టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఆమె త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. గతేడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. సినిమాల్లో ఉన్న పరిచయం కాస్తా ప్రేమగా మారి.. ఈ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.
ఇక ఈ సంగతి పక్కనపెడితే సామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తనకెదురైన అనుభవాన్ని పంచుకుంది. వ్యాపారంలో తనకు కలిసి రాలేదని తెలిపింది. అయితే ఇది కూడా ఓ అనుభవాన్ని నేర్పిందని చెప్పుకొచ్చింది. ఫెయిల్యూర్స్ తన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించాయని సామ్ పేర్కొంది. సక్సెస్ వల్ల తాను ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని సమంత వెల్లడించింది.
ఈ సందర్భంగా వ్యాపార రంగంలో మహిళలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులపై సమంత మాట్లాడారు. కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే మహిళల్లో భయం ఎక్కువగా ఉంటుందన్నారు. మహిళా వ్యాపారవేత్తలతో కలిసి పనిచేయడం తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని సామ్ తెలిపారు. దాదాపు పది సంస్థల్లో తాను పెట్టుబడులు పెట్టానని.. వాటిలో ఎక్కువగా మహిళలే బాస్‌లుగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేసింది.


