సాక్షి, హైదరాబాద్: పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం.. తాజాగా కాంట్రవర్సీలు జరిగిన శాఖల నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. విద్యుత్ శాఖ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ తప్పించిన సర్కార్.. సీనియర్ ఐఏఎస్ అధికారి సభ్యసాచి ఘోష్ నుంచి ట్రైబల్ వెల్ఫర్ శాఖ తొలగించింది. స్పెషల్ సీఎస్ జయష్ రంజన్ నుంచి మున్సిపల్ శాఖలను సర్కార్ తప్పించింది.
ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. జయేష్ రంజన్‌కు ఈఎఫ్‌ఎస్ అండ్ టీ శాఖ బాధ్యతలు అప్పగించించింది. వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. నవీన్ మిట్టల్‌కు రెవెన్యూ, ఆర్‌అండ్‌ఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌ఎస్‌ఏడీ శాఖల బాధ్యతలు అప్పగించింది.
శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇవ్వగా.. ఎ.వాణీ ప్రసాద్‌కు స్పోర్ట్స్, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రాహుల్ బొజ్జాకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు ఇవ్వగా.. ఐలంబార్తి కేకు రవాణా శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది.
సర్ఫరాజ్ అహ్మద్‌కు హెచ్‌ఎండీఏ, మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధి సంస్థల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. శృతి ఓజాకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫారూఖీ, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణలకు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం.. జితేష్ వి. పాటిల్‌కు టీజీఎస్పీడీసీఎల్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను అప్పగించింది.
ఇదీ చదవండి: అమ్మలా లాలించి.. అన్నం వడ్డించి


