
అనుష్క శెట్టి(Anushka shetty) నటించిన తాజా చిత్రం ‘ఘాటి’(Ghaati Movie). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలై మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. కథా నేపథ్యం బాగున్నా.. దాన్ని అంతే ఆకర్షనీయంగా తెరపై చూపించడంలో క్రిష్ సఫలం కాలేదు. ఫలితంగా రెండో రోజు నుంచే సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి. దీంతో విడుదలైన 20 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ని అమెజాన్ ప్రైమ్(Amazon prime Video) రిలీజ్ చేసింది.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
‘ఘాటి’ఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే రిలీజైన 8 వారాలకు ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఘాటి కథేంటంటే..
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే ఖరీదైన గంజాయి పంట శీలావతి. ఆ పంటను కోసి, బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫీయా లీడర్ కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), అతని తమ్ముడు కుందుల నాయుడు(చైతన్యరావు) ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. అలా ఘాటీలుగా పని చేసిన దేశిరాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క).. ఓ కారణంగా ఆ పని వదిలేస్తారు... వేరే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.
కట్ చేస్తే.. కుందుల నాయుడికి తెలియకుండా ఓ గ్యాంగ్ శీలావతి గంజాయిని లిక్విడ్‌గా మార్చి బయటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంటుంది. ఈ ముఠాకి లీడర్‌గా దేశిరాజు ఉన్నట్లు కుందుల నాయుడికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఘాటీ పని వదిలిన దేశి రాజు, శీలావతి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? శీలావతి క్రిమినల్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? దేశిరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు శీలావతి ఏం చేసింది? అనేదే మిగతా కథ.