బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌ | YSRCP Ambati Rambabu Serious Comments On CBN And Lokesh | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

Nov 9 2026 11:54 AM | Updated on Nov 9 2026 12:03 PM

YSRCP Ambati Rambabu Serious Comments On CBN And Lokesh

సాక్షి, గుంటూరు: కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికల అనంతరం బస్సులో నుంచి వెంగళాయపాలెం బ్యాలెట్‌ బాక్స్‌ ఎందుకు దించారు? అని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ములకత్ ద్వారా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు పరామర్శించారు. అనంతరం, అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న గుంటూరులో దుష్ట సాంప్రదాయాలను తీసుకొచ్చారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. జైళ్లకు వెళ్లడానికి వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరూ భయపడరు. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. లోకేష్ , పెమ్మసాని చిన్న ఘటనను అడ్డంపెట్టుకొని కేసుబెట్టడం దుర్మార్గం. ఏదో ఒక విధంగా అప్పిరెడ్డిని జైల్లో పెట్టాలని లోకేష్, పెమ్మసాని కుట్ర పన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్న నాయకులను జైల్లో పెట్టే పనిలో ఉంది.  

ఎన్నికల్లో అక్రమాలు చేసిన వారిని కాపాడుతున్నారు. బస్సులో నుంచి వెంగళాయపాలెం బ్యాలెట్‌ బాక్స్‌ ఎందుకు దించారు?. ఏజెంట్ల సమక్షంలో సీల్‌ చేసిన బ్యాలెట్‌ బాక్స్‌ను ఎందుకు ఓపెన్‌ చేశారు?. ఇది బ్యాలెట్ బాక్స్ మార్చే ప్రయత్నం. ఒక్కసారి బస్సులో ఎక్కించిన బ్యాలెట్ బాక్స్‌ను మార్గం మద్యలో ఎందుకు దించారు?. మేము బ్యాలెట్ బాక్స్ పట్టుకోకపోతే తెలుగుదేశం వాళ్లు బాక్స్ మార్చేసేవారు. అన్యాయాన్ని అడ్డుకునేందుకు అప్పిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు. అన్యాయాన్ని అడ్డుకున్న అప్పిరెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. అప్పిరెడ్డికి బెయిల్ రాకుండా  లోకేష్,పెమ్మసాని అనేక ప్రయత్నాలు చేస్తున్నారుకూటమి ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ ఉంటాం’ అని హెచ్చరించారు.

ఇదీ చదవండి: అధికార టీడీపీకి ఊహించని షాక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement