అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘ఏఏ 23’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు లోకేష్ కనగరాజ్. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట.
కాగా, ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందనుందని, ఈ చిత్రానికి ‘గ్యాంగ్ స్టార్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ సరికొత్తగా మేకోవర్ కానున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
మరోవైపు ప్రస్తుతం ‘రాకా’ చిత్రీకరణతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. హైదరాబాద్, కేరళ లొకేషన్స్‌లో ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్స్ ప్రారంభం కానున్నాయని తెలిసింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘రాకా’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.


