ప్రేమించలేదని యువతిపై లైంగిక దాడి | Rapido Driver Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని యువతిపై లైంగిక దాడి

Nov 7 2026 12:54 PM | Updated on Nov 7 2026 12:57 PM

Rapido Driver Incident In Hyderabad

హైదరాబాద్‌: తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ  సంఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రంజాన్‌(23) గత ఎనిమిది నెలల కిత్రం నగరానికి వలస వచ్చి దుండిగల్‌లోని ఎల్లూరి బస్తీలో ఉంటూ ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 

ఇతని ఇంటి పక్కనే నివసిస్తున్న ఓ యువతి(19) డిగ్రీ చదువుతోంది. కాగా గత కొంత కాలంలో రంజాన్‌ యువతిని తనను ప్రేమించాలని వేధించాడు. ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో యువతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement