సెలబ్రిటీలు స్టేజీ ఎక్కితే చాలా మాట్లాడేస్తుంటారు. కొన్నిసార్లు రాబోయే సినిమాల గురించి పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటారు. మూవీ హిట్ అయిందా సరేసరి లేదంటే మాత్రం ఈ వ్యాఖ్యలు రివర్స్ కొడుతుంటాయి. రీసెంట్ టైంలో శివాజీ, స్టేజీపై మాట్లాడుతూ మహిళలపై ఎలాంటి కామెంట్స్ చేశాడో చూశాం. ఇప్పుడు కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ 'రాజాసాబ్' గురించి ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.
'మంచి మనసున్న మారాజు మారుతి. మకుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి తీసిన ఈ 'రాజాసాబ్' సినిమా.. ఈ సంక్రాంతికి గులాబ్ జామ్‌లు గలగలాడించకపోతే.. అలాగే కోడి గుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్లు అవుతాయి జాగ్రత్త. రాసిపెట్టుకోండి. 'ద రాజాసాబ్'.. రూ.2000 కోట్లు కొల్లగొట్టకపోతే నేను ఇస్తా నా డబ్బులు, ఆ డబ్బులు మనందరం కలిసి ఇద్దాం' అని సప్తగిరి కామెంట్స్ చేశాడు. కచ్చితంగా వీటిపై మీమ్స్ గానీ ట్రోల్స్ గానీ రావడం గ్యారంటీ.
'రాజాసాబ్' సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతమందించాడు. మారుతి దర్శకుడు. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన పూర్తిస్థాయి కమర్షియల్ మూవీ ఇది. జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. చూడాలి మరి ఈ మూవీ సప్తగిరి చెప్పినట్లు రూ.2 వేల కోట్లు సాధిస్తుందో లేదో?
#TheRajaSaab రెండు వేల రూపాయలు కొల్ల కొట్టే సినిమా
అలా అవ్వకపోతే నేను మీరు కలిపి ఇద్దాం..!#Prabhas pic.twitter.com/UlRXWfji7f— Telugu70mm (@Telugu70mmweb) December 27, 2025


