హకీంపేట (వికారాబాద్ జిల్లా): బీఆర్‌ఎస్ పాలనలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆరేనని, కాకపోతే ఆయన హయాంలోనే అది కూలిందని చెప్పారు. ఆనాడు పాలమూరు నుంచి కేసీఆర్‌ను ఎంపీగా ఎన్నుకున్నారని, విఠల్‌రావును కాదని పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను గెలిపించారని అన్నారు.
వికారాబాద్ జిల్లాలోని హకీంపేటలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే పాలమూరు అభివృద్ధి చెందేది. పదేళ్లలో కేసీఆర్ ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. పాలమూరు ప్రజలకు కేసీఆర్ అన్యాయం చేశారు. సాగునీరు, తాగునీరు అందించాలన్న ఆలోచన కేసీఆర్ చేయలేదు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. ఎస్‌ఎల్‌బీసీపై కేసీఆర్ మనసు పెట్టి ఉంటే ఎప్పుడో పూర్తయ్యేది’’ అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.


