అనుష్కకు వింత వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట! | Anushka Shetty Has A Rare Genetic Disease | Sakshi
Sakshi News home page

Anushka Shetty : అనుష్కకు అరుదైన వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!

Published Wed, Jun 19 2024 3:21 PM | Last Updated on Wed, Jun 19 2024 4:44 PM

Anushka Shetty Has A Rare Genetic Disease

 అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అనుష్క శెట్టి. 2005లో ‘సూపర్‌’ చిత్రంలో టాలీవుడ్‌కి పరిచమైన ఈ మలయాళ భామ..తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేస్తూ.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక అరుంధతి చిత్రం ఆమె సినీ జీవితాన్నే మార్చేసింది. 

(చదవండి: రజనీకాంత్‌ సినిమాలో అనవసరంగా నటించా: హీరోయిన్‌)

ఆ తర్వాత వరుసగా ఫీమేల్‌ ఓరియెంటెండ్‌ మూవీస్‌ చేసి హిట్టుకొట్టింది.బాహుబలి మూవీతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఈ భామ చేసిన చిత్రాలేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో చాలా గ్యాప్‌ తీసుకున్న ఈ బ్యూటీ.. గతేడాది మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టితో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో మరో లేడి ఓరియెంటెండ్‌ మూవీ చేస్తోంది. 

(చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్‌)

ఇదిలా ఉంటే అనుష్క ఆరోగ్యంపై ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనుష్క ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఆమె నవ్వడం ప్రారంభిస్తే..చాలా సేపటివరకు ఆపలేదట. ఎవరైనా జోక్‌ చేస్తే పగలబడి నవ్వేస్తుందట. చిన్న చిన్న సరదా విషయాలకు కూడా బాగా నవ్వుతుందట. దాని వల్ల షూటింగ్‌ సమయంలో చాలా సార్లు ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనుష్కనే చెప్పింది. షూటింగ్ లో ఏదైనా కామెడీ సన్నివేశం చేయాల్సి వస్తే ఆ రోజు చాలా ఆలస్యం అవుతుందట. తాను నవ్వడం మొదలు పెడితే యూనిట్ మొత్తం టీ బ్రేక్ తీసుకుంటారు అని తెలిపింది అనుష్క. అయితే ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యానికేమి ఇబ్బంది లేదని తెలియడంతో స్వీటీ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement