భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ కేడర్‌లో మార్పులు చేపట్టింది. గవర్నర్ ఆమోదంతో సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా అటవీ అభివృద్ధి సంస్థ చేర్మన్, కేబీకే ముఖ్య నిర్వాహకుడిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ బిష్ణుపద సెఠిని, సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖలో ప్రత్యేక విధి అధికారిగా (ఓఎస్‌డీ) నియమించారు.
పంచాయతీరాజ్, తాగునీటి శాఖలో కమిషనర్ కమ్ సెక్రటరీగా పని చేస్తున్న గిరీష్ ఎస్.ఎన్ బదిలీ చేసి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు ప్రభుత్వ కమిషనర్ కమ్ సెక్రటరీగా నియమించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీగా, ఒడిశా స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇనిషియేటివ్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అశ్వతి ఎస్, ఆర్థిక శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర డిప్యుటేషన్ నుంచి తిరిగి వచ్చిన రూపా మిశ్రా, పంచాయతీ రాజ్ మరియు తాగునీటి శాఖకు కమిషనర్ కమ్ సెక్రటరీగా నియమితులయ్యారు.


