు ఆమె అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఆమె.. ఈ మధ్య కాస్తా మూవీస్ తగ్గించింది. దీంతో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపోతోంది. ఈ క్రమంలో అనుష్కకు త్వరలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట. దీనికి స్వీటీ కూడా ఓకే అనడంతో వరుడి వేటలో పడినట్లు సమచారం. కొంతకాలంగా మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి చివరకు ఓ అబ్బాయి దొరికినట్లు సమాచారం. ఆ అబ్బాయి దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుగా తెలుస్తోంది. దీంతో అతడితోనే మన స్వీటి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. అయితే అతడు అనుష్క కంటే వయసులో చిన్నవాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అంతా కుదిరితే కరోనా పరిస్థితులు సాధారణం స్థితికి వచ్చాక ఇరుకుంటుంబాలు చర్చించుకుని పెళ్లికి ముహుర్తం పెట్టుకొవాలనుకుంటున్నట్లుగా వినికిడి. కాగా ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అనుష్క స్పందించే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘బిల్లా’లో నా బికినీపై అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా.. పోకిరి మూవీకి 15 ఏళ్లు.. నమ్రత కామెంట్.. వైరల్ అవుతోన్న జూ. ఎన్టీఆర్ అరుదైన వీడియో.. -
‘బిల్లా’లో నా బికినీపై అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా..
ఇండస్ట్రీలో అనుష్క శెట్టి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వీటీ అని ముద్దుగా పలుచుకునే ఈ బెంగళూరు భామ సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత విక్రమార్కుడు వంటి చిత్రాల్లో గ్లామరస్‌గా కనిపించిన అనుష్క.. తన మొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘అరుంధతి’లో జేజమ్మగా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో తన నటనకు వంద శాతం మార్కులు కొట్టెసింది అనుష్క. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో ఒక్కసారిగా స్వీటీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి తెలుగు, తమిళంలో అగ్రనటిగా రాణించిన ఆమె ప్రస్తుతం సినిమాలు తగ్గించి కేవలం లేడీ ఓరియంటెడ్ పాత్రలనే ఎంచుకుంటోంది. అయితే మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిల్లా’ మూవీలో బికినీ వేసి అందాలు ఆరబోసిన స్వీటీ బయట మాత్రం చాలా సంప్రదాయంగా ఉంటుంది. ఏ మూవీ ఆడియో ఫంక్షన్ అయినా, ఇతర ఈవెంట్లు అయినా చీరలో లేక సల్వార్ కమీజ్లోనో కనిపిస్తుంది. స్వీటీ గ్లామరస్ పాత్రలు చేసినప్పటికి బిల్లాలో ఇంకాస్తా డోస్ పెంచి బికినీలో ఫిదా చేసింది. అయినప్పటికి అనుష్క పాత్రకు పాజిటివ్ టాక్ వచ్చింది. అంతటి రేంజ్లో ఎక్స్పోజ్ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అనుష్కకు వ్యక్తిగతంగా అలాంటి దుస్తులు అంటే ఇష్టం ఉండవని ఇదివరకే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సైతం ఓ ఇంటర్వ్వూలో ఇదే విషయం మాట్లాడుతూ బిల్లాలో తన పాత్రను గుర్తుచేసుకుంది. ఇందులో తను బికినీ ధరించడంతో తన తల్లి చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యపరిచాయని చెప్పింది. ‘మా అమ్మ నేను పద్దతిగా ఉండాలనుకుంటుంది. అది వ్యక్తిగతంగా అయినా వృత్తిపరంగా అయినా. అయితే బిల్లా సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను ఇంకా స్టైలిష్‌గా ఉండొచ్చు కదా.. సగం పద్దతిగా, సగం మోడ్రన్‌గా ఎందుకుంటావ్ అని అంది. అప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే తన నుంచి ఆ వ్యాఖ్యలు వస్తాయని నేను ఎప్పుడు ఊహించలేదు’ అంటూ స్వీటీ చెప్పుకొచ్చింది. చదవండి: నాని మూవీకి హ్యాండ్ ఇచ్చిన నజ్రీయా, షూటింగ్ వాయిదా! Bandla Ganesh: తమిళ మూవీ రీమేక్, హీరోగా బండ్ల గణేశ్ -
అనుష్కతో నవీన్ పొలిశెట్టి మూవీ..టైటిల్, స్టోరీ ఇదే!
నలభై ఏళ్ల మహిళ, పాతికేళ్ల అబ్బాయి ప్రేమలో పడతారు. వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలియడానికి చాలా సమయం ఉంది. నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి ప్రధాన పాత్రధారులుగా మహేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. నవీన్, అనుష్క ఒరిజినల్ పేర్లనే ఇలా చమత్కరించి టైటిల్‌గా పెట్టడం బాగుందని అంటున్నారు నెటిజన్లు. మరి.. ఈ టైటిలే ఖరారవుతుందా? వెయిట్ అండ్ సీ. -
అనుష్కకు ‘అరణ్య’ స్పెషల్ గిఫ్ట్
‘భళ్లాలదేవుడు’ రానా దగ్గుబాటి, ‘దేవసేన’ అనుష్క శెట్టికి పంపిన బహుమతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా రానా నటించిన ‘అరణ్య’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రానా, అనుష్కకు ఓ గిఫ్టును పంపాడు. రానా పంపిన ఈ బహుమతిని అనుష్క సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోయింది. అలాగే భళ్లాలదేవుడికి స్వీటి ధన్యవాదాలు తెలుపుతూ ‘అరణ్య’ మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపింది. అదే విధంగా రానా ఇలాంటి బహుమతులనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు, అక్కినేని వారి కోడలు సమంత కూడా పంపాడు. రానా పంపిన ఈ బహుమతులను ఉపాసన, సమంతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అరణ్యకు మంచి హిట్ రావాలని ఆశించారు. కాగా అనుష్క చివరిగా నిశ్శబ్ధం మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనుష్క కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు. ఏ సినిమా చేయబోతున్నారనేది కూడా ఎలాంటి స్పష్టత లేదు. అయితే స్వీటీ ఓ సినిమాకు కమిట్ అయ్యారనేది తాజా సమాచారం. సందీప్ కిషన్ హీరోగా ‘రారా కృష్ణయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించిన పి. మహేశ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సరికొత్త పాయింట్‌తో రూపోందనున్న ఈ మూవీలో అనుష్క, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో నటిస్తున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) చదవండి: ‘అరణ్య’ మూవీ రివ్యూ యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్న అనుష్క! -
యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్న అనుష్క!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాబితాలో అనుష్క శెట్టి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించిన ఈ భామకు ప్రస్తుతం సినిమాలు కరువయ్యాయి. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన అనుష్క.. ఇప్పుడు మాత్రం అవకాశాల కోసం ఎదురు చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన నిశ్శబ్దం కూడా అట్టర్ ప్లాప్‌ను ముటగట్టుకుంది. ఇప్పటి వరకూ మన స్వీటి చేతిలో ఒక్క సినిమా లేదు. అయితే ఈ కన్నడ బ్యూటీకి చెందిన ఓ విషయం తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘రారా.. కృష్ణయ్య’ సినిమా దర్శకుడు మహేష్ పీ డైరెక్షన్లో అనుష్క ఓ సినిమాను ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోంది. ఆ ప్రొడక్షన్లో అనుష్క బాగమతితో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చేయబోయే సినిమాలో అనుష్క యువ హీరో నవీన్పొలిశెట్టితో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఎక్కవ వయసున్న అమ్మాయి(40), తక్కువ వయసున్న అబ్బాయి(25) మధ్య నడిచే లవ్ స్టోరిగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇప్పుడు వరస సినిమాలతో నవీన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ హీరో అయితే కథకు బాగుంటాడని యువీ క్రియేషన్స్ భావించడంతో ఈయన్నే తీసుకున్నట్లు టాక్. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరోవైపు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం జాతి రత్నాలు అనే మూవీ చేస్తున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. కామెడీ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి: ట్రోలింగ్: నీకు 60 ఏళ్లా? వ్యాక్సిన్ తీసుకున్నావ్.. పోలీసులను ఆశ్రయించిన టాలీవుడ్ దర్శకుడు -
ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్: అనుష్క
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్‌లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో 750 మంది మహిళా పోలీసులున్నారన్నారు. నగరంలో బుధవారం ‘షీ పాహి’ మొదటి వార్షికోత్సవం 2021 ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. షీ పాహి కార్యక్రమం ఏర్పాటు ద్వారా మహిళా సిబ్బందిలో స్పూర్తి నింపుతున్నామన్నారు. సీనియర్ అధికారుల్లో కూడా 50 శాతం మహిళలు ఉన్నారని, మహిళా సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. వుమెన్ సిబ్బంది ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ట్రాఫిక్‌లో సైతం మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. చదవండి: శభాష్ పోలీస్.. నిముషాల్లో స్పాట్‌కు.. ఇక్కడ ఉన్న ప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్ లాంటి వారని హీరోయిన్ అనుష్క శెట్టి అన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా బాగా పని చేశారని, తనను ఇలాంటి కార్యక్రమానికి పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇంత మంది మహిళా పోలీస్‌లు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు. షీ పాహి అనే పేరు పెట్టడం చాలా బాగుందన్నారు. సమాజంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసులు లేకుండా జీవితాన్ని ఊహించలేమంటూ కొనియాడారు. వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలతో సత్కరించారు. పోలీసులతో అనుష్క ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2014లె షీ టీమ్స్‌ను మొదలు పెట్టామని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు. విధుల్లో స్త్రీ, పురుషులని ఎలాంటి వివక్ష ఉండదని, షీ టీమ్స్‌లో పురుషులుకూడా ఉన్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. భరోసా సెంటర్లు రాష్ట్రంలో 4 ఉన్నాయని, 2021లో భరోసా సెంటర్స్ సంఖ్య 10కి పెంచుతామని తెలిపారు. సైబరాబార్లో ఒకేసారి 2058 కెమెరాలు పెట్టారని పేర్కొన్నారు. -
అనుష్క కొత్త సినిమా.. సరికొత్త లుక్‌లో స్వీటీ
‘నిశ్శబ్దం’ తర్వాత కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు అనుష్క. ఏ సినిమా చేయబోతున్నారనేది కూడా ఎలాంటి స్పష్టత లేదు. అయితే స్వీటీ ఓ సినిమాకు కమిట్ అయ్యారనేది తాజా సమాచారం. సందీప్ కిషన్ హీరోగా ‘రారా కృష్ణయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించిన పి. మహేశ్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం. (చదవండి: హైదరాబాద్‌లో అనుష్క.. ఫొటోలు వైరల్) అందుకే అనుష్క ఈ సినిమా కమిట్ అయ్యారట. ఇందులో ఆమె సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని టాక్. అందుకోసం మేకోవర్ కూడా అవుతారట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. (చదవండి: అనుష్క–విజయ్– ఓ సినిమా?) -
తమన్నా పాటకు.. అనుష్క ఫిదా
తమన్నా.. ఈ పేరు వింటేనే ఓ పాలరాతి బొమ్మ కళ్ల ముందు కదలాడుతుంది. అంతటి అందం తమ్మన్నా సొంతం. తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంటూ.. టాలీవుడ్, బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దుసుకెళ్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. తెలుగులో వెంకటేశ్ సరసన ఎఫ్3, గోపిచంద్‌తో సిటీమార్, నితిన్‌తో ‘అంధా ధున్’ తెలుగు రీమేక్, సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇన్ని రోజులు తన నటన, డాన్స్‌తో అందరిని ఆకట్టుకున్న ఈ భామ.. తాజాగా తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. తనలో దాగిఉన్న సింగర్‌ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) హృతిక్ రోషన్, ప్రీతి జింటా నటించిన మిషన్ కశ్మీర్ చిత్రంలోని సోచే కే జీలోన్ పాటను పాడి, ఆ వీడియని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బెంగళూరులో ఉన్న వాతావరణం తనకు ఇలా ఉందంటూ తమన్నా.. ఆ పాటను ఆలపించింది. ప్రస్తుతం తమన్నా సాంగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమన్నా గాత్రానికి నెటిజన్లు వందకు వంద మార్కులు వేస్తున్నారు. హీరోయిన్ అనుష్క శెట్టి కూడా మిల్కీబ్యూటీ సాంగ్‌కి ఫిదా అయింది. లవ్ సింబల్‌తో పాటు, హగ్ ఎమోజీని కామెంట్‌గా పెట్టింది. కాగా, తమన్నా తెలుగు సినిమాలతో పాటు హిందీలో భోలే చూడియాన్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఇక వీటితో పాటు తెలుగులో తమన్నా.. క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మిలో నటించింది. ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. -
గోదారి తీరంలో టాప్ హీరోయిన్ రహస్య పర్యటన
సాక్షి, సీతానగరం(తూర్పుగోదావరి): సినీనటి అనుష్క పురుషోత్తపట్నం వద్ద గోదావరి వద్ద కొద్దిసేపు విహరించారు. బెంగళూరు ఏఎంసీ విద్యాసంస్థల అధినేత కల్లూరి రామకృష్ణ పరమహంస సతీమణి గీతా పరమహంస నాలుగు రోజుల క్రితం సినీనటి అనుష్కతో పురుషోత్తపట్నంలోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే గోదావరిలో విహారయాత్ర జరిపినట్టు సమాచారం. ఈ యాత్రను అత్యంత గోప్యంగా ఉంచారు. బుధవారం అనుష్క తదితరులు మరపడవపై దేవీపట్నం మండలం గండి పోశమ్మ అమ్మవారిని, పట్టిసీమ వీరభద్రుని దర్శించిన అనంతరం తిరిగి పురుషోత్తపట్నం ఉదయం 11 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు గీతా పరమహంసతో పాటు తిరుగు పయనమయ్యారు. చదవండి: పోలవరంలో హీరోయిన్ అనుష్క -
పోలవరంలో హీరోయిన్ అనుష్క
సాక్షి, ఏలూరు : ప్రముఖ హీరోయిన్ అనుష్క బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ‘బాహుబలి’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన ప్రశాంతి త్రిపురనేని, మరో స్నేహితురాలుతో అనుష్క ఇక్కడకు వచ్చారు. పడవలో గోదావరిలో ప్రయాణించిన వీరంతా మాస్క్‌లు ధరించి ఉండటంతో వీరిని స్థానికులు త్వరగా గుర్తుపట్టలేకపోయారు. కాగా అనుష్క నటించిన నిశ్శబ్ధం చిత్రం ఓటీటీ ద్వారా విడుదలైన విషయం తెలిసిందే. (బుల్లితెరపై నిశ్శబ్దం...) -
అనుష్క అడ్డాలో.. భూమి పడ్నేకర్
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అనుష్క 'భాగమతి' ఇప్పుడు హిందీలో రీమెక్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. హిందీ రీమెక్‌లో ప్రధాన పాత్ర పోషించిన భూమి పడ్నేకర్ తన ట్విటర్ వేదికగా సినీ ప్రమోషన్‌ను మొదలుపెట్టింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోలో.. భూమి నటన విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తోంది. ఈ సినిమా మొదటి నుంచి వివాదాల్లో ఉంది. ముందుగా ఈ సినిమా టైటిల్‌గా 'దుర్గావతి' అని ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం పేరును 'దుర్గామతి' గా మార్చారు. 'మాతృకను ' రూపొందించిన డైరెక్టర్ అశోక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ' తర్వాత అక్షయ్ నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డిసెంబరు 11న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానుంది. తెలుగులో అనుష్క నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ‘ఎవరు పడితే వారు రావడానికి ఇది పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా' అని ఆమె చెప్పే డైలాగ్స్‌కి అభిమానుల కేరింతలతో థియేటర్లు దద్దరిల్లాయి. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలవుతున్న ‘దుర్గామతి’ఇప్పుడు ప్రేక్షకులను ఎంతమేరకు అలరించనుందో వేచిచూడాలి. -
దుర్గావతి కాదు దుర్గామతి
అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘భాగమతి’. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్. అశోక్ జి. దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అయింది. అనుష్క పోషించిన పాత్రలో భూమి ఫెడ్నేకర్ నటించారు. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అశోక్ ఈ రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ఇది వరకు ‘దుర్గావతి’ అని టైటిల్ పెట్టారు. తాజాగా ‘దుర్గామతి: ది మిత్’గా మార్చారు. అలాగే ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు నిర్మాతల్లో ఒకరైన అక్షయ్ కుమార్. డిసెంబర్ 11న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. -
బుల్లితెరపై నిశ్శబ్దం...
మూగ, చెవుడు ఉన్న ఒక క్యారెక్టర్ అనగానే అది చేయడానికి స్టార్ హీరోయిన్లు పెద్దగా సాహసించరు. కానీ అనుష్క ఈ సాహసం చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే అనుష్క ఎప్పుడూ ముందుటారన్న సంగతి తెలిసిందే. అందుకే చాలా గ్యాప్ తర్వాత అనుష్క సినిమా చేస్తుంది, అది కూడా మూగ, చెవుడు క్యారెక్టర్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తన పక్కన హీరోగా ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్ అని చెప్పగానే సినిమాకు హైప్ రెట్టింపయ్యింది. సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఒకొక్క అప్డేట్ బయటకి వచ్చింది. (మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్) తీరా రిలీజ్ డేట్ ప్రకటించగానే లాక్డౌన్ అంటూ ఎవ్వరూ ఊహించని విధంగా 8 నెలల బ్రేక్ వచ్చింది. థియేటర్లు తెరుచుకుంటాయేమో.. నిశ్శబ్ధాన్ని ప్రేక్షకులు వెండితెరపై చూసే అవకాశం వస్తుందేమో అని మూవీ టీమ్ అంతా ఆసక్తిగా ఎదురుచూసింది. ఎంతకీ థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనబడకపోవడంతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల అయ్యింది. నటీనటుల యాక్టింగ్ తప్ప ఇంకా ఏ విభాగంలోనూ సినిమాకు మంచి మార్కులు పడలేదు. షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, మైఖేల్ మాడ్సెన్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది. తన పాత్ర కోసం అనుష్క ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పెయింటింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. ఇంత చేసినా సినిమాకు ప్రాణం లాంటి క్లైమాక్స్‌ను దర్శకుడు హేమంత్ మధుకర్ సరిగా చూపించలేకపోయాడు. అందుకే దీనికి ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి స్పందన రాలేదు. ఓటీటీలో అంతగా ఆదరణ పోందలేని ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై రాబోతుంది. ఇటీవల నిశ్శబ్దం శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది. అనుష్క దీని తర్వాత రెండు సినిమాలను ఓకే చేశారని, అందులో ఒకటి ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్లనుందని ఒక ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టారు. (బాహుబలి తిరిగొచ్చాడు) -
మీ కలల్ని నెరవేర్చుకోండి
‘అమ్మాయిలూ... మీ కలల్ని నెరవేర్చుకోండి. ధైర్యంగా నిలబడండి. మీ గొంతు వినపడేలా చేయండి’ అంటున్నారు మహేశ్ బాబు, అనుష్క. ఆదివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భంగా తమ సోషల్ మీడియాలో ఈ విషయం గురించి స్ఫూర్తివంతమైన వాక్యాలు రాసుకొచ్చారు మహేశ్‌బాబు, అనుష్క. ‘‘అమ్మాయిలు ప్రపంచాన్ని కాంతివంతం చేస్తారు. కానీ వెలుగు చూడటానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. మన దేశానికి స్పిరిట్ అమ్మాయిలే అని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అమ్మాయిలతో నిలబడదాం. వాళ్ల గొంతు వినపడేలా చేద్దాం. వాళ్ల హక్కుల కోసం నిలబడదాం’’ అన్నారు అనుష్క. మహేశ్ మాట్లాడుతూ –‘‘కూతురికి మించిన గొప్ప బహుమతి ఏదీ లేదంటాను నేను. తన ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్న మా అమ్మాయి (సితార)ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ధైర్యంగా ఉండు. నీకు రావాల్సిన దానికోసం పోరాడు. నీ కలల్ని సాకారం చేసుకో’’ అని కుమార్తె సితార ఫొటోను షేర్ చేశారు. అలాగే ప్రపంచంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉండేలా అందరూ కృషి చేయాలని కూడా మహేశ్ పేర్కొన్నారు. -
ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి
ఇటీవలే ట్విట్టర్లో జాయిన్ అయ్యారు అనుష్క. ఆదివారం సాయంత్రం అభిమానులతో ఆమె చిట్‌చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలు. ► యోగా టీచర్‌గా మీరు నేర్చుకున్న విషయం? మనలో ప్రతి ఒక్కరూ భిన్నమైన వాళ్లమే. మనల్ని మనం కోల్పోకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి, గౌరవించాలి. నిరంతరం స్వీయ విమర్శ చేసుకుంటూ ఉండాలి. ► మీకు ఇష్టమైన జంతువు? డాల్ఫిన్ అంటే బాగా ఇష్టం. ► లాక్డౌన్లో మీరు నేర్చుకున్న విషయం? మన జీవితం, మన చుట్టూ ఉన్నవన్నీ ఎప్పుడూ మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుందాం. ► మీకు నచ్చిన పుస్తకం? ఆల్కెమిస్ట్ ► గతానికి సంబంధించి ఏదైనా మార్చేసే అవకాశం వస్తే ఏం మారుస్తారు? ఇప్పటివరకూ జరిగిన ప్రతి విషయం నన్ను మంచి స్థాయిలో నిలబెట్టింది. అందుకే ఏదీ మార్చను. ► ప్రభాస్‌తో ఇంకో సినిమా చేయండి... మేమిద్దరం జంటగా నటించాల్సిన కథ కుదిరితే తప్పకుండా నటిస్తాం. ► కొత్త సినిమా విశేషాలు చెప్పండి.. త్వరలోనే నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ప్రకటన వస్తుంది. ► మీకు స్ఫూర్తిగా నిలిచినవాళ్ల పేర్లు చెప్పండి? మా అమ్మానాన్న, యోగా గురువు, అలానే నేను ప్రతి రోజూ కలిసేవాళ్లు. అందరూ నాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నారు. -
శ్రీలతా రెడ్డి, మంత్ర, సుజాత.. ఎవరబ్బా?!
(వెబ్ స్పెషల్): పుట్టగానే అమ్మ నాన్న పేరు పెడతారు. ఆ తర్వాత ముద్దు పేర్లు వచ్చి చేరతాయి. మరి కొందరు వారు చేస్తున్న పనిని బట్టి పేర్లు తెచ్చుకుంటారు. ఆ పేరుతోనే ఫేమస్ అవుతారు. ఇక సినీ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇండస్ట్రీలో విజయాలు సాధించాలని కొందరు కొత్త పేర్లు పెట్టుకుంటారు.. మరి కొందరు ఉన్న పేరుకే మార్పులు చేసుకుంటారు. ఇక కొందరికి దర్శకులే నామకరణం చేస్తారు. అలాంటి వారు సొంత పేరుతో కన్నా ఈ పేరుతోనే బాగా గుర్తింపు పొందుతారు. మరి ఇండస్ట్రీలో ఇలా పేరు మార్చుకుని.. స్టార్‌గా ఎదిగిన హీరోయిన్లు ఎవరో చూడండి.. శ్రీదేవి బాల్యంలోనే ఇండస్ట్రీలో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగి.. ఫిమేల్ సూపర్ స్టార్‌గా పేరు సంపాదించున్నారు అందాల నటి శ్రీదేవి. అయితే ఆమె కూడా పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆ తర్వాత శ్రీదేవిగా మారి.. ఇండియాను ఓ ఊపు ఊపేసారు. జయసుధ మూవీస్‌లో సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జయసుధ. అయితే ఆమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు సుజాత. (మార్పు అవసరం) జయప్రద అందం, అభినయం, నాట్య మయూరి అయిన జయప్రద అసలు పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో రాణిస్తున్నారు. సౌందర్య పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగించి ఆడపడుచు అయ్యారు సౌందర్య. టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో అకాల మృత్యువు ఆమెను కబలించింది. సావిత్రిలాగా తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య కూడ ప్రేక్షకుల మదిలో జీవించే ఉంటారు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈమె అసలు పేరు సౌమ్య అనే విషయం అందరికి తెలిసిందే. (రెండు కోట్ల ప్రేమ) రోజా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె కూడా పేరు మార్చుకున్నారు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. రంభ నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల బొమ్మ రంభ. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మీ. భూమిక ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త సినిమాల కోసం భూమికగా మారారు. హీరోయిన్గా వచ్చిన కొత్తలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు. పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (నన్ను నేను తెలుసు కుంటున్నాను) అనుష్క ప్రయోగాత్మక చిత్రాలకు.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అనుష్క. బెంగుళూరుకి చెందిన అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాల్లో తప్ప, బయట ఆమెని అందరు స్వీటి అనే పిలుస్తారు. స్వతహాగా ఈమె యోగ టీచర్. నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ ‘చంద్రముఖి’ చిత్రంతో పరిచయం అయిన కేరళ బ్యూటి నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్ సినిమాల కోసం నయనతారగా మారింది. రాశి రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఆమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవారు. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది. అయితే రాశి అసలు పేరు విజయలక్ష్మి. ఇక వీరే కాక హీరో రజనీకాంత్, చిరంజీవి, సూర్య, పవన్ కళ్యాణ్, విక్రమ్ వంటి స్టార్ హీరోలు సైతం పేరు మార్చుకున్నారు. -
ఆదిపురుష్‌లో సీతగా.. అనుష్క క్లారిటీ
తాన్హాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే చిత్రం ఆదిపురుష్. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. రామాయణం కథాంశంతో 3డీలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క శెట్టి నటించబోతుందని అనేక వార్తలు వెలువడ్డాయి. రాముడిగా కనిపించనున్న ప్రభాస్‌కు జోడీగా సీత పాత్రలో స్వీటీ నటించనుందని, ఈ విషయంపై ఇప్పటికే అనుష్కను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ వదంతులపై అనుష్క స్పందించారు. తాను ఆదిపురుష్ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు. అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పేశారు. (ఆది పురుష్‌కి రెహమాన్?) ఇక అనుష్క నటించిన నిశ్శబ్దం ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైం వీడియోలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న స్వీటీ ఆదిపురుష్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా ఆదిపురుష్‌లో సీతగా మొదట కీర్తి సురేష్ నటించనున్నారని ఆ తర్వాత కియారా అద్వానీ, అనుష్క శర్మ ఇలా పలువురి పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి. కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆదిపురుష్‌లో పవర్ఫుల్ విలన్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. తెలగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2021లో సెట్స్ మీదకు వెళ్లనుంది. (బిగ్‌బాస్: అనుష్క అందుకే రాలేదట!) -
‘నిశ్శబ్దం’ సినిమాలో అనుష్క ఫోటోలు
-
బిగ్‌బాస్: అనుష్క అందుకే రాలేదట!
బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో ఓ ప్రత్యేకమైన అతిథి రానుందంటూ ఇటీవల బోలెడు వార్తలు చక్కర్లు కొట్టాయి. మొన్నటి ఆదివారం ఎపిసోడ్లో అగ్ర తార అనుష్క అతిథిగా రానుందని కొందరు, లేదు,లేదు.. హోస్ట్‌గా కనిపించనుందని మరికొందరు ఆమె అభిమానులను తెగ ఊరించారు. చివరాఖరికి స్వీటీ స్టేజీపై ఎక్కడా కనిపించకపోవడంతో నిరుత్సాహపడ్డారు. బిగ్‌బాస్ చరిత్రలోనే రెండో మహిళా వ్యాఖ్యాతగా నిలిచిపోతుందని కన్న కలలు కల్లలయ్యాయేనని బాధపడ్డారు. అయితే తాను ఎందుకు రాలేదన్న విషయం స్వీటీ క్లారిటీ ఇచ్చేశారు. ఇది కరోనా కాలం, ఏమాత్రం అజాగ్రత్త వహించినా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో బయటకు వెళ్లడం అంత మంచిది కాదు కనుక సినిమా ప్రమోషన్స్ చేసేందుకు అనుష్క నిరాకరించారు. (చదవండి: నిశ్శబ్దం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది) అసలే ఓటీటీలో రిలీజవుతున్న సినిమా, దీనికి తగిన ప్రచారం చేయకపోతే కష్టమని చిత్రయూనిట్ అభ్యర్థించడంతో ఎట్టకేలకు ఆమె ప్రమోషన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ ఓ కండీషన్ పెట్టారు. కేవలం ఆన్లైన్ ప్రమోషన్స్ మాత్రమే చేస్తానని తెలిపారు. బయటకు వెళ్లి, టీవీ ఛానల్స్‌లో పాల్గొనడం వంటివి చేయనని తేల్చి చెప్పారు. దీంతో ఈ కారణంగానే బిగ్‌బాస్ షోకు వెళ్లేందుకు సైతం నిరాకరించినట్లు పేర్కొన్నారు. కాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్ధం' సినిమాలో మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినీ పాండే కీలక పాత్రలను పోషిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కేవలం 55 రోజుల్లో తీయగలగడం విశేషం. (చదవండి: బిగ్‌బాస్: మెహబూబ్ సేఫ్, దేవి అవుట్!) -
బిగ్‌బాస్ షోలో కనిపించనున్న అనుష్క
థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసేముందు చిత్రయూనిట్ హంగామా అంతా ఇంతా కాదు. ప్రచారానికి అవసరమయ్యే అన్ని దారులను భీభత్సంగా వాడేసుకుంటారు. కానీ కరోనా వల్ల థియేటర్లు తెరుచుకునే దారులు కనిపించకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అందులో అగ్రతార అనుష్క సినిమా "నిశ్శబ్ధం" కూడా ఉంది. ఇది అక్టోబర్ 2న విడుదల కానుంది. సుమారు రెండేళ్ల తర్వాత చేస్తున్న చిత్రం, అందులోనూ మూగ పెయింటర్‌గా భాగమతి సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇంత ప్రత్యేకమైన ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నట్లే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓ వార్త అందరినీ ఆకర్షిస్తోంది. 'నిశ్శబ్ధం' చిత్రయూనిట్ బిగ్‌బాస్ షోలోకి అడుగు పెట్టి నానా హంగామా చేయనుందని రెండు రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై నిశ్శబ్ధం టీమ్ ఏమాత్రం స్పందించకుండా సైలెన్స్ పాటిస్తోంది. (చాలాసార్లు బతకాలనిపించలేదు: వితికా ) మరోవైపు ఆదివారం నాటి ఎపిసోడ్లో స్టేజ్‌పై అనుష్కను చూసి ఇంటిసభ్యులు సర్ప్రైజ్ అవడం ఖాయమంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అలాగే నాగ్, అనుష్కలను ఒకే ఫ్రేములో చూడబోతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం అనుష్క బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనుందని చెప్తున్నారు. అదే నిజమైతే తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే రెండో మహిళా యాంకర్‌గా అనుష్క నిలిచిపోతుందని స్వీటీ అభిమానులు సంబరపడుతున్నారు. కాగా గత సీజన్లో నాగ్ విదేశాల్లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటే అప్పుడు అతని స్థానంలో రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా డాన్, కింగ్, ఢమరుకం వంటి పలు చిత్రాల్లో నాగ్ సరసన స్వీటీ జోడీ కట్టారు. (అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ వచ్చేసింది) -
కీలకం కానున్న 'అనుష్క' సాక్ష్యం
అనుష్క, మాధవన్ జంటగా నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం అక్టోబరు 2న విడుదలకు సిద్ధంగా ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ సేతుపతి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నారు. అనుష్క బెస్ట్ ప్రెండ్ పాత్రలో షాలిని పాండే నటించారు. ఓ హత్యకేసులో నిందితురాలిగా షాలినిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మూగ, చెవిటి అమ్మాయిగా ఉన్న అనుష్క సాక్ష్యం ఈ కేసులో కీలకంగా మారనుంది. (నిశ్శబ్దం కూడా...) ఇక మాధవన్, అనుష్క ఓ దెయ్యముండే ఇంట్లోకి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే సన్సెన్స్ కొనసాగేలా ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాలో హాలీవుడ్ నటుడు అండ్రూ హడ్సన్, హీరోయిన్ అంజలి క్రైమ్ ఆఫీసర్లుగా కనిపించారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్స్‌లో సందడిచేసేది. కానీ లాక్డౌన్ కారణంగా సినిమా విడుదలకు బ్రేక్ పడింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్2న భారతదేశంతో పాటు 200 దేశాల్లో మా సినిమా విడుదల కానుంది. (ఓటీటీలో మొదటి బ్లాక్‌బస్టర్ మా ‘నిశ్శబ్దం’) -
అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ వచ్చేసింది.
స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్స్‌లో సందడిచేసేది. కానీ లాక్డౌన్ కారణంగా సినిమా విడుదలకు బ్రేక్ పడింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్2న 'నిశ్శబ్దం'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు నిర్మాత కోన వెంకట్ ప్రకటించారు. ఇప్పటికే ఆ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. దీంతో ఓటీటీ వేదికగా విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమాగా నిశ్శబ్దం నిలవనుంది. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు నటించిన ‘వీ’ సినిమా విడుదలైంది. పలు చిన్న సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అవుతున్నా పెద్ద సినిమాలు మాత్రం కాస్త ఆచితూచి అడుగులేస్తున్నాయి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. (స్వీటీ మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం? ) 🤫🤫🤫🤫🤫 https://t.co/Imz8HJgU2h — kona venkat (@konavenkat99) September 18, 2020 -
ఓటీటీలో అనుష్క సినిమా.. రేపే క్లారిటీ!
స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్డౌన్ కారణంగా థియేటర్లకు తాళం పడటంతో విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. (ఆ విషయంలో తగ్గేది లేదన్న స్వీటీ ) నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సినీ నిర్మాతలు రెడీ అయ్యారు. అంతేగాక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు(సెప్టెంబర్17) రానుంది. కాగా నిశ్శబ్దం మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అయితే అక్టోబర్ 2న 'నిశ్శబ్దం'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమాగా గుర్తింపు పొందుతుంది. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు నటించిన ‘వీ’ సినిమా విడుదలైంది. (అమెజాన్‌లో అనుష్క సినిమా..) -
ఆ విషయంలో తగ్గేది లేదన్న స్వీటీ
గ్లామరస్ పాత్రల నుంచి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల స్థాయికి ఎదిగిన నటి అనుష్క. బెంగళూరుకు చెందిన ఈ అమ్మడుని తెలుగు, తమిళ చిత్రాలు అగ్ర నటిగా చేశాయి. ప్రస్తుతం సెలెక్ట్ చిత్రాలనే చేస్తోంది. అనుష్క నటించిన తాజా చిత్రం సైలెన్స్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపొందింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఓ చిత్రం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అదేవిధంగా ఒక తమిళ చిత్రంలో అవకాశం అనుష్కను వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా అనుష్క నటించడానికి సిద్ధమవుతోంది. (రజనీ రెడీ) కాగా ఈ చిత్రం కోసం బ్యూటీ రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. అయితే అంత మొత్తాన్ని ఇవ్వడానికి దర్శక నిర్మాతలు నిరాకరించడంతో బేరసారాలు జరిగినట్లు సమాచారం. తాను బహుభాషా నటినని, తన చిత్రాలకు తెలుగు, తమిళం తదితర భాషల్లో మంచి ఆదరణ ఉంటుందని, కాబట్టి తన పారితోషికం విషయంలో తగ్గే సమస్య లేదని అనుష్క కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించనున్న విజయ్ సేతుపతి రూ. 10 కోట్లు పారితోషికం ఇస్తుండగా తనకు రూ. 3 కోట్లు ఇవ్వడం న్యాయం అని అనుష్క పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో చేసేదిలేక చిత్ర దర్శక నిర్మాతలు ఈ బ్యూటీకి డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించక తప్పలేదని తెలిసింది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాక్ డౌన్ ముగిసిన తర్వాత సెట్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. -
విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ
కోలీవుడ్‌లో ఒక కొత్త కాంబినేషన్‌కు శ్రీకారం పడబోతోందన్నది తాజా సమాచారం. మక్కళ్ సెల్వన్ విజయ్‌సేతుపతి, అందాల భామ అనుష్క కలిసి నటించనున్నారు అన్నదే ఆ వార్త. తమిళ చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా మంచి క్రేజ్ ఉన్న నటుడు విజయ్‌సేతుపతి. అయితే ఈయన హీరోగానే కాకుండా విలన్ గానూ విలక్షణ నటన ప్రదర్శిస్తూ నటుడిగా రాణిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం మామనిదన్, కడైశీ వివసాయి, యాదుం ఊరే యావరుం కెళీర్, లాభం, తుగ్లక్ దర్బార్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అదేవిధంగా విజయ్ హీరోగా నటించిన మాస్టర్ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా వీటితో పాటు శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా దేవర్ మగన్ చిత్రానికి సీక్వెల్‌గా తలైవాన్ ఇరుక్కిండ్రాన్ పేరుతో తెరకెక్కనున్న చిత్రంలో కమలహాసన్‌తో కలిసి విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే అనుష్క గురించి చెప్పాలంటే ఆమె చాలా కాలంగా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనే నటిస్తున్నారు. అలా ఆమె నటించిన తాజా చిత్రం సైలెన్స్. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం లాక్డౌన్ ముగిసిన తర్వాత తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఆ తర్వాత అనుష్క మరే చిత్రాన్ని ఒప్పుకోలేదు. దీంతో ఆమె నటనకు గుడ్ బై చెపుతోందని ప్రచారం ఓ వైపు జరుగుతోంది. కాగా అనుష్క చాలాకాలం క్రితమే దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు తనే స్వయంగా ప్రకటించింది. అయితే ఆ చిత్రం ఏమైందన్నది తెలియలేదు. కాగా ఇటీవల కమలహాసన్ హీరోగా వేట్టెయాడు విలైయాడు చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి గౌతమ్ మీనన్ సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. (నిరూపించుకునే అవకాశమివ్వండి) అంతేకాకుండా అందులో కమలహాసన్ సరసన అనుష్క నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత ఈ చిత్రంలో కమలహాసన్ జంటగా కీర్తి సురేష్‌ను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్రంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ సేతుపతికి జంటగా అనుష్క నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీన్ని వేల్స్ ఫిలింఇంటర్నేషనల్ పతాకంపై ఐసరీ గణేష్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఈ చిత్రానికి ఏఎల్.విజయ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. దీన్ని తమిళం, తెలుగు భాషల్లో నిర్మించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత జీవిత చరిత్రతో రూపొందిస్తున్న తలైవి చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. (రాఘవన్‌కి జోడీగా...) -
‘జింతాత జిత జిత జింతాత తా..’ గుర్తుందా!
‘పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్‌కే వెళతాడు పోస్టాఫీస్‌కు కాదు’, ‘చావు అంటే బయపడటానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకు అనుకున్నావారా రాథోడ్ విక్రమ్ రాథోడ్’, ‘జింతాత జిత జిత జింతాత తా...’ అంటూ ‘విక్రమార్కుడు’ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్‌లతో థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించారు మాస్ మహారాజ్ రవితేజ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటించారు. ఎంఎం కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రం విడుదలై నేటికి 14 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘విక్రమార్కుడు’ విశేషాలు మీకోసం.. అత్తిలి సత్తిబాబు (రవితేజ), దువ్వ అబ్బులు (బ్రహ్మానందం)తో వచ్చే కామెడీ సీన్స్, ఆ తర్వాత నీరజా గోస్వామి (అనుష్క)తో అత్తిలి లవ్ అండ్ రొమాన్స్ సీన్స్, మధ్యలో కీరవాణి అందించిన పాటలు ఇలా ఫస్టాఫ్‌లో వచ్చే ప్రతీ విషయం కొత్తగా, ఎంటర్టైన్గా ఉంటాయి. ఆ తర్వాత బావూజీ (వినీత్ కుమార్), టిట్లా(అజయ్)లతో విలనిజం, ఆ తర్వాత ఓ రేంజ్లో పోలీసాఫీసర్ విక్రమ్ రాథోడ్ ఎంట్రీ, ఫ్యామిలీ డ్రామా, గుర్తుండిపోయే ముగింపు ఇలా అన్నీ కలగలపి ‘విక్రమార్కుడు’ని అద్భుతంగా తీర్చిదిద్దారు జక్కన్న. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా కామెడీ, ఎమోషన్, డైలాగ్‌లతో థియేటర్ ఆడియన్స్‌కు మంచి ఎంటర్టైన్మెంట్ విందును అందించాడు. (సీఎం జగన్‌కు ధన్యవాదాలు: రాజమౌళి) ఇక ఈ సినిమా అనేక భాషల్లో స్ఠార్ హీరోలతో రీమేక్ అయినప్పటికీ తెలుగులో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో పోలీస్తే కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రేక్షకుల నాడీ తెలిసిన జక్కన్న రవితేజతో కలిసిన అద్భుత మ్యాజిక్ చేసిన ఈ చిత్రం ఇప్పటికీ టీవీల్లో వస్తే అందరూ టీవీల ముందు వాలిపోతారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రావాలని అటు రవితేజ అభిమానులతో పాటు ‘విక్రమార్కుడు’ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందో లేదో జక్కన్నకే తెలియాలి. (జగన్నాథమ్ వచ్చి మూడేళ్లయింది) ‘విక్రమార్కుడు’లో అందరికీ నచ్చే డైలాగ్ ‘‘నాకు భయం లేదని ఎందుకనుకుంటున్నారు సర్. ఎప్పుడో ఒక్కసారి కాదు రోజులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటా సర్. నాలుగేళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణమైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సర్. మీకు చెప్పిన తలుపు చప్పుళ్లు, ఫోన్ రింగులు రావొచ్చు, రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు కచ్చితంగా వచ్చి తీరుతుంది సర్. ఆ రోజు దాన్ని కళ్లలోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సర్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్‌లో ఉంటుంది సర్. దానికి ఒకటే కోరిక సర్.. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్లలో బెరుకు ఉండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం ఉండాలి సర్’’ (భవిష్యత్తుని చూపెట్టే టెనెట్) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_991257758.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహేశ్ డైరెక్షన్లో స్వీటీ చిత్రం?
‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవీ’, ‘భాగమతి’ వంటి సూపర్‌డూపర్‌హిట్ చిత్రాలతో ఫుల్ క్రేజ్ సాధించిన స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క. ఇప్పటికే దక్షిణాదిన భారీ బడ్జెట్‌తో కూడిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా అనేదానిపై దర్శకనిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. (సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!) అయితే ‘నిశ్శబ్దం’ సినిమా గురించి కాస్త పక్కన పెడితే.. అనుష్క మరో భారీ లేడీ ఓరియెంట్ చిత్రానికి కమిట్ అయిందని సమాచారం. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. ఇప్పటికే యువీ క్రియేషన్స్‌లో మిర్చి, భాగమతి చిత్రాలను స్వీటీ చేసిన విషయం తెలిసిందే. సందీప్ కిషన్‌తో ‘రారా కృష్ణయ్య’ తీసిన పి. మహేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
రష్యాలోనూ ఇరగదీస్తున్న బాహుబలి-2
ఢిల్లీ : తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడనవసరం లేదు. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా బాహుబలి ఫ్రాంచైజీ నిలిచింది. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ఇండియన్ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. ఇప్పటికీ భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి 2 సినిమా రష్యాలోనూ ఇరగదీస్తోంది. అయితే థియోటర్లో అనుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా అక్కడి టీవీ చానెల్లో ప్లే అవుతుంది. రష్యన్ వాయిస్‌ఓవర్‌తో డబ్బింగ్ చేసి విడుదల చేసిన బాహుబలి 2 సినిమా అక్కడి టీవీల్లో దుమ్ముదులుపుతుంది. (నిరాడంబరంగా నటుడి వివాహం) తాజాగా సినిమాలోని ఒకసన్నివేశాన్ని రష్యన్ వాయిస్ ఓవర్‌తో ఉన్న డైలాగ్‌తో రష్యన్ ఎంబసీ తమ ట్విటర్లో షేర్ చేసింది. ఈ సందర్భంగా ' ఒక ఇండియన్ సినిమా రష్యాలో ఇంత పాపులారిటీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. బాహుబలి 2 సినిమా రష్యన్ వాయిస్ ఓవర్లో టీవీల్లో ప్లే అవుతుంది' అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ నెటిజన్లు ఒక భారతీయ సినిమాను రష్యాలో విడుదల చేయడం సంతోషంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. బాహుబలి తర్వాత కేజీఎఫ్ సినిమాను కూడా రష్యన్ వాయిస్‌ఓవర్‌తో విడుదల చేయాలంటూ కోరుతున్నారు.(బాలయ్య వ్యాఖ్యలపై సి. కళ్యాణ్ వివరణ) దాదాపు రూ. 250 కోట్లతో తెరకెక్కిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ, హిందీ, చైనీస్, జపనీస్ భాషల్లో రిలీజై దాదాపు రూ. 2600 కోట్లు కొల్లగొట్టింది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు బాగాలుగా తెరకెక్కిన బాహుబలి సిరీస్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్, అనుష్క, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు. -
సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క అండ్ టీం. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్ మధుకర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: నటుడు సూర్యకు గాయాలు..!) ‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడి ట్వీట్ ఆసక్తిరేపుతోంది. ఇక షూటింగ్‌లకు, థియేటర్లకు అనుమతుల్వివ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదల చేసే ప్రక్రియను కొన్నిరోజుల పాటు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. (బన్నీ సినిమాలో యాంకర్ సుమ!) Both our films #nishabdham Telugu and #silence given U/A censor certificate and I am overwhelmed by the response of the #cencorboard panel members and my sincere thanks to them for there advice to release the film first in theatre 🙏 pic.twitter.com/bIZTOvjY7q — Hemantmadhukar (@hemantmadhukar) May 26, 2020 ‘మా చిత్రం ‘నిశ్శబ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము’ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. థియేటర్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ‘నిశ్శబ్దం’ విడుదలపై ఆలోచించాలని చిత్రబృందం భావిస్తుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అమెజాన్‌లో అనుష్క సినిమా..
కరోనా లాక్డౌన్ కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఈ లాక్డౌన్ కాలంలో అన్ని భాషల్లో కలిపి దాదాపు వంద సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. దీంతో విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలను ఏం చేయాలో దర్శకనిర్మాతలకు పాలుపోవడం లేదు. ఈ క్రమంలో దర్శకనిర్మాతలకు కనిపిస్తున్న ఒకే ఒక్క దారి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్. ఎంతో రేట్ మాట్లాడుకొని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ముఖ్యంగా నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే పాపులారిటీ తగ్గుతుందనే భయాన్ని నటీనటులు వ్యక్తపరుస్తున్నా, థియేటర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా నిర్మాతలు మాత్రం డిజిటల్లోనే విడుదల చేయాలని ఫిక్సవుతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు డిజిటల్ బాట పట్టగా మరికొన్ని చిత్రాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో స్వీటీ అనుష్క శెట్టి నటించిన ‘నిశ్శబ్దం’ అమెజాన్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఆమెజాన్లో జూన్ నెలలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు బావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ సినమాకు రికార్డు స్థాయిలో డిజిటల్ హక్కులను ఆమెజాన్ కొనగోలు చేసిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రిలీజ్ విషయం అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించాల్సిన అవసరం ఉంది.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. చదవండి: మహేశ్ కాదనడంతో చరణ్‌తో.. ‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’