తాడేపల్లి: ఆవుతోలు కప్పుకున్న తోడేలుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబుది ఉకదంపుడు ఆత్మస్తుతి తప్పితే, ఇవి ఒక ఎన్నికలా.. ఇదొక గెలుపా? అంటూ ధ్వజమెత్తారు. అధికారులను, పోలీసుల్ని ఉపయోగించి గెలిచిన చంద్రబాబు.. ప్రజాబలంతో గెలిచామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. దొంగ ఓట్లతో గెలిచి, గెలిచామని చెప్పకోవడానికి చంద్రబాబు సిగ్గుపడటం లేదని పేర్ని నాని మండిపడ్డారు.
ఈరోజు(సోమవారం, నవంబర్ 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘స్థానిక ఎన్నికల్లో ధనాన్ని విచ్చలవిడిగా వెదజల్లారు. అధికారం, పోలీసులను ఉపయోగించి గెలిచారు. ఇది ప్రజాబలం అని చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీ గూండాలకు పోలీసులు బాగా సహకరించారు. టీడీపీ గూండాలను పోలీసులను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాటి వెళ్తే అధికారులు నామినేషన్లు తీసుకోరు. అధికారులను సీసీ టీవీ ఫుటేజ్ అడిగితే లేదని చెబుతున్నారు. ఇవన్నీ అక్రమాలు కాదా?,
కడప కార్పొరేషన్‌లో కూడా దందా చేశారు. చాలా మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని లేకుండా చేశారు. నామినేషన్లు వేస్తే చించేశారు, బీ ఫామ్‌లను చించేశారు. స్క్రూటినీలో ఎన్నో నామినేషన్లు వాంటెడ్‌గా తిరస్కరించారు. వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉండేవారిని బైండోవర్ చేశారు.. రౌడీ షీట్ తెరిచారు. టీడీపీ గూండాలు, హంతకులు, రౌడీలను బైండోవర్ చేయలేదు. కంచే చేను మేసిన చందనా, అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
చంద్రబాబు మనుషులు.. దుశ్శాసన మూకలు.. పులివెందులలో దుశ్శాసన మూకలతో ఓట్లు వేయించుకుని చంద్రబాబు గెలిచారు. చిత్తూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లలో ఫ్యాన్ గుర్తు లేదు. చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి బరితెగించి మాట్లాడారు. చంద్రబాబు మాటలు.. ప్రజాస్వామ్యానికి చేటు. చంద్రబాబు మాటలు.. నీచాతి నీచం. పోలింగ్ బూత్‌లో చొరబడి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేశారు. వైఎస్సార్‌సీపీ గెలిచిన స్థానాలను కూడా అక్రమాలు చేసి తమ ఖాతాలో వేసుకున్న ఘనత చంద్రబాబుది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం ఉందా?’ అని సవాల్ చేశారు.
ఇదీ చదవండి: ‘ఇలా బ్యాలెట్ బాక్సులు మార్చే అక్రమంగా గెలిచారు’


