రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటించిన మూవీ 'రామాయణ. ఈనెల 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 664 గ్రాస్ కోట్ల వసూళ్లను సాధించింది. రిలీజ్ తర్వాత మొదటి సోమవారం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కొత్త రికార్డ్ సృష్టించింది. నవంబర్ 9న కేవలం హిందీ వర్షన్‌లో రూ. 107.50 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్ 2' (రూ. 60 కోట్లు)మొదటి సోమవారం వసూళ్లను కూడా అధిగమించింది. అంతే కాకుండా 'టైగర్ 3', 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్', 'హ్యాపీ న్యూ ఇయర్', 'సింగం అగైన్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' లాంటి చిత్రాలను కూడా దాటేసింది.
ఇప్పటికే ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రూ. 346.35 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. రూ. 413.90 గ్రాస్ కలెక్ట్ చేసింది. విదేశాల్లో ఐదో రోజు రామాయణ వసూళ్లతో అదరగొట్టింది. ఓవర్‌సీస్‌లో ఐదో రోజు రూ. 25 కోట్లు రాబట్టింది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా రూ. 664 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ కలెక్షన్స్‌తో 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ మూవీ కంటే ముందు దురంధర్-2(రూ.1852 కోట్లు), జైలర్-2(రూ.821 కోట్లు) ఉన్నాయి. కాగా.. ఈ చిత్రంలో యశ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, లారా దత్తా కీలక పాత్రల్లో నటించారు.


