 
													హైదరాబాద్‌లోని అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్..!
‘జై మాహిష్మతి’ నినాదాలతో మరోసారి థియేటర్స్ దద్దరిల్లాయి. జక్కన్న చెక్కిన కళాఖండం ‘బాహుబలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’పేరుతో నేడు(అక్టోబర్ 31) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలతో కూడా భారీగా టికెట్స్ బుక్ అయ్యాయి. హైదరాబాద్‌లో అయితే అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. తొలిరోజే రూ. 20-25 కోట్లు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందనిట్రేడ్ వర్గాల అంచన వేస్తున్నాయి. కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదు. రీరిలీజ్ చిత్రాల్లో ఇదొక రికార్డు అవుతుందని సీనీ పండితులు చెబుతున్నారు. మున్ముందు ‘బాహుబలి: ది ఎపిక్’ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.
‘బాహుబలి’అంటే యుద్ధం కాదు...
పదేళ్ల క్రితం తెరపైకి వచ్చిన బాహుబలి సినిమా అప్పట్లోనే చరిత్ర సృష్టించింది.దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపోందించిన రీమాస్టర్ వెర్షన్ తిరిగి వచ్చి మళ్లీ అదే మంత్రం వేసింది. విడుదలైన మొదటి రోజు నుంచే అభిమానులు థియేటర్ల ముందు బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఫైర్‌వర్క్స్‌తో పండుగ చేసుకుంటున్నారు.‘బాహుబలి’ కథ కేవలం యుద్ధం కాదు అది భావోద్వేగాల కలయిక. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం, ప్రభాస్-రానా యాక్షన్, అనుష్క-తమన్నా నటన...ఇవన్నీ కలిసినప్పుడు తెరపై మళ్లీ మాయ సృష్టించాయి.
బాహుబలి ఓ అద్భుతం..
బాహుబలి కథ కేవలం యుద్ధం, ప్రతీకారం కాదు.. అది ధర్మం, త్యాగం, ప్రేమ, బాధ్యతలు నిండిన కుటుంబ గాథ.మాహిష్మతి రాజ్యం, అద్భుతమైన సెట్స్, ప్రభాస్ బాహుబలిగా చూపిన గంభీరత, రానా చేసిన భల్లాలదేవ శక్తి... దేవసేన స్వాభిమానం, శివగామి న్యాయపరమైన తాత్వికత..ఇవన్నీ కలగలసిన ఓ అద్భుతమైన భారతీయ చలనచిత్రం.
గూస్‌బంప్స్ మూమెంట్స్..
థియేటర్ల వద్ద అభిమానులు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా క్యూలైనలో నిలుస్తున్నారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అంతా #BaahubaliTheEpic తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ‘ఇప్పటికీ గూస్‌బమ్స్ వస్తున్నాయి..’ ‘ఎన్ని సార్లు చూసినా కొత్త అనుభూతినిస్తోంది..’ ‘ఇది కేవలం సినిమా కాదు.. మన తెలుగు సినిమా గర్వం..’అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఊహించని మలుపులతో త్రీడీ 
బాహుబలి:ది ఎపిక్ సినిమా ఇంటర్‌వెల్‌లో ‘బాహుబలి:ది ఎటర్నల్ వార్’ అంటు కోత్త త్రీడీ యానిమేషన్ టీజర్‌ను లాంచ్ చేశారు. ఇది బాహుబలి ప్రపంచాన్ని కొనసాగిస్తుంది అంటున్నారు రాజమౌళి. రూ. 120 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపోందించబోతున్నారు. ఇందులో ఊహించని మలుపులు, కొత్త పాత్రలు సంచలనం సృష్టించబోతున్నాయి. ఈ చిత్రానికి ఈషాన్ శుక్లా దర్శకత్వం వహించబోతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
