ఈ వారం ఓటీటీల్లోకి చాలానే తెలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, రివాల్వర్ రీటా తదితర స్ట్రెయిట్ చిత్రాలతో పాటు వృత్త అనే డబ్బింగ్ బొమ్మ, ఏక్ దివానే కీ దివానియత్ అనే హిందీ మూవీ, స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ రెండో వాల్యూమ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో రెండు తెలుగు సినిమాలు సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.
(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)
అమ్మరాజశేఖర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ 'సుగుణ'. 2024లో రిలీజైంది. కాకపోతే ఎప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్లిందనే సరైన సమాచారం లేదు. ఇప్పుడీ మూవీ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.
గతేడాది రిలీజైన 'బాగుంది' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. రామ్ కుమార్ దర్శకుడు కాగా కిశోర్ తేజ, భవ్యశ్రీ, పద్మిని, పద్మజయంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీటి ట్రైలర్స్ చూస్తే ఏమంత పెద్ద గొప్పగా లేవు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాయో చూడాలి?
(ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్)


