మేడారం సమ్మక్క, సారమ్మకు భక్తులు తనివితీరా మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలొచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పగించారు.
మొదటి జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద స్నానాలు ఆచరించారు. జంపన్నవాగు వద్ద కల్యాణ కట్టలో భక్తులు, చిన్నారులు పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు.
అనంతరం సమ్మక్క, సారలమ్మకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగార, చీరసారె, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆరోగ్యం, సంతాన భాగ్యం కలగాలని వనదేవతలను మనసారా వేడుకున్నారు. మేడారం ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు.


