కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదోని మండలం నెట్టేకల్ క్రాస్ వద్ద ఓ ఆటో.. కారును బలంగా ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, కర్నూలు జిల్లాలోని, ఆదోని మండలం నెట్టేకల్ క్రాస్‌రోడ్డు వద్ద వలస కూలీలకు వెళ్ళి, తిరిగి వస్తుండగా ఓ ఆటో అదుపుతప్పి కారును బలంగా ఢీకొంది. దీంతో ఈ ఘటనలో మహేశ్వరి (25) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు.
అయితే, ఈ ప్రమాదానికి గురైన వారంతా ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల ఇతర కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?


