కన్నడ హీరో సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఎందుకంటే సొంత భాషలో స్టార్ అయినప్పటికీ మన దగ్గర 'ఈగ'లో ప్రతినాయకుడిగా అదరగొట్టేశాడు. తర్వాత కూడా బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాడు. టాలీవుడ్‌లోనూ కాసోకూస్తో ఫేమ్ సొంతం చేసుకున్నాడు. అయితే తను ఇలా చేస్తున్నప్పటికీ మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు.. తమని సపోర్ట్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.
(ఇదీ చదవండి: 'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్)
'మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదు. నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర.. మిగతా భాషల్లో అతిథి పాత్రలు చేశాం. కాకపోతే ఆయా భాషల స్టార్స్ మాత్రం కన్నడలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. నేను అయితే ఇతర భాషల్లో చేసిన అతిథి పాత్రలకుగానూ డబ్బులే తీసుకోలేదు. వ్యక్తిగతంగా మిగతా ఇండస్ట్రీలోని పలువురు హీరోలని నా మూవీలో అతిథి పాత్రలు చేయమని అడిగా. కానీ వాళ్లు ఆసక్తి చూపించలేదు' అని సుదీప్ చెప్పుకొచ్చాడు.
సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మార్క్'. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. కాకపోతే డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే అనిపిస్తుంది. తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు కానీ తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు.
(ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి)


