‘శంబాల’ చిత్రంతో రీసెంట్‌గా ఆది సాయి కుమార్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. మరోసారి అద్భుతమైన కథతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, గ్లామరస్ హీరోయిన్ వేదిక హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘జంగిల్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కథనం, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది అని చిత్రయూనిట్ చెబుతోంది.
ఈ చిత్రాన్ని ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్ మీద రాఘవ రెడ్డి పబ్బతి ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో పాటు అన్ని హక్కులను ఫ్రైడే పిక్చర్స్ స్వాధీనం చేసుకోవడం విశేషం. అతి త్వరలోనే గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీం. ప్రస్తుతం ‘జంగిల్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఈ మూవీలో ఆది సాయికుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. హారర్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ట్రైలర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇకపై కంటిన్యూగా అప్డేట్‌లను ఇస్తామని టీం చెబుతోంది.


