మూడు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించిన'ఈషా' | Eesha Movie Box Office Collection Day 3 Details | Sakshi
Sakshi News home page

Eesha Box Office Colletion: మూడు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించిన'ఈషా'

Dec 28 2025 2:21 PM | Updated on Dec 28 2025 2:55 PM

Eesha Movie Box Office Collection Day 3 Details

త్రిగుణ్, అఖిల్‌రాజ్‌ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు గురువారం(డిసెంబర్‌ 25) విడుదల చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్‌ మాత్రం భారీగా వచ్చాయి. 

విడుదలైన మూడు రోజుల్లో 4 కోట్ల 80 లక్షల గ్రాస్‌ వసూళ్లను రాబట్టి, బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. రానున్న రోజుల్లో ఈషా బాక్సాఫీస్‌ వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్‌ చేస్తుందని ట్రెడ్‌ వర్గాలు అంటున్నాయి. 

సినిమా కథ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మని నలుగురు స్నేహితులు(త్రిగుణ్‌, హెబ్పాపటేల్‌, సిని హనుమంతు, అఖిల్‌ రాజు)..పెద్దయ్యాక టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. 

అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement