సామూహిక హత్యాకాండలో కన్నకూతురే సూత్రధారి? | Bengaluru Father And Daughter Incident | Sakshi
Sakshi News home page

సామూహిక హత్యాకాండలో కన్నకూతురే సూత్రధారి?

Nov 7 2026 6:31 PM | Updated on Nov 7 2026 6:40 PM

Bengaluru Father And Daughter Incident

గత నెలలో బెంగళూరులో నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగుర్ని ఒక క్యాబ్‌ డ్రైవర్‌ అత్యంత పాశవికంగా నరికి చంపిన సామూహిక హత్యాకాండలో నిందితుడి ఇందుశేఖర్ (అలియాస్ శేఖర్) కుమార్తె పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   అత్యంత అమానవీయ హత్యకాండలో ఆమె.. తన తండ్రికి ప్రతీదశలోనూ సహకరించిందని బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కూతురు సహకారంతోనే కుటుంబంలోని బంధువుల్ని అత్యంత సులువుగా హత్య చేసినట్లు తెలుస్తోంది.   ఈ కోణంలో విచారిస్తున్న పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తును తీవ్రతరం చేశారు. 

బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని ఒక క్యాబ్ డ్రైవర్ అత్యంత కిరాతకంగా నరికి చంపిన సామూహిక హత్యాకాండలో నిందితుడి 17 ఏళ్ల మైనర్ కుమార్తె పాత్రపై పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఈ భయంకరమైన నేరంలో ఆమె తన తండ్రికి ప్రతి దశలోనూ సహకరించిందనే బలమైన అనుమానాలతో పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.

అంతా శత్రువులని కూతురికి మాయమాటలు చెప్పాడా?
నిందితుడైన ఇందుశేఖర్ తన 17 ఏళ్ల కుమార్తెను తీవ్రంగా బ్రెయిన్‌వాష్ చేసి మాయమాటలు చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  తన భార్యతో పాటు  కుటుంబ సభ్యులంతా  శత్రువులని, వారందరినీ చంపేస్తేనే ఆస్తి మొత్తం మనకే దక్కుతుందని, తద్వారా వారు ఆర్థికంగా స్థిరపడగలరని నమ్మించి  ఈ నేరంలో కుమార్తెను భాగస్వామిని చేసినట్లు తెలుస్తోంది.

కుమార్తెతోనే ఫోన్లు చేయించి బంధువుల్ని ఆహ్వానించాడా?
నిందితుడు మొదట తన భార్య సునీతను హత్య చేసిన తర్వాత, అతని కుమార్తె ద్వారానే ఆమె నానమ్మ (రూపావతి)కి ఫోన్ చేయించి ఇంటికి రప్పించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే తన పిన్నులను, బాబాయ్‌లకు కుటుంబాలను కూడా విందుకు ఆహ్వానించేలా ఆమెతోనే ఫోన్ చేయించాడని, ఆ సమయంలో తల్లి ఊరెళ్లిందని అబద్ధం చెప్పించాడని తెలుస్తోంది.

విడివిడిగా పిలిచి హత్యలు..
దాదాపు 15 నుండి 20 రోజుల వ్యవధిలో ఈ ఏడుగురిని విడివిడిగా పిలిపించి ఇందుశేఖర్ హత్య చేశాడు. అక్టోబర్‌ 16వ తేదీ నుంచి అక్టోబర్‌ 31 మధ్యలో ఈ హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రతి హత్య జరిగిన తర్వాత హత్య జరిగిన స్థలంలో ఎటువంటి రక్తం మరకలు లేకుండా శుభ్రం చేయడానికి, సాక్ష్యాలను పూర్తిగా తుడిచేయడానికి ఈ మైనర్ అమ్మాయి తండ్రికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

హత్య చేసిన అనంతరం మృతదేహాలను ప్యాక్ చేసి, కారులో వేర్వేరు ప్రాంతాలకు తరలించి పడేయడంలో కూడా ఆమె తండ్రికి అండగా నిలిచిందనేది ప్రాధమికంగా బలంగా వినబడుతున్న మాట. పోలీసుల తనిఖీల్లో దొరక్కుండా ఉండేందుకు, కారులో కూతురు ఉంటే ఎవరికీ అనుమానం రాదనే ప్లాన్‌తో ఇందుశేఖర్ ఆమెను తనతో పాటు తీసుకెళ్లి మరీ వాటిని పడేసినట్లు అనుమానిస్తున్నారు. 

చనిపోయిన వారి మొబైల్‌ ఫోన్లు దగ్గరే పెట్టుకుని..
ఈ హత్యలు తర్వాత ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు వారి మొబైన్లను సైతం తమ వద్దే పెట్టుకుని తప్పుడు మెసేజ్‌లు పంపేవారట. తాము టూర్‌కు వెళ్లామని చనిపోయిన వారి మొబైల్‌ ఫోన్ల నుంచి మెసేజ్‌లు చేసేవారనేది విశ్వసనీయ సమాచారం. తాము క్షేమంగా ఉన్నామని ఆ మెసేజ్‌ల సందేశం ద్వారా పంపేవారని చెబుతున్నారు. ఈ మెసేజ్‌లు పంపడంలో కూడా కూతురు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:  అల్లుడి కిరాతకం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement