జలపాతం వద్దకు అమ్మాయిని తీసుకెళ్లి దారుణం | Karnataka Man Takes Girlfriend To Gokak Waterfall For Marriage Talk Kills Her | Sakshi
Sakshi News home page

జలపాతం వద్దకు అమ్మాయిని తీసుకెళ్లి దారుణం

Nov 7 2026 9:30 PM | Updated on Nov 7 2026 9:30 PM

Karnataka Man Takes Girlfriend To Gokak Waterfall For Marriage Talk Kills Her

బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి విషయంపై మాట్లాడుకుందామని ప్రియురాలిని జలపాతం వద్దకు తీసుకెళ్లిన ఓ వ్యక్తి.. ఆమెతో వాగ్వాదం తర్వాత గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కొండ వాలుపై పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసుల దర్యాప్తులో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

బెలగావి జిల్లాకు చెందిన బసప్ప సత్తన్నవర్ (29) ఈ కేసులో నిందితుడు. అతడు బిహార్‌లో సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) 21వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మృతురాలు రక్షిత సరికర్ (23). వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రక్షితను పెళ్లి చేసుకుంటానని బసప్ప హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే పెళ్లి విషయం వీరిద్దరి మధ్య తరచూ గొడవలకు కారణమయ్యేదని తెలుస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 28న పెళ్లి, భవిష్యత్తు గురించి మాట్లాడుకుందామని చెప్పి బసప్ప రక్షితను కర్ణాటకలోని గోకాక్ జలపాతం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బసప్ప ఆమెపై దాడి చేశాడు. చెవిపై కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత జలపాతం సమీపంలోని కొండ వాలుపై రక్షిత మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రక్షిత ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. నవంబర్ 1న ఆమె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రక్షిత అదృశ్యం వెనుక హత్య ఉన్నట్లు గుర్తించారు. బసప్పను విచారించిన అనంతరం రక్షిత హత్య కేసులో అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హత్యకు సంబంధించిన ఇతర వివరాలు, ఘటన వెనుక ఉన్న పరిస్థితులపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement