హైదరాబాద్: కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న గంజాయి లేడీ డాన్ కలపాటి నీతూ భాయిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో ఆమెను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ అండ్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈగల్) టీమ్ అరెస్టు చేసింది. గత 9 ఏళ్లుగా నీతూ భాయి గంజాయి దందా కొనసాగిస్తుంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్‌గా ఆమె గంజాయి వ్యాపారం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెపై పలు కేసులు నమోదు కాగా, గత రెండేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతుంది. అయితే నీతా భాయిపై తీవ్రంగా దృష్టి పెట్టిన ఈగల్ టీమ్.. ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. నీతూ భాయిపై సుమారు 30కి పైగా కేసులు ఉన్నాయి.
ఆమెను అరెస్టు చేసే క్రమంలో ఎలాంటి మత్తు పదార్థాలు లభించనప్పటికీ రూ. లక్ష వరకూ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నీతూ భాయి అక్రమ సంపాదన, మనీ లాండరింగ్‌పై ఈడీ హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: సమాధి తవ్వి యువతి తల, చేతులు ఎత్తుకెళ్లిన దుండగులు!


