'స్వీటీ చాలా అందంగా కనిపించింది'.. రాజమౌళి ట్వీట్ వైరల్! | S. S. Rajamouli Appreciates Miss Shetty Mr. Polishetty And Jawan Movie; Tweet Viral- Sakshi
Sakshi News home page

Rajamouli: ' ఆ కాన్సెప్ట్‌ను అలా తీసినందుకు హ్యాట్సాఫ్': రాజమౌళి

Sep 8 2023 7:18 PM | Updated on Sep 8 2023 7:49 PM

Rajamouli Praises Miss Shetty Mr Polishetty Movie Team - Sakshi

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి'. పి.మహేశ్‌ బాబు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. చాలా రోజుల తర్వాత అద్భుతమైన చిత్రం చూశానంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు షారుక్‌ ఖాన్ నటించిన జవాన్‌ మూవీ డైరెక్టర్‌పై అట్లీని కొనియాడారు. 

(ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్‌ చేసిన శ్రీవల్లి!)

కాగా.. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా మహేశ్ బాబు  డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించగా, అనుష్క చెఫ్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. 

రాజమౌళి ట్వీట్‌లో రాస్తూ..'చాలా కాలం తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చూశాను. స్వీటీ ఎప్పటిలాగే తన అందంతో మెరిసిపోయింది. నవీన్ పొలిశెట్టి కామెడీ మంచి వినోదాన్ని అందించింది. సక్సెస్‌ సాధించిన చిత్ర బృందానికి అభినందనలు. ఇంత సున్నితమైన విషయాన్ని చాలా సరదాగా హ్యాండిల్ చేసినందుకు మహేశ్ బాబుకు వందనాలు!' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. 

(ఇది చదవండి: 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' టీజర్ వచ్చేసింది.. ఫుల్‌ కామెడీ)

Advertisement
 
Advertisement
Advertisement