సమాధి తవ్వి యువతి తల, చేతులు ఎత్తుకెళ్లిన దుండగులు! | Odisha woman dead body missing | Sakshi
Sakshi News home page

సమాధి తవ్వి యువతి తల, చేతులు ఎత్తుకెళ్లిన దుండగులు!

Nov 7 2026 11:49 AM | Updated on Nov 7 2026 12:06 PM

Odisha woman dead body missing

మూఢ నమ్మకాలు జడలు విప్పడంతో వికృత చేష్టలు బయటపడ్డాయి. సమాధి నుంచి యువతి తల, చేతులు తీసుకొని వెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా నబరంగ్‌పూర్‌ జిల్లా నర్సింగ్‌ గుడ గ్రామంలో నీలాద్రి మజ్జి (27) అనే యువతి చికెన్‌ ఫాక్స్‌ (గాలి జల్లింపు) వ్యాధితో మృతి చెందింది.

ఇలా చనిపోయిన అవివాహితని దహనం చేయకూడదని, సమాధి చేయాలని గిరిజనులు నిర్ణయించారు. అదేరోజు మరో ప్రచారాలు జరిగాయి. ఇటువంటి అవివాహిత గాలి జల్లింపుతో చనిపోతే ఆమె తల, చేతులతో పూజలు చేస్తే ప్రత్యేక శక్తులు వస్తాయని ప్రచారాలు జరిగాయి. దీంతో గ్రామస్తులు 21 రోజులు ఆ సమాధి దగ్గర రాత్రింబవళ్లు కాపాలా కాశారు. మృతదేహానికి రక్షణగా ఉన్నారు. అనంతరం వదిలేశారు. అయితే మరణించిన 42వ రోజు ఆ మార్గం గుండా వెళ్తున్న వ్యక్తులకు సమాధి తవ్వితీసిన ఆనవాళ్లు కనిపించాయి. 

అంతేకాకుండా ఆ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగిన వస్తువులు ఉన్నాయి. ఈ విషయం దావాణంలా వ్యాపించడంతో పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఫోరెన్సిక్‌ బృందం సమక్షంలో సమాధిని మరలాతవ్వారు. అయితే మృతదేహంకి తల, చేతులు లేకపోవడంతో అందరూ నివ్వెరపోయారు. క్లూస్‌ టీం ఆ ప్రాంతంలో దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు కేసు నమెదు చేసి తల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: భార్యను హత్య చేసిన ఏఆర్‌ కానిస్టేబుల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement