పెళ్లి పీటలెక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే? | Tollywood actress Anushka Shetty Going To Marry a Businessman | Sakshi
Sakshi News home page

Anushka Shetty: పెళ్లి పీటలెక్కనున్న జేజమ్మ.. వరుడు ఎవరంటే?

Mar 17 2026 10:39 AM | Updated on Mar 17 2026 3:37 PM

Tollywood actress Anushka Shetty Going To Marry a Businessman

అరుంధతి మూవీతో జేజమ్మగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న బ్యూటీ అనుష్క శెట్టి. ఆ తర్వాత బాహుబలి మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ప్రభాస్ సరసన నటించిన ముద్దుగుమ్మ.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ‍అయితే అప్పుడప్పుడు వీరిద్దరిపై పెళ్లి రూమర్స్ కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ బోలెడు కథనాలొచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి.

తాజాగా ఈ స్వీటీ అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లాడనుందని సమాచారం. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్న అనుష్క బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని..   ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అబ్బాయి కన్నడ కుటుంబానికి చెందినవారని.. వీరిద్దరి వివాహ నిశ్చయానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు లేటేస్ట్ టాక్.  అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో అనుష్క పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి పీటలెక్కే ఛాన్స్ ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది ఘాటీ మూవీతో అభిమానులను మెప్పించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మలయాళంలో కథనార్ అనే భారీ బడ్జెట్ సినిమాలో అనుష్క నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement