హీరోగా శంకర్‌ కుమారుడి ఎంట్రీ.. హీరోయిన్‌గా బేబమ్మ! | Krithi Shetty Gets New Offer As Lead Role In Shankar Son Arjith Shankar Debut Movie, Buzz Went Viral | Sakshi
Sakshi News home page

వరుస ఫ్లాపులు.. అయినా మరో ఆఫర్‌ కొట్టేసిన బేబమ్మ!

Dec 29 2025 8:36 AM | Updated on Dec 29 2025 9:11 AM

Buzz: Krithi Shetty Lead Opposite Arjith Shankar Debut Movie

సాధారణంగా ఏ హీరోకైనా, హీరోయిన్‌కైనా ఓ మంచి హిట్‌ పడితే వరుసగా అవకాశాలు వరిస్తాయి అంటారు. కానీ హీరోయిన్‌ కృతీశెట్టి విషయంలో ఇది తారుమారు అవుతుండటం విశేషం. తెలుగులో ఉప్పెన చిత్రంతో రంగ ప్రవేశం చేసిన ఈ కన్నడ బ్యూటీకి ఆ చిత్రం సక్సెస్‌తో మరిన్ని అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా ఆ తరువాత నటించిన ఒకటి రెండు చిత్రాలు విజయాలను అందించాయి. ఆ తర్వాత నటించిన చిత్రాలు వరుసగా ప్లాప్‌ కావడంతో టాలీవుడ్‌లో మార్కెట్‌ తగ్గిపోయింది.

కోలీవుడ్‌లో వరుస సినిమాలు
కృతిశెట్టి నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రాలు ది వారియర్‌, కస్టడీ ఆశించిన విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈ బ్యూటీకి తమిళంలో వరుసగా మూడు చిత్రాల్లో నటించే ఛాన్స్‌ దక్కింది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఆ మూడు చిత్రాల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కృతిశెట్టికి కోలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్‌ వరించినట్లు తాజా సమాచారం.

శంకర్‌ కుమారుడు హీరోగా..
ప్రముఖ దర్శకుడు శంకర్‌ వారసుడు అర్జిత్‌ శంకర్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఏఆర్‌ మురుగదాస్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఈయన తాజాగా హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఈ  మూవీలో అర్జిత్‌కు జంటగా మమిత బైజును నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. 

అర్జిత్‌కు జోడీగా?
మళ్లీ ఏమైందో కానీ తాజాగా అర్జిత్‌ శంకర్‌కు జంటగా కృతీశెట్టిని ఎంపిక చేసినట్లు టాక్‌! అదేవిధంగా బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ను ప్రతినాయకుడి పాత్రలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌ అట్లీ శిష్యుడొకరు దర్శకుడుగా పరిచయం కానున్నాడు. ఈమేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

చదవండి: అభిమానుల అత్సుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement