రాజమౌళి వారణాసి.. తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌ డీల్..! | SS Rajamouli Movie Varanasi Gets Big Deal for Theatrical Release | Sakshi
Sakshi News home page

Varanasi Movie: రాజమౌళి వారణాసి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ డీల్..!

Nov 10 2026 1:14 PM | Updated on Nov 10 2026 1:23 PM

SS Rajamouli Movie Varanasi Gets Big Deal for Theatrical Release

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ అండ్ అవైటేడ్ మూవీ వారణాసి. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ వారణాసిపై అభిమానుల్లో భారీ ఆశలు పెంచేశాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివరికీ షూట్ ముగించేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకధీరుడు.

ఈ నేపథ్యంలోనే వారణాసికి సంబంధించి ఓ క్రేజీ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్ కుదిరిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ మూవీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ.290 కోట్ల రికార్డ్ ధరకు సొంతం చేసుకున్నారని టాలీవుడ్ లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు.

కాగా.. ఈ చిత్రాన్ని 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి చెప్పిన ప్రకారం 'వారణాసి'లో రాముడు జీవించిన త్రేతాయుగం సీన్స్ కూడా ఉండనున్నాయి. ఇందులో భాగంగా మహేశ్.. శ్రీరాముడిగానూ కనిపించనున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement