
అనుష్కశెట్టి లీడ్ రోల్‌లో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి దస్సోరా అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రేజీ సాంగ్కు సాగర్ నాగవెల్లి కంపోజ్ చేయగా.. ఈఎస్ మూర్తి లిరిక్స్ అందించారు. ఈ పాటను గీతా మాధురి, సాకేత్, శ్రుతి రంజని ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 5న థియేటర్లలో సందడి చేయనుంది.