ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్‌ చేసిన శ్రీవల్లి! | Rashmika Mandanna Shares Pics From Sets Of Pushpa 2: The Rule Set; See Pic - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: వామ్మో పుష్ప రేంజ్‌ చూశారా?.. వైరలవుతున్న ఫోటో!

Published Fri, Sep 8 2023 6:32 PM

Rashmika Mandanna Shares A Shooting Spot Pic From Pushpa-2 Sets - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన పుష్ప బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప-2 ది రూల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాతో శ్రీవల్లిగా టాలీవుడ్‌ అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకుంది భామ రష్మిక. ఈ షెడ్యూల్‌లో బన్నీ, రష్మికపైనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్‌ బ్యాక్ ఇస్తాడా? )

ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌ నుంచి ఓ ఫోటో లీక్‌ కాగా.. అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఫోటోను హీరోయిన్‌ రష్మిక తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ‍అభిమానులు పుష్ప రేంజ్‌ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సైతం ట్వీట్ చేసింది. పుష్ప సెట్‌ నుంచి శ్రీవల్లి లీక్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. గతంలో బన్నీ సైతం తన ఇంటివద్దనుంచి షూటింగ్‌ స్పాట్‌కు వెళ్తున్న వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. 
  
ఆ ఫోటో చూస్తే అచ్చం ఇంద్రభవనం తలపించేలా కనిపిస్తోంది. అంతే కాదు పుష్ప-2లోనూ ఇలాంటి ఇంట్లోనే బన్నీ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. 

(ఇది చదవండి: విక్కీ నువ్వు చాలా లక్కీ.. ఆ ఒక్క సినిమానే రూ.340 కోట్లు!)


 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement