విడాకులు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌, ఆయన భార్య అన్నాలెజినోవా | AP Deputy CM Pawan Kalyan and Wife Anna Lezhneva Divorced | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌, ఆయన భార్య అన్నాలెజినోవా

Nov 10 2026 12:14 AM | Updated on Nov 10 2026 12:23 AM

AP Deputy CM Pawan Kalyan and Wife Anna Lezhneva Divorced

సాక్షి,అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయన భార్య అన్నా కొణిదెల విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా వారిద్దరూ సంయుక్తంగా విడాకుల ప్రకటన చేశారంటూ ఓ లేఖ సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చింది.   

సదరు సోషల్ మీడియా పోస్టులో .. ‘వైవాహిక బంధం ముగిసినప్పటికీ తాము మంచి స్నేహితులుగా కొనసాగుతామని పవన్‌,అన్నా కొణిదెల స్పష్టం చేశారు. పిల్లల సంతోషం, భవిష్యత్తు తమ ఇద్దరికీ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. వారి సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని పేర్కొన్నారు.  

ఈ వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement