ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా | Tamil Director Bharathiraja Hospitalised | Sakshi
Sakshi News home page

Bharathiraja: ఆస్పత్రిలో చేరిన ప్రముఖ దర్శకుడు

Dec 29 2025 6:53 AM | Updated on Dec 29 2025 6:55 AM

Tamil Director Bharathiraja Hospitalised

ప్రఖ్యాత సినీ దర్శకుడు, నటుడు భారతీరాజా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది మార్చిలోనే ఆయన కుమారుడు, దర్శకనటుడు మనోజ్‌ కన్నుమూశారు. దీంతో మనోవేదనకు గురైన భారతీరాజా అనారోగ్యంపాలయ్యారు. వైద్య చికిత్స అనంతరం కోలుకున్న ఈయన మలేషియాలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు.

కాగా 80 ఏళ్ల వయసు పైబడ్డ భారతీరాజా మారోసారి అనారోగ్యానికి గురి కావడంతో గత మూడు రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని భారతీరాజా బంధువులు తెలిపారు.

సినిమా
భారతీరాజా విషయానికి వస్తే.. ఈయన 16 వయదినిలే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, శ్రీదేవిని డైరెక్ట్‌ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కళక్కే పోగులు రైల్‌, ముదల్‌ మరియాదై, అలైగల్‌ ఓయ్వదిలై వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. రాధిక, రాధ, కార్తీక్‌ వంటి పలువురు నటీనటులను సినిమాకు పరిచయం చేశారు. తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, ఆరాధన, ఈతరం ఇల్లాలు వంటి పలు సినిమాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement