టైటిల్.. లక్కీ ది సూపర్ స్టార్
ఓటీటీ.. జియో హాట్‌స్టార్
నటీనటులు.. జీవీ ప్రకాశ్ కుమార్, అనస్వర రాజన్, మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తదితరులు
దర్శకుడు.. ఉదయ్ మహేశ్
ఓటీటీలు వచ్చాక సినిమాలు తెగ చూసేస్తున్నారు. కంటెంట్ నచ్చితే చాలు ఆ చిత్రాలను రిపీటెడ్‌గా చూసే ఆడియన్స్ ఉన్నారు. ఓటీటీ చిత్రాలు అంతలా సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇటీవలే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన లక్కీ మూవీ.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ లక్కీ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
లక్కీ కథేంటంటే..
జీవీ ప్రకాశ్‌కుమార్ మేనకోడలు ఆటిజంతో బాధపడుతూ ఉంటుంది. ఈ సమస్యపై డాక్టర్‌ను సంప్రదించగా మరో పిల్లాడిని కనండి అంటూ దంపతులకు ఉచిత సలహా ఇస్తాడు. అయితే తన మేనకోడలి ఆటిజంతో బాధపడటం చూసి జీవీ ప్రకాశ్ పాపకోసం ఏదో ఒకటి చేయాలని తపనతో ఉంటాడు. అలా ఓ రోజు రోడ్డుపై ఆపదలో ఉన్న ఓ కుక్కపిల్ల కనిపిస్తుంది. ఆ సమయంలో కుక్కపిల్లను రక్షించిన జీవీ ప్రకాశ్.. తన తీసుకెళ్లి తన మేనకోడలికి ఇస్తాడు. ఆ తర్వాత ఆటిజంతో బాధపడుతున్న పాప లైఫ్ మారిపోతుంది. కానీ ఓ గొడవ కారణంగా కుక్కపిల్ల కిడ్నాప్‌కు గురవుతుంది. ఆ తర్వాత ఏ జరిగింది? అసలు కుక్కపిల్లను జీవీ ప్రకాశ్ తిరిగి తీసుకొచ్చాడా? మళ్లీ తన మేడకోడలిని మామూలుగా మార్చాడా? అన్నదే అసలు కథ.
ఎలా ఉందంటే..
లక్కీ ఈ టైటిల్ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది అదృష్టమే. అలా అదృష్టం కలిసొచ్చి తల్లి చెంతకు కుక్కపిల్ల చెరిన కథే ఈ లక్కీ. ఈ కథ ప్రారంభంలోనే డైరెక్టర్ విజన్ ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఈ కథలో ఫుల్ ఎమోషన్ ఉండబోతుందని ప్రేక్షకులకు ముందే హింట్ ఇచ్చేశాడు. తన బిడ్డకు ఆపద వస్తే మనుషులు ఎంత బాధపడతారో.. అలాగే మూగజీవాలు కూడా అంతకంటే ఎక్కువగా బాధపడతాయనేదే ఈ లక్కీ మూవీ కాన్సెప్ట్.
వీధి కుక్కతో కథను మొదలెట్టిన డైరెక్టర్ చివరికీ వరకు అదే క్యారెక్టర్‌తో ప్రేక్షకుడిని ముందుకు తీసుకెళ్లాడు. మనుషులు, మూగజీవాలకు ఎమోషన్స్ ఓకేలా ఉంటాయని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఒకవైపు తన బిడ్డ ఆటిజం బాధను చూడలేక తల్లిదండ్రులు.. తన బిడ్డ ఏమైపోయిందోనని ఎదురు చూసే వీధి కుక్క ఎమోషన్స్ చూపించిన విధానం ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.
ఇక సెకండాఫ్‌లో తప్పిపోయిన లక్కీ (కుక్క పిల్ల) చుట్టే తిరుగుతుంది. జీవీ ప్రకాశ్‌తో గొడవ కారణంగా ఆ కుక్కపిల్ల ఒక రాజకీయ నాయకుడి చేతికి చిక్కుతుంది. లక్కీ వల్లనే తనకు పొలిటికల్‌గా కలిసొచ్చిందని నమ్మిన అతను ఆ కుక్కపిల్లను పెంచుకుంటాడు. ఆ తర్వాత కుక్కపిల్ల కోసం అనస్వర రాజన్‌తో కలిసి జీవీ ప్రకాశ్ ప్లాన్స్ వేయడం.. అవీ కాస్తా మిస్‌ఫైర్ కావడం చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కేవలం ఓ కుక్కపిల్ల కోసం ఇంతలా చేస్తారా అన్న ఫీలింగ్ ఆడియన్స్‌కు కలుగుతుంది. మనిషి స్వార్థం దేనికైనా తెగిస్తుందనే మేసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. మధ్యలో మూగజీవాల ఫీలింగ్స్‌ను బయటికి చూపించి ప్రేక్షకుడిని ఆలోచించేలా చేశాడు. ఓవరాల్‌గా చూస్తే మనిషికి.. మూగజీవాలకు మధ్య ఎమోషనల్ డ్రామానే ఈ లక్కీ. ఈ వీకెండ్‌లో పిల్లలు, ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ లక్కీ.
ఎవరెలా చేశారంటే..
జీవీ ప్రకాశ్ వన్ మ్యాన్ షో చేశాడు. తన పాత్రలో అదరగొట్టేశాడు. ఛాంపియన్ బ్యూటీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. మేఘన సుమేష్, దేవదర్శిని ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తమ పాత్రలో పరిధిలో మెప్పించారు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.


