కోలీవుడ్ స్టార్ దళపతి తన కెరీర్‌లో నటిస్తోన్న చివరి సినిమా జన నాయగణ్. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు ఈ విషయాన్ని ప్రకటించారు. తన కెరీర్‌లో ఇదే చివరి సినిమా కానుందని వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.
తాజాగా మలేసియా నిర్వహించిన ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో విజయ్ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే తనకిదే చివరి సినిమా మరోసారి స్పష్టం చేశారు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈవెంట్‌లో అఫీషియల్‌గా ప్రకటించారు. వేలాదిమంది అభిమానుల మధ్య తన నిర్ణయాన్ని వెల్లడించారు.
విజయ్ మాట్లాడుతూ..'నా ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్‌లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెబుతున్నా' అని అన్నారు.



