పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు | Punjab gangster Gurwinder alias Afridi Arrested brought back to India | Sakshi
Sakshi News home page

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది అరెస్ట్.. భారత్‌కు తీసుకొచ్చిన పోలీసులు

Nov 8 2026 7:24 PM | Updated on Nov 8 2026 7:24 PM

Punjab gangster Gurwinder alias Afridi Arrested brought back to India

సాక్షి, న్యూఢిల్లీ: 30కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న పంజాబ్ గ్యాంగ్‌స్టర్ గుర్విందర్ అలియాస్ అఫ్రిదిని పోలీసులు భారత్‌కు తీసుకొచ్చారు. ఇథియోపియాలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం ఢిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం పంజాబ్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అఫ్రిదిపై పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు కూడా గతంలో ప్రకటించింది.

పంజాబ్‌లోని తరన్ తారన్‌ జిల్లాకు చెందిన అఫ్రిది.. డోనీ బాల్-ప్రభ్ దస్సువాల్ గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఐదు హత్య కేసులతో పాటు హత్యాయత్నం, బెదిరింపులు, అక్రమ వసూళ్లతో పాటు అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. పంజాబ్‌లో జరిగిన పలు కీలక హత్యల వెనుక అఫ్రిది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

2025 మార్చిలో నకిలీ పాస్‌పోర్టుతో అఫ్రిది ముంబై నుంచి యూఏఈకి పారిపోయాడు. అనంతరం టర్కీ, కెన్యా, అంగోలా మీదుగా ఇథియోపియాకు చేరుకున్నాడు. అతడి కోసం ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కూడా జారీ అయింది.

పంజాబ్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ షాహిద్’లో భాగంగా పది నెలల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిఘా కొనసాగించి అతడిని పట్టుకున్నారు. అంతేకాదు ఆఫ్రికా దేశం నుంచి పరారీలో ఉన్న నేరస్థుడిని పంజాబ్ పోలీసులు భారత్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడిని పంజాబ్‌కు తరలించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.

ఇదీ చదవండి: ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు.. చైనా సాయం కోరుతున్న అమెరికా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement