breaking news
Woman body found
-
పేలుడు పదార్థాన్ని నోట్లో కుక్కి ప్రియురాల్ని చంపేశాడు
మైసూరు: కర్నాటకలోని మైసూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. సుమారు 20 ఏళ్లున్న ఓ వివాహితను ఆమె ప్రియుడు పేలుడు పదార్థాన్ని ఆమె నోట్లో కుక్కి పేల్చేశాడు. మహిళ మృతదేహం బెడ్‌పై పడి ఉండగా, ఆమె ముఖం దిగువ భాగం ఛిద్రమైనట్లుగా కనిపిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అక్కడి ఫ్లోరంతా రక్తం ధారలుగా కనిపిస్తోంది. ఆమెను హున్సూర్ తాలుకా గెరసనహళ్లికి చెందిన రక్షితగా గుర్తించారు. భెరియా గ్రామంలోని ఓ లాడ్జిలో రక్షిత విగతజీవిగా కనిపించింది. ఆ లాడ్జి గదికి ప్రియుడు సిద్ధరాజుతో కలిసి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేరళకు చెందిన రోజువారీ కూలీతో ఈమెకు వివాహమైంది. అయితే, రక్షిత తన బంధువైన సిద్ధరాజుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. లాడ్జిలో ఉండగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే సిద్ధరాజు తన వద్ద ఉన్న పేలుడు రసాయనాన్ని ఆమె నోట్లో కుక్కి జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చాడు. ఇలాంటి జిలెటిన్ స్టిక్స్‌ను క్వారీల్లో బండలను పేల్చేందుకు వాడుతుంటారని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ పేలడంతోనే ఆమె చనిపోయిందంటూ అక్కడికి వచ్చిన వారితో సిద్ధరాజు కట్టుకథ చెప్పాడు. పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సాలిగ్రామ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: సూట్‌కేసులో యువతి మృతదేహం
నిజాంపేట్: ఓ యువతిని హత్య చేసి సూట్‌కేసులో తీసుకువచ్చి బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో పడేసిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బుధవారం బాచుపల్లిలోని జీతేపీర్ దర్గా ఎదురుగా ఉన్న జీపీఆర్ లే అవుట్ విజయదుర్గ ఓనర్స్ అసోషియేషన్ కాలనీలో పొదల మధ్యలో ఓ సూట్‌కేసు నుంచి గత రెండు రోజుల నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాచుపల్లి ఇన్స్పెక్టర్ ఉపేందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అందులో యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఐదు నుంచి పది రోజుల క్రితం ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తే కీలకం.. యువతి హత్య పోలీసులకు సవాల్‌గా మారింది. ఎక్కడో చంపేసి సూట్‌కేసులో మృతదేహాన్ని తీసుకువచ్చి ఇక్కడ పడేయడం, అందులో మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పోలీసులకు దర్యాప్తు కీలకంగా మారింది. రంగంలోకి ఐదు పోలీసు బృందాలను దింపి సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అదే విధంగా వివిధ పోలీస్‌స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన వారి వివరాలతో పోల్చి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడి నుంచి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాజులు, డ్రెస్‌లే ఆధారాలు.... మృతి చెందిన యువతి ఒంటిపై ఉన్న గాజులు, డ్రెస్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భార్యా భర్తల గొడవల కారణంగా ఏమైనా ఈ హత్య జరిగిందా? లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఒంటిపై మెరున్ కలర్ పంజాబీ డ్రెస్ ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళనా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి చేసుకుందని... యువతిని కన్న తండ్రే గన్‌తో కాల్చేశాడు!
న్యూఢిల్లీ: గత వారం ఉత్తర్‌ప్రదేశ్‌లో మధురలో ఒక సూట్ కేసులోని యువతి మృతదేహం పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో పోలీసులు పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ యువతిని ఆమె తండ్రే హత్య చేసినట్లు తెలిపారు. సదరు బాధిత యువతి ఆయుషి చౌదరిగాగా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు మధుర సూపరింటెండెంట్ పోలీస్ మాట్లాడుతూ...ఆయుషీని ఆమె తండ్రి నితీష్ యాదవ్ తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్‌తో హతమార్చినట్లు తెలిపారు. ఆమె తన కుటుంబ సభ్యలకు ఇష్టం లేని మరో వర్గం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. ఆమె తన తల్లిందడ్రులకు కనీసం చెప్పకుండా వేరే వర్గానికి చెందిన ఛాత్రపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పారు. దీంతో ఆమె తండ్రి యాదవ్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక గన్‌తో ఆమెను కాల్చి చంపినట్లు తెలిపారు. ఆమెను హత్యచేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి మధురలో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు. కాగా, గత శుక్రవారం మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద ఒక ఎరుపు రంగు సూట్‌కేసు ఉందని కొంతమంది కార్మికులు ఫిర్యాదు చేయడంతోనే ఈ ఘటన వెలుగు చూసిందన్నారు పోలీసులు. ఆమె శరీరంపై పలు రక్తపు గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసుల హత్య కేసుగా నమోదు చేసుకుని, నిందితులను అదుపలోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు వద్ద నుంచి గన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. (చదవండి: ఒకే ఫ్యామిలీలో ఆరుగురు మృతి.. అసలేం జరిగింది?) -
వికారాబాద్ జిల్లాలో దారుణం
-
భర్త చితిలో భార్య శవం
ముంబై: మరోసారి సతీసహగమనాన్నితలపించే దృశ్యం ఆవిష్కృతమైంది. చనిపోయిన భర్త చితికి నిప్పంటించిన అనంతరం కనిపించకుండా పోయిన భార్య.. భర్తతోపాటు తాను కాలిబూడిదై పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, ఆమెతో భర్త కుటుంబ సభ్యులు సతీసహగమన చర్యకు పాల్పడేలా చేశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. తుకారాం అనే వ్యక్తి (55) గుండెపోటుతో ఆదివారం సాయంత్ర చనిపోయాడు. పోలీసులు కూడా అతడి మరణాన్ని ధృవీకరించారు. సోమవారం తుకారం అంత్యక్రియలు జరిగాయి. కానీ, అదే రోజు తుకారాం భార్య ఉష(50) కనిపించకుండా పోయింది. మరుసటి రోజు తుకారం చితాభస్మాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు స్మశానం వద్దకు వెళ్లగా అక్కడే ఉష కూడా కాలిపోయి ఉన్నట్లు గుర్తించారు. చనిపోయిన ఆ భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, పోలీసులు మాత్రం కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సతీ చర్యను భారత్ ఎప్పుడో రద్దు చేసిన విషయం తెలిసిందే.